BJD MLA
-
చిక్కుల్లో ఎమ్మెల్యే.. నా భర్తకు మరో వివాహితతో సంబంధం ఉంది..
భువనేశ్వర్: కేంద్రపడా నియోజకవర్గ ఎమ్మెల్యే, అధికార పార్టీ బిజూ జనతాదళ్ నాయకుడు, మాజీమంత్రి శశిభూషణ్ బెహరా చిక్కుల్లో పడ్డారు. అతని కుటుంబం గృహహింస, వరకట్న వేధింపులు పెడుతున్నారని కోడలు రోనాలి బెహరా(31) బంకి ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021 మార్చి 3న ఎమ్మెల్యే కుమారుడు సత్యప్రకాష్‌తో ఆమెకు వివాహం జరిగింది. అయితే తన భర్త మరో వివాహితతో సంబంధం కలిగి ఉన్నాడని, సత్యప్రకాష్ తోపాటు అత్తమామలు, ఆడపడుచులు, ఇతర కుటుంబీకులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చాలని నిరంతరం వేధిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి రూ.40 లక్షలు తీసుకు రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. మెట్టినింటికి వచ్చిన 10 రోజులకే పుట్టింటి వారు ఇచ్చిన నగలన్నీ తమకు అప్పగించాలని డిమాండ్ చేశారన్నారు. చెప్పినట్లు వినలేదని దుర్భాషలాడి, మాససికంగా కుంగదీశారని వాపోయారు. అయితే తన కోడలు చేసిన ఆరోపణలను నిరాధారమైనవి, అంతా అవాస్తవమని ఎమ్మెల్యే శశిభూషణ్ కొట్టిపారేశారు. తన కొడుకు, రోనాలి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి ఉండవచ్చన్నారు. మెట్టినింటికి వచ్చిన తర్వాత నామమాత్రంగా నెల రోజులు మాత్రమే ఆమె తమతో ఉన్నారని, అనంతరం తన తండ్రితో కలిసి పుట్టినింటికి వెళ్లి తిరిగి రాలదేని తెలిపారు. వరకట్న డిమాండ్ ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టంచేశారు. -
ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్: ఝార్సుగుడ ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఆమె తల్లి, సోదరుడు, మంత్రులు ప్రమీలా మల్లిక్, రీతా సాహు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఘన విజయంతో ఓటర్లు కట్టబెట్టిన గురుతర బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మార్గదర్శకంలో ఝార్సుగుడ నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో దీపాలీ దాస్ మీప ప్రత్యర్థి, బీజేపీ నాయకుడు టొంకొధొరొ త్రిపాఠిపై 48,721 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారానికి ముందు సోదరుడు విశాల్ దాస్ ఆదివారం నవీన్ నివాస్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ విజయం ఝార్సగుడ ఉప ఎన్నికలో చారిత్రాత్మక విజయమని సీఎం అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి నాయకత్వం వహించాలని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంకితభావంతో పని చేయాలని ఆమెకు సూచించారు. ఇదిలా ఉండగా.. దీపాలి దాస్ సుమారు ఏడాది కంటే తక్కువ కాలమే ఈ పదవిలో ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉండటమే ప్రధాన కారణం. తిరుగులేని బీజేడీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 5వ విడత పాలనలో 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 7 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బిజూ జనతాదళ్ విజయ శంఖారావం చేయగా.. మరో స్థానంలో భారతీయ జనతా పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పత్తా లేకుండా పతనమైంది. 2000 తర్వాత ఈ విడతలో రాష్ట్రంలో అత్యధిక ఉప ఎన్నికలు జరగడం విశేషం. -
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
భువనేశ్వర్: బిజూ జనతాదళ్ అభ్యర్థి, తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిజయ్శంకర్ దాస్ చిక్కుల్లో పడ్డారు. ఆయన స్నేహితురాలు సోమాలికా దాస్(29) దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించి, విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు నిందిత శాసనసభ సభ్యుడికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... 2022 మే 13న సోమాలికా దాస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పట్ల కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రధానంగా జగత్సింగ్పూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ ఆమె సమస్యలను పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా సీఆర్పీసీ 154(3) సెక్షన్ కింద ఏదైనా చర్య తీసుకోవడంలో జిల్లా ఎస్పీ చొరవ కల్పించుకోవాలి. ఈ మేరకు ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సోమాలికా దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 27న జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు బిజయ్శంకర్కు వ్యతిరేకంగా తాజా ఫిర్యాదుతో పాటు తన ఆర్డర్ కాపీతో ఐఐపీ, జగత్సింగ్పూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా అనుబంధ సమాచారంతో ఫిర్యాదు ఆమోదించి, కేసు నమోదు చేయాలని జగత్సింగ్పూర్ ఐఐసీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. హైకోర్టు