state development
-
అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితం: మంత్రి జోగిరమేష్
-
రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే!
సాక్షి, తాడేపల్లి: పచ్చి అబద్ధాలతో పచ్చ రాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. సోమవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఈనాడు అధినేత రామోజీరావుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితం అయ్యిందని, రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ‘‘పేదలకు ఇళ్లు కట్టించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ప్రభుత్వం పని చేస్తోంది. కానీ, ఈ ప్రభుత్వంపై దిగజారుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో స్థలం ఇవ్వలేదు.. ఇల్లూ కట్టలేదు. 14 ఏళ్ల పాలనలో ఏమీ చేయని చంద్రబాబుకు రామోజీరావు వంతపాడుతున్నారు. ఇప్పుడేమో సీఎం జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్న మంత్రి జోగి రమేష్.. జరుగుతున్న వాస్తవాలను రామోజీరావు చూడలేకపోతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఊరికొక ఇంటిని కట్టారు.కానీ, సీఎం వైఎస్ జగన్ కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. పేదలకు ఇళ్లు కడుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. తప్పుడు కథనాలపై చర్చకు సిద్ధమా అంటూ రామోజీరావుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. -
AP Cabinet Reshuffle: కొడాలి నానికి కీలక పదవి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు. చదవండి: (ఏపీ నూతన కేబినెట్.. కొత్త మంత్రులు వీరే..) -
మంచి పాలన అందించండి
సాక్షి బెంగళూరు: ప్రజలకు ఉత్తమ పాలన అందించాలని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బసవరాజబొమ్మై తొలిసారిగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్ని విధాల సహకారం అందిస్తాం... ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మోదీ స్పందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. ఇదే సమయంలో వరద నష్ట పరిహారం అందించాలని, హుబ్లీ–ధారవాడ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, రాయచూరుకు ఎయిమ్స్ తరహాలో వైద్య సంస్థను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కలబురిగి ఈఎస్ఐ వైద్య కళాశాల, స్థానిక ఆస్పత్రిని ఎయిమ్స్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించి వారం రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలిపారు. -
AP Budget 2021: కేంద్ర పథకాలకు పెరిగిన కేటాయింపులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి కేంద్ర ఆర్థిక చేయూతతో అమలు చేస్తున్న స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ స్కీమ్స్ కోసం బడ్జెట్లో గతంలో ఎన్నడూలేనిరీతిలో నిధులు కేటాయించారు. 60ః40 నిష్పత్తిలో ఈస్కీమ్స్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయిస్తుంటాయి. కొన్ని పథకాలకు మనం ఎంత ఖర్చు చేస్తే ఆ స్థాయిలోనే కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తుంది. 2020–21 బడ్జెట్లో రూ.970.52 కోట్లు కేటాయించారు. దీంతో 2021–22లో ఈ స్కీమ్స్ కోసం అధికారులు రూ.1,555.48 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. కేంద్ర పథకాల సౌజన్యంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఏకంగా రూ.1,989.68 కోట్లు కేటాయించారు. కేంద్ర పథకాలకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు జరగడం ఇదే తొలిసారి అని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేంద్రం చేయూతతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు (రూ.కోట్లలో) పథకం పేరు 2020-21 2021-22 రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) 237.23 583.44 నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్స్ (ఎన్ఎఫ్ఎస్ఎం) 86.22 133.08 నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్–ఆయిల్ సీడ్ 36.91 53.87 నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ (ఎన్ఎంఏఈటీ) 85.09 92.07 సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఎఎం) 207.83 739.46 నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (ఎన్‌ఎంఎస్‌ఎ) 141.73 215.89 పరంపరాగత్ కృషి వికాస యోజన 175.51 171.87 మొత్తం 970.52 1,989.68 చదవండి: AP Budget 2021: హోం శాఖకు రూ.7,039 కోట్లు -
అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అభివృద్ధికి విపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ నుంచి పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాల వరకూ ప్రతీ అభివృద్ధి పనికి చంద్రబాబు విఘాతం కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అనుభవమని చెప్పి చివరకి అప్పులు మిగిల్చిపోయారని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు విని.. వాటికనుగుణంగా రెండు పేజీల మేనిఫెస్టోను తయారుచేసి.. కేవలం ఏడాది పాలనలోనే 90 శాతంపైగా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► మా ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేశాం. అమ్మ ఒడి నుంచి ఆరోగ్యశ్రీ వరకు అన్ని సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధిక నిధులు కేటాయిస్తున్నారు. ► ఉత్తరాంధ్రలో మహానేత వైఎస్సార్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. మళ్లీ ఆ తరహా అభివృద్ధి ఆయన తనయుడు వైఎస్ జగన్‌తోనే జరుగుతుంది. ► విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటిస్తే.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. ► పరిపాలన వికేంద్రీకరణ నుంచి ప్రతీ అభివృద్ధి పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ► ఐదేళ్లలో చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్క సంక్షేమ పథకాన్నయినా అమలుచేశారా?. ► మా పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నేరుగా ప్రజల దగ్గరకే వెళ్లి మా ఎన్నికల మేనిఫెస్టో ఇస్తాం. అందులో ఏయే సంక్షేమ పథకాలు అమలుచేశామో నేరుగా ప్రజలే చెబుతారు. ► లాక్డౌన్ కారణంగా చాలామంది ప్రజలు తినడానికి తిండిలేకుండా బాధపడుతుంటే.. హైదరాబాద్‌లో మనవడితో చంద్రబాబు ఆడుకున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. కేవలం జూమ్ వీడియోలకే పరిమితమయ్యారు. -
వైఎసార్సీపీతోనే రాష్ట్రాభివీధి సాద్యం: డీఎల్ రవీద్రారెడ్డి
-
రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యం
బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యమని జిల్లా బీజేడీ అధ్యక్షుడు, గోపాలపూర్ ఎమ్మెల్యే ప్రదీప్‌కుమార్ పాణిగ్రహి అన్నారు. గోపాలపూ ర్ నియోజవర్గ పరిధిలోని నరేంద్రపూర్‌లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీతలపల్లిలో కమ్యూనిటీ భవనం, నారాయణపూర్ గ్రామంలో రహదారి నిర్మాణం కోసం శంకుస్థాప న చేశారు. అనంతరం కోరాపల్లిలో కల్యాణ మం డపం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ప్రజ లకు అండగా బీజేడీ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేడీ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, కార్యకర్తలు, సమితి సభ్యులు పాల్గొన్నారు. -
రాజధాని బాండ్లు రాష్ట్రానికి గుదిబండ!
సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరమైన పంథాలో వెళుతున్నారని, రాజధాని బాండ్లు రాష్ట్ర భవిష్యత్తుకు గుదిబండగా మారుతాయని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో నిధులు సేకరించనున్నట్లు సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాణిజ్యపరంగా చూస్తూ మెగా రాజధాని నిర్మాణం విజయవంతమైన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, బ్యాంకు వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీకి నిధులు సేకరిస్తే అది చివరికి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందన్నారు. బ్రెజిల్ దేశంలో మౌలిక వనరులన్నీ సమీకరించి రాజధానిని నిర్మిస్తే చివరికి అది ఆర్థిక సంక్షోభానికి దారితీసి దేశాన్ని మిలటరీ హస్తగతం చేసుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా పెట్రోలియం డాలర్లతో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన నిధులతో మలేసియా, నైజీరియా వంటి దేశాలు రాజధాని నగరాలు నిర్మిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించే ఉంటే మరింత అభివృద్ధి చెందేవారన్న విమర్శలను పెద్ద ఎత్తున ఎదుర్కొన్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద నగరాలున్నాయని, ఇప్పుడు రాజధాని పేరుతో మరో మెగా సిటీ అవసరం లేదని, పరిపాలన రాజధాని నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణ.. మెగా రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతింటుందన్న విషయాన్ని విపులంగా హిందూ పత్రికలో వ్యాసాన్ని రాశారని, ఇప్పటిౖకైనా సీఎం ఈ మానియా నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవం పేరుతో రెచ్చగొట్టొద్దు.. తాము ఇచ్చిన నిధులకు కేంద్రం లెక్కా పత్రాలు అడగడంతో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందంటూ సీఎం బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఐవైఆర్ తప్పుపట్టారు. కాగ్ అనేది కేవలం అకౌంటింగ్ సంస్థ మాత్రమేనని, ఎన్నికల హామీ అయిన రుణ మాఫీ వ్యయాన్ని కూడా లోటు కింద భర్తీ చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయి కాబట్టి కేంద్రం తిరస్కరించిందన్నారు. కేంద్రం ఇతర పథకాలు, ప్రాజెక్టులకు ఇచ్చిన నిధులకు మాత్రమే యూసీలను అడుగుతుందని, ఆ నిధులు సరిగా వినియోగమయ్యాయా లేక వేరే పథకాలకు మళ్లించారా అని తెలుసుకున్న తర్వాతనే మిగిలిన నిధులు విడుదల చేస్తారన్నారు. యూసీలను ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం తగదన్నారు. -
'హామీల అమలులో సర్కారు విఫలం'
► వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు ► జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ గుప్తా సిద్దిపేట : ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివారావు, జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌గుప్తా ఆరోపించారు. సోమవారం మండలంలోని తోటపల్లి గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎంతో ఆర్భాటంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాలపై ప్రచారం చేసుకున్నారు. అధికారం చేపట్టిన తరువాత ఓట్లవేసి గెలిపించిన ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఆవుతున్నా ఎర్రవల్లి, నర్సన్నపేటలో మాత్రమే ఇళ్ల నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు, సీఎం దత్తత గ్రామం కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్‌లో మరి ఆధ్వాన్నంగా ఉందన్నారు. కరువు నష్టపరిహారం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి, వారికి దగా చేస్తుందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులపై నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణ సరే ప్రజలకు మూడు పూటల తిండి లేకుండా చేయవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కాని ఆ సమయంలో చిన్న నోట్లను అధికంగా వినియోగంలో తీసుకవస్తే బాగుండుందన్నారు. నోట్ల రద్దుతో పాకిస్తాన్, అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లోని టైస్ట్లకు చెంపపెట్టన్నారు. రబీ వ్యవసాయ పనులను జోరందుకున్న నేపధ్యంలో రైతులకు పెట్టుబడికి డబ్బులు అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. స్వైపింగ్ మిషన్లతో లావాదేవీలు సాధ్యం కాదన్నారు. భారతదేశంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని అంతేకాకుండా బ్యాంకు ఖాతాలు ప్రజలందరి లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా చిల్లర నోట్ల కష్టాలు లేకుండా పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వజ్రోజ్ శంకరాచారి, జంగిడి రమేష్‌రెడ్డి, చిన్నకోడూర్, బెజ్జంకి, గన్నేరువరం మండల అధ్యక్షులు ఎదుల నర్సింహరెడ్డి, ధర్మపురీ శ్రీనివాస్, న్యాలపట్ల శంకర్‌గౌడ్, శంకర్ పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మనోహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం కేసీఆర్ ఆశలు కల్పించారని, వడ్డీలు కూడా మాఫీ చేయక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. ఫసల్ బీమా వంటి పథకంలో ప్రభుత్వం కనీసం భాగస్వామి కాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు లేదని, ప్రభుత్వంలో చలనం లేదని ఆయన మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వందేళ్లు కావస్తుండగా పెద్ద సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయకపోగా జాతీయస్థాయి (న్యాక్) గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. -
అభివృద్ధి ఉత్తిమాటే!
► నాయుళ్లిద్దరూ దోచేస్తున్నారు ► స్టీల్‌ప్లాంట్‌ను బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నాలు ► టీడీపీ హయాంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ► ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి డాబాగార్డెన్: విశాఖ నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న మాటలకు అర్థం లేదని, విశాఖ ప్రజలను దోచుకునేందుకే వీరు ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న దోపిడీని ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలో కూరుకుపోతే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, కనీసం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సందర్శించారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌లో లక్షా 50వేల టన్నుల స్టాక్ ఉన్నా అమరావతికి 2,500 టన్నులు మాత్రమే సరఫరా చేయడమేమిటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించి బడాబాబులకు కట్టబెట్టేందుకే నాయుళ్లిద్దరూ ఉన్నారని విమర్శించారు. గతంలో స్టీల్‌ప్లాంట్ నష్టాల బాటలో ఉంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదుకున్నారని చెప్పారు. బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేâýæ్లయినా బీహెచ్ఈఎల్, షిప్‌యార్డ్‌కు ఒక్క ఆర్డరైనా తెప్పించారా అని అడిగారు. హుద్‌హుద్ తుపానులో నష్టపోయినా ఒక్కపైసా కూడా ఇన్సూరెన్స్ రాలేదన్నారు. చంద్రబాబు మాటలు బేతాళకథలు నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల స్థలం కబ్జా అవుతోందని తమ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. దసపల్లా హిల్స్‌లో రాణిగారి స్థలం(2వేల గజాల్లో)లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలు బేతాâýæ కథల్లా ఉన్నాయని, ఇసుక కుంభకోణంలో 70 మంది ఎమ్మెల్యేలకు ప్రత్యక్ష సంబంధాలున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కోర్టుల్లో ప్రభుత్వ వాదన సరిగ్గా లేకపోవడంతో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తెలిపారు. తమ పార్టీకి అనుకూలమైన కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఇక్కడికి రప్పించుకుని ఆగడాలు సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తీరుపై న్యాయ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీడీఎఫ్ రాష్ట్ర అ«ధ్యక్షుడు పక్కి దివాకర్, వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్‌ఆలీ, సేవాదళ్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధ పాల్గొన్నారు. -
హోదాతోనే రాష్ట్రాభివృద్ది
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అనుమసముద్రంపేట : ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌పేట మండలంలోని పొనుగోడు గ్రామంలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం అన్నీ విధాలుగా అభివృద్ధి చెందేందుకు హోదా ముఖ్యమన్నారు. హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గతంలో పొనుగోడులో పర్యటించినప్పుడు స్థానికులు నీటి సమస్యను తన దృష్టికి తెచ్చారని దీంతో ప్లాంట్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఇచ్చిన మారాజు సుబ్బయ్యను అభినందించారు. ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచే సిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను దగ్గరగా చూసి పరిష్కరించేందుకు వీలు కలుగుతోందన్నారు. సర్పంచ్ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మహిళా కన్వీనర్ బోయిళ్ల పద్మజారెడ్డి, ప్రముఖ ఇంజనీరు బోయిళ్ల చెంచురెడ్డి, అనుమసముద్రం, రాజవోలు సర్పంచులు పులిమి వెంకటరమేష్‌రెడ్డి, లక్ష్మీదేవి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యం
జాతీయ సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ నెల్లూరు (టౌన్): రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయప్రకాష్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకేంద్రంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో సంప్రదాయ సముద్రనీటి వనరుల విజ్ఞానంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి విజయప్రకాష్ మాట్లాడుతూ సముద్ర జీవజాల పునః సమీకరణ అవసరమన్నారు. ఏపీకి ప్రకృతి సంపద, జల వనరులు మంచి ఆదాయ మార్గాలన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 221 మత్స్య కేంద్రాలతో పాటు 6,23,000 గ్రామాలు ఉన్నాయన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అంతకంతకూ పెరుగుతున్న సముద్ర నీటిమట్టం మూలంగా మత్స్యకార జీవితాలపై పెనుప్రభావం పడుతుందని తెలిపారు. సముద్ర నీటిమట్టం ఒక మీటరు పెరిగినా ఏపీలో 282 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. మొత్తం 1.29 మిలియన్ల జనాభా తమ ఆవాసాలను కోల్పోతారని చెప్పారు. వీసీ వీరయ్య మాట్లాడుతూ వీఎస్‌యూ మెరైన్ బయాలజీ విభాగం గొప్ప పరిశోధనలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. అంటార్కిటికా లాంటి మంచు ఖండంలో దొరికే అత్యంత పౌష్టికాహారమైన క్రిల్స్‌లాంటి వాటిపై పరిశోధనలు చేసేందుకు సన్నద్ధం కావాలని తెలిపారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ పరిశోధనలో ప్రాంతీయ అవసరాలకు ప్రధాన భూమిక ఇవ్వాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు జిల్లాకు మంచి ఆభరణమైనా, దాని మూలంగా ఎంతో అమూల్యమైన మడ అడవులు అంతరించడంపై మెరైన్ బయాలజీ విభాగం దృష్టి సారించాలన్నారు. సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి విజయ మాట్లాడుతూ 2014 వరకు 187వేల టన్నులు మత్స్య ఉత్పత్తి చేయగా ప్రస్తుతం దానిని 319వేల టన్నులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్సిటీతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో మూడు కొత్త మత్స్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ సంకలనం చేసిన ఫిష్ అండ్ ఫిషరీస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్రా అభివృద్ధి పై రాజన్నమాట
-
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నల్లగొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో ముందుండి పోరాడిన జాగృతి కార్యకర్తలు అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత తొలిసారిగా నల్లగొండలో నిర్వహించిన తెలంగాణ జాగృతి పదో వార్షికోత్సవ ప్రతినిధులసభలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సభకు రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన జాగృతి కన్వీనర్లు, రాష్ట్ర బాధ్యులు హాజరయ్యారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. తెలంగాణ అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని పది నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ఆమె జాగృతి స్థాపించి పదేళ్లు పూర్తియిన సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన విజ యాలు, భవిష్యత్‌లో పోషించాల్సిన పాత్రపై కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ను కాపాడుకునే క్రమంలో జాగృతి పోషిం చిన పాత్రను వివరించారు. జాగృతి రూపొందించిన ‘గమ్యం-గమనం’ అనే కరదీపికను కార్యకర్తలకు అందజేశారు. రాష్ట్రాభివృద్ధి మన గమ్యం అయితే.. ఆ గమ్యాన్ని చేరుకునేందుకు ఎంచుకునేది గమనం’ కావాలన్నారు. దీనికోసం జాగృతి శాఖలు విస్తరింపచేయడంతో పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. జాగృతి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,500 మందికి శిక్షణ ఇవ్వగా.. 17 వందల మందికి ఉపాధి కల్పిం చినట్లు వివరించారు. ఆత్మహత్య చేసుకున్న 369 రైతుల కుటుంబాలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం అందజేసినట్లు పేర్కొన్నారు. కోటిలింగాల చరిత్రను ప్రపంచానికి తెలియచెప్పడంలో జాగృతి ఎంతో కృషి చేసిందన్నారు. రానున్న రోజు ల్లో కమిటీల్లో మహిళలకు 30 శాతం చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో టీఎన్జీవోల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, కవులు, రచయితలు ఫ్రొఫెసర్ సిధారెడ్డి, వేణు సంకోజు, శ్రీధర్, జవహర్, విక్రాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కృషి
నెల్లూరు(బారకాసు): రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. మినీ బైపాస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం ఏ కేంద్ర ప్రభుత్వం చేయనంతగా ప్రధాన నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేషన్‌ను సంపూర్ణ ప్రక్షాళన చేయాలి కార్పొరేషన్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే పరిపాలన సవ్యంగా సాగుతుందని, మంత్రి నారాయణ దీనిపై చర్యలు తీసుకోవాలని కర్నాటి ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు. గ్రూపు రాజకీయాలతో కార్పొరేషన్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ముగ్గురు కమిషనర్లను మార్పించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం పంపుతున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. బీజేపీ నేతలు కుడుమల సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులుగౌడ్, నరసింహులునాయుడు, శ్రీనివాసులు, అంగీర్ జనార్దన్, కాయల మధు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న బాబు చైనా పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన నేటితో ముగియనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఐదు రోజుల చైనా పర్యటనలో బాబు బృందం అయా దేశాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. హాంకాంగ్ మీదుగా ఢిల్లీకి గురువారం సాయంత్రానికి చేరుకుంటారు. రేపు ఉదయం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో బాబు భేటీవుతారు. అనంతరం తిరిగి రాష్ట్రానికి పయనమవుతారు. -
వివాదాలకు ముగింపు పలకండి!
* రాష్ట్రాభివృద్ధికి అంతా కలసి పనిచేయండి * నగరి ఎమ్మెల్యే రోజా కేసులో సుప్రీం కోర్టు * ప్రజలే సుప్రీం.. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ కాదు * తన మాటల్లో ఉద్దేశం ఏంటో చెబుతూ స్పీకర్‌కు రోజా లేఖ రాస్తారు * ఆ లేఖతో ఇక ముగింపు పలకండి.. విచారణ నేటికి వాయిదా సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి అంతా కలసి పనిచేయాలని, వివాదాలకు ముగింపు పలకాలని ఏపీ రాష్ట్రానికి సుప్రీం కోర్టు హితవు పలికింది. తన మాటల్లో ఉద్దేశం ఏంటో తెలుపుతూ నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆర్.కె.రోజా శాసనసభాపతికి లేఖ రాస్తారని, ఈ లేఖతో 3 అభియోగాలతో ముడివడి ఉన్న వివాదాలకూ ముగింపు పలకాలని సుప్రీం కోర్టు హితవు పలికింది. ఇది తమ సలహా మాత్రమేనని స్పష్టం చేసింది. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని హైకోర్టులో సవాలు చేయగా తనకనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఇరు పక్షాలు వాదనలు వినిపించిన అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ముందుగా పిటిషనర్ ఆర్.కె.రోజా తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. రోజా సస్పెండైన తీరు, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు, దానిని నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను వివరించారు. ‘‘శాసనసభ నిబంధనావళిలోని 340 (2) నిబంధన ప్రకారమే ఏడాదిపాటు సస్పెండ్ చేశామని తొలుత చెప్పిన ప్రభుత్వం, తరువాత రాజ్యాంగంలోని 194 ఆర్టికల్ ప్రకారం సస్పెండ్ చేశామంది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా సింగిల్ జడ్జి అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. వాస్తవానికి 340 (2) నిబంధన కింద ఒక సభ్యుడిని ఆ సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ చేసే వీలుంది. కానీ రోజాను నిబంధనలకు విరుద్ధంగా డిసెంబర్ 18 నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఇక ఆర్టికల్ 194 పరిధిలో సభాహక్కుల తీర్మానం ద్వారా సస్పెండ్ చేయాలనుకుంటే అందుకు వీలుగా ఏపీ శాసనసభ కార్యకలాపాల నిబంధనావళి చాప్టర్ 20లోని సెక్షన్ 170 నుంచి 174 వరకు గల ప్రక్రియను అనుసరించాలి. కానీ ఇవేవీ లేకుండా కేవలం నిబంధన తప్పుగా ప్రస్తావించామంటే సరిపోదు. ఇది పొరపాటు కాదు. పిటిషనర్‌కు తన వివరణ ఇచ్చే అవకాశమే లేకుండా చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను లేవనెత్తినందుకే రోజాను సభ నుంచి బయటికి పంపాలని చూశారు. డిసెంబర్ 18న జరిగిన 2 ఘటనల్లో వేర్వేరు గా స్పందించారు. సభానాయకుడిని దూషిం చారంటూ ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే అనితను దూషించారంటూ ప్రివిలేజ్ కమిటీ నోటీసులిచ్చింది. ఈ రెండింటిలో విభిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? సీఎంను దూషించారని భావిస్తే అప్పుడూ ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీసులు ఇవ్వాలి కదా? తమిళనాడులో ఆరుగురు శాసనసభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోమర్ సాప్రేతో కూడిన ధర్మాసనం సహజ న్యాయసూత్రాలను పాటించలేదన్న కారణంతో సస్పెన్షన్‌ను ర ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది’’ అని వాదించారు. అహంతో తలెత్తుతున్న ఘర్షణలు ఈ సందర్భంలో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ.. ‘‘చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ అహంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. సభా నాయకులు, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేధోపరమైన చర్చలు జరగడం లేదు’’ అన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున న్యాయవాది పీపీ రావు స్పందిస్తూ ‘పిటిషనర్ సభకు క్షమాపణ చెప్పాలి’ అని కోరారు. జస్టిస్ అరుణ్ మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘‘పిటిషనర్ క్షమాపణ చెబితే మీరు వ్యవహారాన్ని ముగిస్తారా?’’ అని అడగ్గా పీపీరావు సమ్మతించారు. ఇందిరా జైసింగ్ స్పందిస్తూ.. దీనికీ ఒక ప్రక్రియ ఉందని, దానిని అనుసరించకుండా ఎలా చెప్పగలమని జవాబిచ్చారు. గత తీర్పులు పిటిషనర్‌కు అనుకూలం జస్టిస్ గోపాల గౌడ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో న్యాయసమీక్షకూ వెళ్లొచ్చు. సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పులు పిటిషనర్ వాదనలకు బలం చేకూర్చేవే. పిటిషనర్ తాను సభానాయకుడిని ఏ ఉద్దేశంతో అన్నారో స్పీకర్‌కు వివరణ ఇస్తారు. సభాకార్యక్రమాలు సజావుగా నడవాలి. న్యాయ వ్యవస్థగానీ, శాసన వ్యవస్థగానీ సుప్రీం కాదు. ప్రజలే సుప్రీం. ఒకవేళ పిటిషనర్‌కు సమ్మతమైతేనే వివరణ ఇస్తారు. అది కూడా సభలోనే’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో పిటిషనర్ తరఫు మరో న్యాయవాది నర్మద సంపత్.. పిటిషనర్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదన్నారు. పీపీ రావు కల్పించుకుని.. విచారం వ్యక్తంచేస్తూ స్పీకర్‌కు ఎమ్మె ల్యే లేఖ ఇస్తే ఈ వ్యవహారాన్ని ముగిం చేందుకు స్పీకర్‌ను ఒప్పిస్తానన్నారు. ‘‘మీరు విచారం వ్యక్తం చేయాలంటూ పట్టుపట్టొద్దు. ‘నేను ఆ ఉద్దేశంతో అనలేదు’ అని కేవలం ఒక వాక్యంలో లేఖ రాస్తారు’’ అని జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారు. ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. సభానాయకుడి విషయంలో, ఎమ్మెల్యేలు అనిత, కాల్వ శ్రీనివాసులు విషయంలో 3 అభియోగాలు మోపారని, అనిత, కాల్వ శ్రీనివాసులు విషయంలో సమాధానం ఇచ్చామని, మూడింటికీ ఈ లేఖ వర్తించాలని విన్నవించారు. దీనికి పీపీరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఇందిరా జైసింగ్ ‘ముందుగా 3 అభియోగాలను ఉపసంహరించుకోమనండి. సస్పెన్షన్ ఎత్తివేయమనండి. అప్పుడు మా విచారం వ్యక్తంచేస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పీపీ రావు తిరిగి వాదనలు వినిపించగా.. జస్టిస్ గోపాల గౌడ కల్పించుకుని ‘‘మీరు 194 అధికరణకు గల ప్రక్రియను అవలంబించలేదు. ఈ విషయంలో 2 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు పిటిషనర్‌కు అనుకూలంగా ఉన్నాయి. మీరు సమస్యకు ముగింపు పలకండి’’ అన్నారు. తమ అభిప్రాయం చెప్పేందుకు శుక్రవారం వరకు ఆగాలని కోర్టును ఇందిరా జైసింగ్ అభ్యర్థించారు. జస్టిస్ గౌడ తిరిగి జోక్యంచేసుకుంటూ ‘సామరస్యంగా వ్యవహారం ముగిసిపోయేలా చర్యలు తీసుకోండి’ అని పీపీరావుకు చెబుతూ విచారణ వాయిదా వేశారు. -
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి
కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఈ సారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను, సీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ శనివారం ఉదయం అరుణ్ జైట్లీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను జైట్లీకి వివరించడంతోపాటు... రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం తదితర అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు ప్రాంతాల్లో టెక్స్టైల్ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చినందున ఇందుకు కావాల్సిన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన సీఎస్టీ (సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్) బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేసీఆర్ కోరగా... మూడు వాయిదాల్లో సీఎస్టీ బకాయిలను చెల్లిస్తామని జైట్లీ తెలిపారు. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి తెలంగాణకు ఈ ఏడాది రావాల్సిన రూ. 2,300 కోట్ల బకాయిల అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించగా... మార్చిలోగా నిధులను విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. హెచ్ఎండీఏ, హౌజింగ్ బోర్డు వంటి సంస్థలపై ఆదాయ పన్ను బకాయిలు మాఫీ చేయాలని సీఎం కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేలా ఫెడరల్ స్ఫూర్తితో ఈ సారి బడ్జెట్ ఉంటుందని అరుణ్ జైట్లీ కేసీఆర్‌కు చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. జైట్లీతో భేటీ సందర్భంగా కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, రాష్ట్ర సీఎస్ రాజీవ్‌శర్మ తదితరులు ఉన్నారు. చర్చకు వచ్చిన జీఎస్టీ అంశం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని యోచిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)తో లాభనష్టాలపై అరుణ్ జైట్లీ, కేసీఆర్ చర్చించుకున్నారు. జీఎస్టీ బిల్లును వర్షాకాల సమావేశాల్లో ఆమోదించనున్నట్టు జైట్లీ వివరించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ‘ఉత్పత్తి చేసే రాష్ట్రాల’కు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పారు. అయితే.. ‘తెలంగాణ ఉత్పత్తి రాష్ట్రాల్లోకి వస్తుందా, సర్వీసెస్ ఉన్న రాష్ట్రాల జాబితాలోకి వస్తుందా?’ అని జైట్లీ కేసీఆర్‌ను ఆరా తీశారు. తెలంగాణ ఉత్పత్తి, సేవా రంగాల కలగలుపుగా ఉందని కేసీఆర్ సమాధానమిచ్చారు. జీఎస్టీ అమలుతో మొదటి ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రం లబ్ధి పొందే అవకాశముందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభిన్న సంస్కృతులను కలిగిన హైదరాబాద్ నగరానికి అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని, గొప్ప నగరంగా తీర్చిదిద్దుకోవడంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని జైట్లీ హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఈ వివరాలను టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్ మీడియాకు తెలిపారు. అయితే విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై ప్రస్తుతం చర్చించలేదని ఎంపీ వినోద్‌కుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే దానిపై స్పందిస్తామని పేర్కొన్నారు. కాగా... నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రధాని మోదీ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్, పార్టీ ఎంపీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో శనివారం సమీక్షించారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ప్రజారోగ్యం, వ్యవసాయం, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి పథకాలను నీతిఆయోగ్ సమావేశంలో కేసీఆర్ వివరించనున్నారు. దీంతోపాటు కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ‘నీతి ఆయోగ్’కు ఇద్దరు సీఎంలు ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. తమ రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాధాన్యత గల పథకాలకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే 2015-16 బడ్జెట్‌తో పాటు, ప్రాధాన్యత గల పథకాల అమలుకు సలహాలు, సూచనలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని మోదీ స్వీకరించనున్నారు. హిందుస్తాన్ కేబుల్స్లిమిటెడ్ను కాపాడండి హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో చేర్చేలా చొరవ తీసుకోవాలని కేసీఆర్‌ను హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కోరారు. ఈ మేరకు సంఘం నేతలు ఢిల్లీలో కేసీఆర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆ సంఘం నాయకులతో కలిసి యూనియన్ అధ్యక్షుడు సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా హెచ్సీఎల్ను స్వాధీనం చేసుకుంటామంటూ హామీ ఇచ్చినా... మూతవేసే దిశగానే భారీ పరిశ్రమల శాఖ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో హెచ్సీఎల్ను చేర్చేలా రక్షణశాఖ, భారీ పరిశ్రమలశాఖపై ఒత్తిడి తేవాలని కేసీఆర్‌ని కోరినట్టు చెప్పారు. -
లండన్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి
* విద్య, వైద్యం, టెక్నాలజీ, ఇండస్ట్రీకి ప్రాధాన్యం * అదే నమూనాలో రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ కృషి * లండన్ పర్యటనతో కొత్త అంశాలు నేర్చుకున్నాను * ‘సాక్షి’తో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత రాయికల్ : ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా పేరొందిన లండన్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని, ఆ నగర స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఈ నెల 2నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరఫున దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 మంది ఎంపీలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి కవితకు అవకాశం దక్కింది. సెమినార్ ముగించుకుని స్వరాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అక్కడి అనుభవాలను ఆమె శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘ఈ సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి యువ ఎంపీలు హాజరయ్యారు. 14 మందిలో ఇద్దరం మహిళా ఎంపీలం ఉన్నాం. సెమినార్లో ముఖ్యంగా దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన సంస్కరణలు, అక్షరాస్యత పెరుగుదల, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, హక్కుల సాధన, ఆర్థిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వంటి సంస్కరణలపై చర్చ జరిగింది. భారత ఎంపీలం అందరం ఒకేచోట కలవడంతో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నాం. లండన్‌లో టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రీపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం ద్వారా అనూహ్యమైన ప్రగతిని సాధించినట్టు గమనించాను. అదేరీతిలో మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడమే నాన్న (కేసీఆర్) గారి మొదటి ఆశయం. ఇందుకు నా పర్యటనలో గమనించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇక లండన్‌లో తెలంగాణ ప్రవాసులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరాను. పెట్టుబడిదారులకు సర్కారు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించగా, మంచి స్పందన కనిపించింది. త్వరలోనే పెట్టుబడులు వస్తాయనే నమ్మకముంది. తెలంగాణ ఉద్యమం లండన్‌లోనూ విస్తరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ ఎన్నారెసైల్, తెలంగాణ జాగృతి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. నేను లండన్‌లో అడుగుపెట్టగానే వీరంతా ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో వందరోజుల పాలనపై ఏకంగా ఒక పుస్తకాన్నే రూపొందించారు. దానిని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది’’ అని కవిత తన పర్యటన విశేషాలను కుప్లంగా వివరించారు. -
మహిళల స్వావలంబనతోనే రాష్ట్రాభివృద్ధి
తూప్రాన్: మహిళలు స్వావలంబన దిశగా ముందుకు సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ‘గడా’ అధికారి హన్మంతరావు పేర్కొన్నారు. తూప్రాన్ మండలంలోని 71 సమైక్య సంఘం మహిళా గ్రూపులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల రుణా వితరణ కార్యక్రమంలో రూ.2.10 కోట్ల రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గడా అధికారి హన్మంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలు భర్తలపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారన్నారు. ప్రస్తతం మహిళలంతా గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో భార్యలపైనే భర్తలు ఆధారపడే విధంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కావడంలేదన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెటి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేలు, భూమి లేని దళిత రైతులకు మూడెకరాల భూమిని కేటాయిస్తున్నారని వివరించారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలకు 2013 డిసెంబరు నుంచి సెప్టెంబరు వరకు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీలను వారి ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. స్త్రీనిధి ద్వారా చెల్లిస్తున్న లావాదేవీల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలోనే జిల్లాలోని 6,800 మహిళా గ్రాపులకు రూ.204 కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ టీవీ రమణ మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. అంతకు ముందు మహిళలు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమన భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ స్వామి, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, ఎంపీడీఓ కరుణలీల, స్థానిక సర్పంచ్ శివ్వమ్మ ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
