'హామీల అమలులో సర్కారు విఫలం'
► వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు
► జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ గుప్తా
సిద్దిపేట : ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివారావు, జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌గుప్తా ఆరోపించారు. సోమవారం మండలంలోని తోటపల్లి గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎంతో ఆర్భాటంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాలపై ప్రచారం చేసుకున్నారు. అధికారం చేపట్టిన తరువాత ఓట్లవేసి గెలిపించిన ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఆవుతున్నా ఎర్రవల్లి, నర్సన్నపేటలో మాత్రమే ఇళ్ల నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు, సీఎం దత్తత గ్రామం కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్‌లో మరి ఆధ్వాన్నంగా ఉందన్నారు. కరువు నష్టపరిహారం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి, వారికి దగా చేస్తుందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులపై నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణ సరే ప్రజలకు మూడు పూటల తిండి లేకుండా చేయవద్దన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కాని ఆ సమయంలో చిన్న నోట్లను అధికంగా వినియోగంలో తీసుకవస్తే బాగుండుందన్నారు. నోట్ల రద్దుతో పాకిస్తాన్, అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లోని టైస్ట్‌లకు చెంపపెట్టన్నారు. రబీ వ్యవసాయ పనులను జోరందుకున్న నేపధ్యంలో రైతులకు పెట్టుబడికి డబ్బులు అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. స్వైపింగ్ మిషన్లతో లావాదేవీలు సాధ్యం కాదన్నారు. భారతదేశంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని అంతేకాకుండా బ్యాంకు ఖాతాలు ప్రజలందరి లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా చిల్లర నోట్ల కష్టాలు లేకుండా పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వజ్రోజ్ శంకరాచారి, జంగిడి రమేష్‌రెడ్డి, చిన్నకోడూర్, బెజ్జంకి, గన్నేరువరం మండల అధ్యక్షులు ఎదుల నర్సింహరెడ్డి, ధర్మపురీ శ్రీనివాస్, న్యాలపట్ల శంకర్‌గౌడ్, శంకర్ పాల్గొన్నారు.