ఆదేశాల మేరకు సోమాలికా జగత్సింగ్పూర్ ఐఐసీని సంప్రదించి, రాతపూర్వక ఫిర్యాదును సమర్పించింది. దీని ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఆమెకు సంబంధిత అధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో దాఖలు చేసిన ఫిర్యాదు వ్యతిరేకంగా ఠాణా పోలీసు అధికార వర్గాలు స్పందించక పోవడంతో హైకోర్టుని ఆశ్రయించడం అనివార్యమైందని స్పష్టంచేశారు. బీజేడీ ఎమ్మెల్యే తన ఎన్నికల ఖర్చుల కోసం డబ్బును సేకరించేందుకు సెక్స్ రాకెట్లను నిర్వహిస్తున్నారని సోమాలికా గతంలో ఆరోపించారు. అలాగే పెళ్లి చేసుకుంటానని దగా చేశారని, జగత్సింగ్పూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి అన్నీ సిద్ధం చేసి, సకాలంలో కానరాకుండా అదృశ్యమై తనను మోసం చేశారని విమర్శించింది. దీనిపై తనపై సంబంధిత ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆరోపించింది. వీటికి సంబంధించి అన్ని సాక్ష్యాలను అందిస్తానని పేర్కొంది. -
10th Class MLA: పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే
దేశంలో పెద్దగా చదువుకోని రాజకీయ నేతలు ఉన్నారు. అయినా రాజకీయాలకు క్వాలిఫికేషన్లు అవసరమా? అనుకుంటారు చాలామంది. కానీ, జ్ఞానం పెంచుకోవడానికి ఏ వయసు అయితే ఏంటని అంటున్నారు ఓ ఎమ్మెల్యే. 58 ఏళ్ల వయసులో పదో తరగతి హాజరైన ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒడిశా పుల్బానీ నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హార్.. శుక్రవారం మొదలైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. రుజంగీ హైస్కూల్ సెంటర్‌కు వెళ్లిన ఆయన.. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. 1978లో పదో తరగతి దాకా వెళ్లిన ఆయన.. కుటుంబ సమస్యలతో పరీక్షకు హాజరు కాలేకపోయాడట. అయితే వయసు పైబడిన వాళ్లెందరో.. బిడియాన్ని పక్కనపెట్టి పరీక్షలకు హాజరవుతుండడం తాను గమనించానని, అందుకే తాను తన విద్యను పూర్తి చేయాలనుకుంటున్నానని అంగద చెప్తున్నారు. పైగా చదువుకుంటే పెరిగేది జ్ఞానమే కదా.. సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు? అంటున్నాడు. అయితే పరీక్ష ఆయన ఒక్కడే రాశాడు అనుకోకండి. తోడుగా ఆయన పాత స్నేహితులు ఇద్దరు కూడా పరీక్షలకు హాజరుకాగా, అందులో ఓ పెదదాయన ఒక ఊరికి సర్పంచ్ కూడా. ఇక.. ఆ స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో మధ్యలో చదువు ఆపేసిన వాళ్లు చాలామందే ఎగ్జామ్ రాశారట. అందులో అత్యధిక వయస్కుడు అంగదనే కావడం గమనార్హం. ఒడిశాలో శుక్రవారం నుంచి మొదలైన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామ్స్‌కు 5.8 లక్షల మంది హాజరయ్యారు. మే 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. Odisha | Biju Janata Dal (BJD) MLA from Phulbani, Angada Kanhar appeared for his Class 10th examinations. He was among the 5.8 lakh students appearing for the Class 10 state board examination in Odisha that commenced on Friday. pic.twitter.com/hFWNJjXZ5l — ANI (@ANI) April 29, 2022 -
ఎమ్మెల్యే కిశోర్ మహంతి కన్నుమూత
భువనేశ్వర్: బ్రజ్‌రాజ్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కిశోర్ మహంతి(63) కన్నుమూశారు. గుండెపోటుతో ఝార్సుగుడ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన 1990లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఝార్సుగుడ శాసనసభ స్థానం నుంచి వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలుపొందారు. ►2004 నుంచి 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్‌గా, మంత్రిగా, స్పీకరుగా, పశ్చిమ ఒడిశా అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రజ్‌రాజ్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం బీజేడీలో సీనియర్ నాయకునిగా వెలుగొందారు. ►ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరవధికంగా కొనసాగిన పలు సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అలా పడుకుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడం గమనార్హం. ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం నవీన్, గవర్నరు గణేషీలాల్, ఏపీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం ప్రకటించారు. కిశోర్ మృతి తీరని లోటు.. ఒడిశా శాసనసభ సభ్యుడు కిశోర్ మహంతి మృతి తీరని లోటని ఏపీ గవర్నరు సంతాపం ప్రకటించారు. నిష్పక్షపాత వైఖరితో అందరినీ ఆకట్టుకునే నాయకుడిగా విశేష గుర్తింపు సాధించారు. ఆయన మన మధ్య లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ప్రభుత్వ వ్యవహారాల్లో అనన్య దక్షత ప్రదర్శించిన నాయకుడు కిశోర్. -బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ ప్రజా ప్రతినిధిగా చిరస్మరణీయులు.. రాజకీయ నాయకునిగా రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కిశోర్ మహంతి పాత్ర చిరస్మరణీయం. 3 దశాబ్దాల పాటు ప్రజా నాయకునిగా> వెలుగొందడం కొంతమందికే సొంతమని, ఈ తరం నాయకుల్లో ఆ గొప్పతనం ఒక్క కిశోర్ దక్కుతుంది. ఆయన మృతి పశ్చిమ ఒడిశా ప్రజలను కలచివేసిందని ఈ సందర్భంగా దివంగత నాయకుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – ప్రొఫెసరు గణేషీలాల్, రాష్ట్ర గవర్నర్ మంచి నాయకుడిని కోల్పోయాం.. రాష్ట్ర ప్రజలు ఓ మంచి నాయకుడిని కోల్పోయారు. స్పీకరుగా శాసనసభ వ్యవహారాల్లో దక్షత చాటుకుని అఖిల పక్షాల ప్రియతమ స్పీకరుగా గుర్తింపు సాధించారు. పశ్చిమ ఒడిశా అభివృద్ధిలో ఆయనది విశేష పాత్ర. పార్టీ వ్యవహారాల్లో ఆయన సేవ, అంకిత భావం భవిష్యత్ తరాలకు ఆదర్శం. ఆయన మరణం పూడ్చలేనిది. బాధిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – సీఎం నవీన్ పట్నాయక్ -
ఎట్టకేలకు పదో తరగతి పాసైన ఎమ్మెల్యే
కొరాపుట్: ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్ ఎట్టకేలకు పదో తరగతి పాస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను మంగళవారం ప్రకటించింది. అందులో స్వయ్ 500 మార్కులకు గాను 340 మార్కులతో బి గ్రేడ్ సాధించారు. పెయింటింగ్‌లో అత్యధికంగా 85 మార్కులు, ఇంగ్లిష్‌లో అల్పంగా 44 మార్కులు వచ్చాయి. పూర్ణచంద్ర స్వయ్ సురడా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరై ఎట్టకేలకు ఉత్తీర్ణత సాధించారు. చదవండి: పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్‌పై తిరుగుబాటు -
ప్రభుత్వ ఉద్యోగి చేత గుంజీళ్లు తీయించిన ఎమ్మెల్యే
-
ప్రభుత్వ ఉద్యోగి చేత గుంజీళ్లు తీయించిన ఎమ్మెల్యే
భువనేశ్వర్ : కొత్తగా ఎన్నికైన బీజేడీ నాయకుడు ఒకరు ప్రభుత్వ ఇంజనీరు చేత ప్రజల ముందు గుంజీళ్లు తీయించి.. వివాదంలో చిక్కుకున్నారు. వివరాలు.. ఒడిషా పట్నాగఢ్ నుంచి బీజేడీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ కుమార్ మెహర్ ఓ ఇంజనీరు చేత జనాల ముందు 100 గుంజీళ్లు తీయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఇంత కఠిన చర్యలు తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. తన నియోజకవర్గంలో రోడ్ల నాణ్యత.. ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవడంతో ఆగ్రహించిన సరోజ్ కుమార్ అందుకు బాధ్యుడైన ఇంజనీర్ని పిలిపించాడు. రోడ్ల నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించనందుకు గాను సదరు ఇంజనీర్ జనాల ముందు 100 గుంజీళ్లు తీయాల్సిందిగా సరోజ్ ఆదేశించాడు. ఒక వేళ తాను చెప్పినటు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని బెదిరించాడు. దాంతో సదరు ఇంజనీర్ గుంజీళ్లు తీస్తూ.. పనిలో నాణ్యత పాటించనందుకు క్షమాపణలు తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యేను పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానిక చానెళ్లలో కూడా ప్రసారమవుతుంది. -
రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యం
బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధే బీజేడీ లక్ష్యమని జిల్లా బీజేడీ అధ్యక్షుడు, గోపాలపూర్ ఎమ్మెల్యే ప్రదీప్‌కుమార్ పాణిగ్రహి అన్నారు. గోపాలపూ ర్ నియోజవర్గ పరిధిలోని నరేంద్రపూర్‌లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీతలపల్లిలో కమ్యూనిటీ భవనం, నారాయణపూర్ గ్రామంలో రహదారి నిర్మాణం కోసం శంకుస్థాప న చేశారు. అనంతరం కోరాపల్లిలో కల్యాణ మం డపం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ప్రజ లకు అండగా బీజేడీ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేడీ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, కార్యకర్తలు, సమితి సభ్యులు పాల్గొన్నారు. -
కార్యకర్తల దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు
కియోంజ్హర్: ఒడిశాలో అధికార బీజేడీ ఎమ్మెల్యే వేదవ్యాస నాయక్.. ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేసిన ఘటనలో గాయపడ్డారు. టెల్కోయి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదవ్యాస.. హరిచందన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండిచగాగిలో బీజేడీ బ్లాక్ లెవెన్ సమావేశంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సమస్యలపై ఇద్దరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వారి అనుచరులు జోక్యం చేసుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఆయన్ను మొదట సమీపంలోని హరిచందన్‌పూర్ ఆరోగ్యం కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు తరలించారు. కియోంజ్హర్ జిల్లా బీజేడీ అధ్యక్షుడు ఆశీష్ చక్రవర్తి సమక్షంలో ఈ దాడి జరిగింది. పంచాయతీ ఎన్నికల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.