
పూర్ణచంద్ర స్వయ్(ఫైల్ ఫోటో)
కొరాపుట్: ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్ ఎట్టకేలకు పదో తరగతి పాస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను మంగళవారం ప్రకటించింది. అందులో స్వయ్ 500 మార్కులకు గాను 340 మార్కులతో బి గ్రేడ్ సాధించారు. పెయింటింగ్‌లో అత్యధికంగా 85 మార్కులు, ఇంగ్లిష్‌లో అల్పంగా 44 మార్కులు వచ్చాయి. పూర్ణచంద్ర స్వయ్ సురడా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరై ఎట్టకేలకు ఉత్తీర్ణత సాధించారు.
చదవండి: పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్‌పై తిరుగుబాటు