breaking news
Jagruthi activists
-
మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి
-
జాగృతి జాడెక్కడ..!
విజయనగరం రూరల్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ‘జాగృతి’ కార్యక్రమాల జాడ కానరావడం లేదు. జిల్లాలో 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో సారా తయారీ, అమ్మకాలు, కేసుల నమోదు, బెల్ట్ దుకాణాల నిర్వహణ, తలెత్తే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ‘జాగృతి’ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అయితే జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఆయా స్టేషన్ల పరిధిలో ఎప్పుడు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి. గతంలో జిల్లాలో సారా నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన నవోదయం కార్యక్రమంలో భాగంగా అధికారులు కొన్ని నెలలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏడాది గడిచిందో లేదో నవోదయంలో భాగంగా జిల్లాను సంపూర్ణ నాటుసారా నిర్మూలన ప్రాంతంగా మార్చామని అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే జిల్లాలో అనేక ప్రాంతాల్లో నేటికీ సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ‘జాగృతి’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నా జిల్లాలో యథేచ్ఛగా బెల్ట్ దుకాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో బెల్ట్ దుకాణాలను నిర్మూలిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. కాని వాటి ఎత్తివేయడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో జాగృతి కార్యక్రమాలు గత శనివారం నిర్వహించాం. అయితే ప్రభుత్వ ఆదేశాలు ఆకస్మికంగా రావడంతో సమాచారం అందించలేకపోయాం. ప్రతి శనివారం విధిగా అన్ని ఎక్సైజ్స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించేలా ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తాం. – ఎ.శంభూప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, విజయనగరం -
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నల్లగొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో ముందుండి పోరాడిన జాగృతి కార్యకర్తలు అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత తొలిసారిగా నల్లగొండలో నిర్వహించిన తెలంగాణ జాగృతి పదో వార్షికోత్సవ ప్రతినిధులసభలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సభకు రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన జాగృతి కన్వీనర్లు, రాష్ట్ర బాధ్యులు హాజరయ్యారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. తెలంగాణ అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని పది నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ఆమె జాగృతి స్థాపించి పదేళ్లు పూర్తియిన సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన విజ యాలు, భవిష్యత్‌లో పోషించాల్సిన పాత్రపై కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ను కాపాడుకునే క్రమంలో జాగృతి పోషిం చిన పాత్రను వివరించారు. జాగృతి రూపొందించిన ‘గమ్యం-గమనం’ అనే కరదీపికను కార్యకర్తలకు అందజేశారు. రాష్ట్రాభివృద్ధి మన గమ్యం అయితే.. ఆ గమ్యాన్ని చేరుకునేందుకు ఎంచుకునేది గమనం’ కావాలన్నారు. దీనికోసం జాగృతి శాఖలు విస్తరింపచేయడంతో పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. జాగృతి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,500 మందికి శిక్షణ ఇవ్వగా.. 17 వందల మందికి ఉపాధి కల్పిం చినట్లు వివరించారు. ఆత్మహత్య చేసుకున్న 369 రైతుల కుటుంబాలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం అందజేసినట్లు పేర్కొన్నారు. కోటిలింగాల చరిత్రను ప్రపంచానికి తెలియచెప్పడంలో జాగృతి ఎంతో కృషి చేసిందన్నారు. రానున్న రోజు ల్లో కమిటీల్లో మహిళలకు 30 శాతం చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో టీఎన్జీవోల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, కవులు, రచయితలు ఫ్రొఫెసర్ సిధారెడ్డి, వేణు సంకోజు, శ్రీధర్, జవహర్, విక్రాంత్‌రెడ్డి పాల్గొన్నారు.