అభివృద్ధి ఉత్తిమాటే!
పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న దోపిడీని ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలో కూరుకుపోతే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, కనీసం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సందర్శించారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌లో లక్షా 50వేల టన్నుల స్టాక్ ఉన్నా అమరావతికి 2,500 టన్నులు మాత్రమే సరఫరా చేయడమేమిటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించి బడాబాబులకు కట్టబెట్టేందుకే నాయుళ్లిద్దరూ ఉన్నారని విమర్శించారు. గతంలో స్టీల్‌ప్లాంట్ నష్టాల బాటలో ఉంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదుకున్నారని చెప్పారు. బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేâýæ్లయినా బీహెచ్‌ఈఎల్, షిప్‌యార్డ్‌కు ఒక్క ఆర్డరైనా తెప్పించారా అని అడిగారు. హుద్‌హుద్ తుపానులో నష్టపోయినా ఒక్కపైసా కూడా ఇన్సూరెన్స్ రాలేదన్నారు.
తమ పార్టీకి అనుకూలమైన కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఇక్కడికి రప్పించుకుని ఆగడాలు సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తీరుపై న్యాయ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీడీఎఫ్ రాష్ట్ర అ«ధ్యక్షుడు పక్కి దివాకర్, వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్‌ఆలీ, సేవాదళ్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధ పాల్గొన్నారు.