- సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు
- సామాజిక అడవులతో భూగర్భజలాల పెంపు
- చలసాని శ్రీనివాస్
కురబలకోట: మంచి అవకాశాలు పొందడానికి మేనేజ్‌మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర మేధావుల, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కురబలకోట మండలంలోని విశ్వం ప్రాంగణంలో ఉన్న విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాల (ఎస్‌విటీఎం)లో ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసమిచ్చారు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మేనేజ్‌మెంట్‌ది కీలకపాత్రగా మారిందన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. సమయస్ఫూర్తి, విభిన్న ఆలోచనలు, సృజనాత్మకత తప్పనిసరి అన్నారు. వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిదన్నారు. విశిష్ట వ్యక్తిత్వంతో మనిషి మహనీయుడు కావచ్చన్నారు. ఎంబీఏ అంటే నేడు క్రేజీ పెరుగుతోందన్నారు. కష్టించేతత్వం, మారుతున్న పరిణామాలను అంచనా వేయడం, కంపెనీల వర్తమాన పరిస్థితులను పసిగట్టగలగాలని చెప్పారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఓర్పు, ఆపై నేర్పుతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక కారిడార్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
వారసత్వ సంపద గొప్పది
మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపద ఉందని, వివిధ రంగాల్లో తెలుగువారు సత్తా చాటారని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజినీరుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొం దారన్నారు. చదువు సంధ్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టి సారిం చాలన్నారు.
ఇకపోతే రాష్ర్ట విభజన అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ కోరితే నష్టపోయేది సీమ వాసులేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశను కల్గిస్తోందన్నారు. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందన్నారు. రాయలసీమకు పోలవరం వరప్రసాదిని అన్నారు.
హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల కు నికర జలాలను కేటాయించాలన్నారు. విద్యు త్ పంపిణీలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. సీమ ప్రాంతంలో సామాజి క అడవుల పెంపకం భూగర్భ జలాలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. మదనపల్లె ఏరి యా అభివృద్ది సంస్థ సలహాదారు దేవరబురుజు శేఖర్‌రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నూర్‌మహమ్మ ద్ తదితరులు పాల్గొన్నారు.