situps
-
Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి
జాజ్‌పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. -
గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా! ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: గుంజీలు.. ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియనప్పటికీ నిన్నటితరం వారికి మాత్రం ఈ పేరు చెప్పగానే బడిలో ఉపాధ్యాయులు విధించిన ‘శిక్ష’ గుర్తొస్తుంది. అయితే నాటి ‘దండన’ వెనకున్న శాస్త్రీయతను చాలా మంది అపార్థం చేసుకోవడంతో ఇదో పెద్ద పనిష్మెంట్‌గాగా ముద్రపడినా పాశ్చాత్య దేశాలు మాత్రం దీని అంతరార్థాన్ని, విద్యార్థులకు కలిగే ఉపయోగాలను గుర్తించాయి. దీన్ని ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా పిలుస్తూ నిత్యం గుంజీలు తీయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ఇది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచే విధానమంటూ ఆధునిక పరిశోధకులు సైతం రుజువు చేశారు. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతాయి.. చదువుపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అభ్యసన మెరుగవ్వడం గుంజీల వల్లే సాధ్యమని నిరూపించారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో పరీక్షలంటే భయం, ఏకాగ్రత కోల్పోవడం, బోధన సమయంలో ధ్యాస లేకపోవడం వంటివి వేధించే సమస్యలు. గుంజీల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. గతంలోనే శాస్త్రీయంగా నిర్ధారణ... ఆలోచన శక్తికి కేంద్ర బిందువు మెదడే. చెవి కొనలు మెదడుకు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తాయి. రెండు చెవి కొనలను పట్టుకొని లాగుతూ గుంజీలు తీయడం వల్ల నాడులు స్పందిస్తూ మెదడుకు సంకేతాలు వెళ్తాయి. గుంజీలు తీసేటప్పుడు తీసుకొనే శ్వాస, ఆక్యుప్రెషర్ క్రియల వల్ల మెదడు కుడి భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా పిట్యూటరీ గ్రంథి శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నోగియర్ గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. గుంజీల వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు క్రియాశీలత పెరిగి, భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత, మెరుగైన సృజనాత్మకతకు దోహదపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తేల్చారు. పరిశోధనలేం చెప్పాయి? ► కాలిఫోరి్నయో రేడియాలజీ డాక్టర్ జోయ్ పి జోన్స్ పరిశోధన ప్రకారం... మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. గుంజీలు తీయడం వల్ల మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ద్వారా నిరూపించారు. ► ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్ సూయ్ గుంజిలపై పరిశోధన ద్వారా... జీవం ఉన్న బ్యాటరీగా పిలిచే మెదడు గుంజీల ద్వారా రీచార్జ్ అవుతుందని తేల్చాడు. ► మైసూరు యూనివర్సిటీ, మహారాజ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్, లాన్సీ 2017లో 6–18 ఏళ్ల వయసున్న 1,945 మంది పాఠశాల విద్యార్థులపై మూడు నెలలు గుంజీలపై పరిశోధన చేశారు. దీనివల్ల 86% మంది విద్యార్థుల్లో పరీక్షల భయం పోయిందని, 75.9% మంది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందని, 70.5% మందిలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తేల్చారు. గుంజీలకు గుర్తింపు కోసం తెలంగాణ బిడ్డ పోరుబాట నిజామాబాద్‌కు చెందిన అందె జీవన్‌రావు గుంజీలపై విస్తృత పరిశోధన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పట్నుంచీ ‘సూపర్ బ్రెయిన్ యోగా’(గుంజీలు తీయడం)పై అనేక ప్రయోగాలు చేశారు. పదవీవిరమణ పొందినా బ్రెయిన్ ట్రైనర్‌గా దేశవ్యాప్తంగా గుంజీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 150 విద్యా సంస్థల్లో విద్యార్థులకు గుంజీలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కేంద్రంలోని ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలోని ఎస్సీఈఆర్టీకి దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి దీన్ని అమలులోకి తేవాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 2 వరకూ అస్సాంలోని బోడోలాండ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సూపర్ బ్రెయిన్ యోగాపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచేందుకు సిద్ధమయ్యారు. శిక్షగా కాకుండా, విద్యార్థి వికాసానికి తోడ్పడే గుంజీల శాస్త్రీయతను ప్రభుత్వాలు గుర్తించాలని, అప్పటివరకూ అవిశ్రాంతంగా పోరాడతానని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు. చదవండి: బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు! -
Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష
మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పసిమొగ్గల నుంచి పండటాకుల వరకు ఎవరిని వదలం లేదు. ఎన్ని చట్టాలు అమలు చేసినా, కఠిన శిక్షలు విధించినా కామాంధుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దేశంలో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిన సమయంలో బిహార్‌లో జరిగిన ఓ ఘటన సమాజాన్ని నివ్వేరపరుస్తోంది. రాష్ట్రంలో అత్యాచార నిందితుడికి అక్కడి గ్రామ పెద్దలు వింత శిక్ష విధించారు. నవదా జిల్లాలోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి చాకెట్ల ఆశచూసి అయిదేళ్ల బాలికను కోళ్ల ఫామ్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకోగా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి… ఈ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోమని సూచించాడు. దీంతో వారు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. అయితే పంచాయితీ పెద్దలు సొంత నిర్ణయంతో తీర్పును ప్రకటించారు. నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడలేదని చెబుతూ..కేవలం ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినందుకు మాత్రమే అతనికి శిక్ష వేశారు. నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి చేతులు దులుపుకున్నారు. పంచాయతీ పెద్దల షాకింగ్ పనిష్మెంట్ అక్కడి వారందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. In Bihar's Nawada Arun Pandit rapes a 6 year old minor. Girl. He is given a Strict punishment of doing 5 Sit-ups by the Panchayat (village court). pic.twitter.com/8uVRpKsxdE — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) November 24, 2022 పంచాయతీ పెద్దలు, గ్రామస్తుల ముందు నిందితుడు గుంజీలు తీస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పంచాయతీ తీర్పుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రామీణ భారతదేశంలో పిత్రుస్వామ్యానికి ఈ ఘటన నిదర్శనమని, న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి వేసిన శిక్ష ఇదేనా? బాలికకు చేసే న్యాయం ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వి యాదవ్‌ను ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు. అంతేగాక ఈ దారుణాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దత కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ -
తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..
-
తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ.. మరో సారి అధికారంలోకి రావాలని టీఎంసీ సీరియస్‌గా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాగా వేయడం కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీఎంసీ నాయకులను లాక్కుంటుంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నాయుకుడు ఒకరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఇన్నాళ్లు టీఎంసీలో ఉండి తప్పు చేశాను.. ఇందుకు తనను క్షమించాల్సిందిగా కోరుతూ.. వేదిక మీద గుంజీళ్లు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. సుశాంత్ పాల్ అనే నాయకుడు కొద్ది రోజుల క్రితం టీఎంసీ నుంచి బయటకు వచ్చాడు. నేడు ఆయన బీజేపీలో చేరారు. టీఎంసీ మాజీ మినిస్టర్ సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. ‘‘మొదట నేను బీజేపీలోనే ఉన్నాను. కానీ లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరాను. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండి తప్పు చేశాను. టీఎంసీ కార్యకర్తగా నాకు అంటుకున్న పాపాల ప్రక్షాళన కోసం నాకు నేనే ఓ చిన్న శిక్ష వేసుకుంటున్నాను’’ అంటూ మూడు సార్లు గుంజీళ్లు తీశారు. పక్కన ఉన్న వారు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పాల్ మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. చదవండి: టీఎంసీ కంచుకోటలో పాగాకు బీజేపీ వ్యూహాలు బీజేపీ, టీఎంసీలను ఓడించాలి -
