కొత్తగా ఎన్నికైన బీజేడీ నాయకుడు ఒకరు ప్రభుత్వ ఇంజనీరు చేత ప్రజల ముందు గుంజీళ్లు తీయించి.. వివాదంలో చిక్కుకున్నారు. వివరాలు.. ఒడిషా పట్నాగఢ్ నుంచి బీజేడీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ కుమార్ మెహర్ ఓ ఇంజనీరు చేత జనాల ముందు 100 గుంజీళ్లు తీయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఇంత కఠిన చర్యలు తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. తన నియోజకవర్గంలో రోడ్ల నాణ్యత.. ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవడంతో ఆగ్రహించిన సరోజ్ కుమార్ అందుకు బాధ్యుడైన ఇంజనీర్‌ని పిలిపించాడు.