హోదాతోనే రాష్ట్రాభివృద్ది | AP development only by special status | Sakshi
Sakshi News home page

హోదాతోనే రాష్ట్రాభివృద్ది

Published Sun, Sep 25 2016 11:41 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదాతోనే రాష్ట్రాభివృద్ది - Sakshi

హోదాతోనే రాష్ట్రాభివృద్ది

 
  • ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
అనుమసముద్రంపేట : ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌పేట మండలంలోని పొనుగోడు గ్రామంలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం అన్నీ విధాలుగా అభివృద్ధి చెందేందుకు హోదా ముఖ్యమన్నారు. హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గతంలో పొనుగోడులో పర్యటించినప్పుడు స్థానికులు నీటి సమస్యను తన దృష్టికి తెచ్చారని దీంతో ప్లాంట్‌ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఇచ్చిన మారాజు సుబ్బయ్యను అభినందించారు. ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచే సిన గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను దగ్గరగా చూసి పరిష్కరించేందుకు వీలు కలుగుతోందన్నారు. సర్పంచ్‌ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మహిళా కన్వీనర్‌ బోయిళ్ల పద్మజారెడ్డి, ప్రముఖ ఇంజనీరు బోయిళ్ల చెంచురెడ్డి, అనుమసముద్రం, రాజవోలు సర్పంచులు పులిమి వెంకటరమేష్‌రెడ్డి, లక్ష్మీదేవి, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement