సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి కేంద్ర ఆర్థిక చేయూతతో అమలు చేస్తున్న స్టేట్ డెవలప్‌మెంట్ ప్లాన్ స్కీమ్స్ కోసం బడ్జెట్‌లో గతంలో ఎన్నడూలేనిరీతిలో నిధులు కేటాయించారు. 60ః40 నిష్పత్తిలో ఈస్కీమ్స్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయిస్తుంటాయి. కొన్ని పథకాలకు మనం ఎంత ఖర్చు చేస్తే ఆ స్థాయిలోనే కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తుంది. 2020–21 బడ్జెట్‌లో రూ.970.52 కోట్లు కేటాయించారు.
దీంతో 2021–22లో ఈ స్కీమ్స్ కోసం అధికారులు రూ.1,555.48 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. కేంద్ర పథకాల సౌజన్యంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఏకంగా రూ.1,989.68 కోట్లు కేటాయించారు. కేంద్ర పథకాలకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు జరగడం ఇదే తొలిసారి అని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేంద్రం చేయూతతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు (రూ.కోట్లలో)
పథకం పేరు 2020-21 2021-22
రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై) 237.23 583.44
నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్స్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) 86.22 133.08
నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్–ఆయిల్ సీడ్ 36.91 53.87
నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్
అండ్ టెక్నాలజీ (ఎన్‌ఎంఏఈటీ) 85.09 92.07
సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఎఎం) 207.83 739.46
నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (ఎన్‌ఎంఎస్‌ఎ) 141.73 215.89
పరంపరాగత్ కృషి వికాస యోజన 175.51 171.87
మొత్తం 970.52 1,989.68
Comments
Please login to add a commentAdd a comment