ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి | vote for fan... ysrcp | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి

Published Tue, May 6 2014 3:43 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి - Sakshi

ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి

కొండాపురం, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తన తండ్రి మేకపాటి చంద్రశేఖరరెడ్డిని, ఎంపీగా పెదనాన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డిని గెలిపించాలని ఆదాల లక్ష్మీరచన కోరారు. సోమవారం ఆమె మండలంలోని గొట్టిగొండాల, పాతుప్పులూరులో రోడ్‌షో నిర్వహించారు. లక్ష్మీరచన మా ట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. అందరూ ఫ్యాన్ గు ర్తుకు ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆయ న సీఎం అయిన వెంటనే మహానేత వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి తన తండ్రి, పెదనాన్నలతోనే సాధ్యమని లక్ష్మీరచన చెప్పారు.  
 
 విశేష స్పందన
 ఆదాల లక్ష్మీరచ న మండలంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ స్థానిక నేత వేమిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది ప్రజలు తరలివచ్చారు. ప్రధానంగా మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి రోడ్లు, మిద్దెలపై నుంచి లక్ష్మీరచనపై పూల వర్షం కురిపించారు. పాతఉప్పలూరులో మహిళలు ఆమెతో మాట్లేడేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాల్లావుల వెంకట్రావు, మండల కన్వీనర్ యారం నరశింహారావు.

నాయకులు చిమ్మిలి రాజేంద్రప్రసాద్, వేమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి వీరెళ్ల శ్రీనివాసులు, గుడవల్లూరు ఎంపీటీసీ అభ్యర్థి కోనేటి ప్రసాద్, చెన్నుబోయిన నరసింహరావు, మందపాటి శేషగిరి, యారవ వెంకటేశ్వర్లు, దార్ల గోపి, ఇరగల నారాయణ రెడ్డి, బొడ్డు మల్లికార్జునరెడ్డి, పెనుబాకల రవీంద్రరెడ్డి, మార్నేని రామ్మూర్తినాయుడు, నలబోతుల తిరుపతిస్వామి, చిట్టాబత్తిన రామ్మూర్తి, చిట్టాబత్తిన శ్రీనివాసులు, వీరేపల్లి మాధవ, కృష్ణ, బోనముక్కల పోలిరెడ్డి, బోనముక్కల రవీంద్రారెడ్డి నలగర్ల మాలకొండయ్య, కుల్లూరు శ్రీనివాసులు, ఐతా వెకంట కొండయ్య, సంధానిబాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement