రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి | Partners need state development | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Published Sat, Aug 6 2016 4:25 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి - Sakshi

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

నల్లగొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో ముందుండి పోరాడిన జాగృతి కార్యకర్తలు అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత తొలిసారిగా నల్లగొండలో నిర్వహించిన తెలంగాణ జాగృతి పదో వార్షికోత్సవ ప్రతినిధులసభలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సభకు రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన జాగృతి కన్వీనర్లు, రాష్ట్ర బాధ్యులు హాజరయ్యారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. తెలంగాణ అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని పది నిమిషాలపాటు మౌనం పాటించారు.

అనంతరం ఆమె జాగృతి స్థాపించి పదేళ్లు పూర్తియిన సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన విజ యాలు, భవిష్యత్‌లో పోషించాల్సిన పాత్రపై కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ను కాపాడుకునే క్రమంలో జాగృతి పోషిం చిన పాత్రను వివరించారు. జాగృతి రూపొందించిన ‘గమ్యం-గమనం’ అనే కరదీపికను కార్యకర్తలకు అందజేశారు. రాష్ట్రాభివృద్ధి మన గమ్యం అయితే.. ఆ గమ్యాన్ని చేరుకునేందుకు ఎంచుకునేది గమనం’ కావాలన్నారు. దీనికోసం జాగృతి శాఖలు విస్తరింపచేయడంతో పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు.

జాగృతి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,500 మందికి శిక్షణ ఇవ్వగా.. 17 వందల మందికి ఉపాధి కల్పిం చినట్లు వివరించారు. ఆత్మహత్య చేసుకున్న 369 రైతుల కుటుంబాలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం అందజేసినట్లు పేర్కొన్నారు. కోటిలింగాల చరిత్రను  ప్రపంచానికి తెలియచెప్పడంలో జాగృతి ఎంతో కృషి చేసిందన్నారు. రానున్న రోజు ల్లో కమిటీల్లో మహిళలకు 30 శాతం చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో టీఎన్జీవోల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, కవులు, రచయితలు ఫ్రొఫెసర్ సిధారెడ్డి, వేణు సంకోజు, శ్రీధర్, జవహర్, విక్రాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement