రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యం | The state's development is the BJD Aim | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యం

Jul 6 2018 1:35 PM | Updated on Jul 6 2018 1:35 PM

The state's development is the BJD Aim - Sakshi

నరేంద్రపూర్‌లో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌పాణిగ్రహి, బీజేడీ నాయకులు తదితరులు

బరంపురం: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యమని జిల్లా బీజేడీ అధ్యక్షుడు, గోపాలపూర్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి అన్నారు. గోపాలపూ ర్‌ నియోజవర్గ పరిధిలోని నరేంద్రపూర్‌లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా సీతలపల్లిలో కమ్యూనిటీ భవనం, నారాయణపూర్‌ గ్రామంలో రహదారి నిర్మాణం కోసం శంకుస్థాప న చేశారు. అనంతరం కోరాపల్లిలో కల్యాణ మం డపం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

దీని కోసం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ప్రజ లకు అండగా బీజేడీ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేడీ నాయకులు, బ్లాక్‌ అధ్యక్షులు, కార్యకర్తలు, సమితి సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement