కియోంజ్హర్: ఒడిశాలో అధికార బీజేడీ ఎమ్మెల్యే వేదవ్యాస నాయక్.. ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేసిన ఘటనలో గాయపడ్డారు. టెల్కోయి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదవ్యాస.. హరిచందన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండిచగాగిలో బీజేడీ బ్లాక్ లెవెన్ సమావేశంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
స్థానిక సమస్యలపై ఇద్దరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వారి అనుచరులు జోక్యం చేసుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఆయన్ను మొదట సమీపంలోని హరిచందన్పూర్ ఆరోగ్యం కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్కు తరలించారు. కియోంజ్హర్ జిల్లా బీజేడీ అధ్యక్షుడు ఆశీష్ చక్రవర్తి సమక్షంలో ఈ దాడి జరిగింది. పంచాయతీ ఎన్నికల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కార్యకర్తల దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు
Published Mon, Aug 29 2016 2:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
Advertisement
Advertisement