కర్నూలులో ‘సన్‌రైజ్ ఆఫ్ ఏపీ’
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పేరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత వస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలులో నిర్వహించే ఈ వేడుకలను సన్‌రైజ్ ఏపీ పేరుతో నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించే 12 శకటాలను ప్రదర్శించనున్నారు. -
మేనేజ్మెంట్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు
సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు సామాజిక అడవులతో భూగర్భజలాల పెంపు చలసాని శ్రీనివాస్ కురబలకోట: మంచి అవకాశాలు పొందడానికి మేనేజ్మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర మేధావుల, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కురబలకోట మండలంలోని విశ్వం ప్రాంగణంలో ఉన్న విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాల (ఎస్విటీఎం)లో ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసమిచ్చారు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మేనేజ్‌మెంట్‌ది కీలకపాత్రగా మారిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. సమయస్ఫూర్తి, విభిన్న ఆలోచనలు, సృజనాత్మకత తప్పనిసరి అన్నారు. వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిదన్నారు. విశిష్ట వ్యక్తిత్వంతో మనిషి మహనీయుడు కావచ్చన్నారు. ఎంబీఏ అంటే నేడు క్రేజీ పెరుగుతోందన్నారు. కష్టించేతత్వం, మారుతున్న పరిణామాలను అంచనా వేయడం, కంపెనీల వర్తమాన పరిస్థితులను పసిగట్టగలగాలని చెప్పారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఓర్పు, ఆపై నేర్పుతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక కారిడార్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వారసత్వ సంపద గొప్పది మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపద ఉందని, వివిధ రంగాల్లో తెలుగువారు సత్తా చాటారని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజినీరుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొం దారన్నారు. చదువు సంధ్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టి సారిం చాలన్నారు. ఇకపోతే రాష్ర్ట విభజన అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ కోరితే నష్టపోయేది సీమ వాసులేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశను కల్గిస్తోందన్నారు. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందన్నారు. రాయలసీమకు పోలవరం వరప్రసాదిని అన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల కు నికర జలాలను కేటాయించాలన్నారు. విద్యు త్ పంపిణీలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. సీమ ప్రాంతంలో సామాజి క అడవుల పెంపకం భూగర్భ జలాలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. మదనపల్లె ఏరి యా అభివృద్ది సంస్థ సలహాదారు దేవరబురుజు శేఖర్‌రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నూర్మహమ్మ ద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి
కొండాపురం, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తన తండ్రి మేకపాటి చంద్రశేఖరరెడ్డిని, ఎంపీగా పెదనాన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డిని గెలిపించాలని ఆదాల లక్ష్మీరచన కోరారు. సోమవారం ఆమె మండలంలోని గొట్టిగొండాల, పాతుప్పులూరులో రోడ్‌షో నిర్వహించారు. లక్ష్మీరచన మా ట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. అందరూ ఫ్యాన్ గు ర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డి సీఎం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆయ న సీఎం అయిన వెంటనే మహానేత వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి తన తండ్రి, పెదనాన్నలతోనే సాధ్యమని లక్ష్మీరచన చెప్పారు. విశేష స్పందన ఆదాల లక్ష్మీరచ న మండలంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ స్థానిక నేత వేమిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది ప్రజలు తరలివచ్చారు. ప్రధానంగా మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి రోడ్లు, మిద్దెలపై నుంచి లక్ష్మీరచనపై పూల వర్షం కురిపించారు. పాతఉప్పలూరులో మహిళలు ఆమెతో మాట్లేడేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాల్లావుల వెంకట్రావు, మండల కన్వీనర్ యారం నరశింహారావు. నాయకులు చిమ్మిలి రాజేంద్రప్రసాద్, వేమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి వీరెళ్ల శ్రీనివాసులు, గుడవల్లూరు ఎంపీటీసీ అభ్యర్థి కోనేటి ప్రసాద్, చెన్నుబోయిన నరసింహరావు, మందపాటి శేషగిరి, యారవ వెంకటేశ్వర్లు, దార్ల గోపి, ఇరగల నారాయణ రెడ్డి, బొడ్డు మల్లికార్జునరెడ్డి, పెనుబాకల రవీంద్రరెడ్డి, మార్నేని రామ్మూర్తినాయుడు, నలబోతుల తిరుపతిస్వామి, చిట్టాబత్తిన రామ్మూర్తి, చిట్టాబత్తిన శ్రీనివాసులు, వీరేపల్లి మాధవ, కృష్ణ, బోనముక్కల పోలిరెడ్డి, బోనముక్కల రవీంద్రారెడ్డి నలగర్ల మాలకొండయ్య, కుల్లూరు శ్రీనివాసులు, ఐతా వెకంట కొండయ్య, సంధానిబాషా పాల్గొన్నారు.