నిరూపిస్తే.. 101 గుజీలు తీస్తా: దీదీ
కోల్‌కతా: ఒక రాజకీయ పార్టీ కావాలనే తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందని.. దానిలో భాగంగానే తాను ఈ ఏడాది దుర్గా పూజకు అనుమతివ్వలేదని అబద్ధాలు ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఏడాది దుర్గాపూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే.. ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని సవాలు చేశారు దీదీ. బెంగాల్ పోలీస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 1న బెంగాలో పోలీసు డే నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఈ కార్యక్రమం నేటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా దీదీ కోల్‌కతా పోలీసుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. కోవిడ్ నియంత్రణ కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు అన్నారు. అనంతరం దుర్గా పూజపై వస్తోన్న ఆరోపణలపై స్పందించారు దీదీ. (చదవండి: కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్!) అక్టోబర్ నెలలో వస్తున్న దసరా పండగను ప్రతి ఏటా కోల్‌కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే దసరా సందర్భంగా జరిపే దుర్గా పూజపై ఇప్పటి వరకు తాను ఎలాంటి సమావేశం జరుపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమత స్పష్టంచేశారు. కరోనా కారణంగా ఈసారి దుర్గా పూజను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు. ఓ రాజకీయ పార్టీ దురుద్దేశంతోనే దీనిపై తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నదని.. ప్రజలు వాటిని నమ్మవద్దని మమత వెల్లడించారు. -
గుంజీలు తీయించి, పూలదండలు వేశారు..
సాక్షి, పాలకొల్లు: లాక్డౌన్ నేపథ్యంలో పనిలేకుండా బయటకొచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని ఓ వైపు పోలీసులు హెచ్చిరిస్తున్నా... మరోవైపు జనాలు రోడ్లమీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఫలితం లేకపోతోంది. నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నా... రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. (వారికి ముందుగా పరీక్షలు చేయాలి : సీఎం జగన్) తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో లాక్డౌన్ నియమ నిబంధనలను అతిక్రమించి నిర్లక్ష్యంగా తిరుగుతున్న పలువురిని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో వారికి సన్మానం చేశారు. అందరిని వరుసగా నిలబెట్టి పది గుంజీలు తీయించారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించిన వారిందరికీ పూలదండలు వేశారు. రేపటి నుండి మేం బయటకురామంటూ వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు!) -
హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు
థానె: హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు తీయమని విద్యార్థిని ఆదేశించిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానె జిల్లాలోని మీరా రోడ్డు ఏరియా శాంతినగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక థానె జిల్లా పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఆమె తన ట్యూషన్ టీచర్ ఇచ్చిన హోంవర్క్‌ను పూర్తి చేయలేకపోయింది. దీంతో టీచర్ ఆ విద్యార్థినిని ఏకంగా 450 గుంజీలు తీయమని ఆదేశించింది. బాలిక సరిగ్గా నడవలేకపోతుండటంతో పాటుగా రెండు కాళ్లు వాచిపోయి ఉండటాన్ని తల్లి గుర్తించింది. దీంతో ఆమె తల్లి పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం టీచర్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోహెల్ పఠాన్ తెలిపారు. -
గుంజీలు తీస్తే రైలు టిక్కెట్ ఫ్రీ!
-
ఇలా చేస్తే రైలు టిక్కెట్ ఫ్రీ
-
ఇలా చేస్తే రైలు టిక్కెట్ ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ : రష్యా ప్రభుత్వం క్రీడారంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు కూడా ఫిట్నెస్ అనేది పెద్ద సమస్యగా మారింది. అనేక మంది ఊబకాయంతో బాధ పడుతున్నారు. అలాంటి వారిని వ్యాయామం వైపు ప్రోత్సహించేందుకు రష్యా రాజధాని మాస్కో నగరంలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్ ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే ఆ యంత్రం నుంచే ఉచితంగా మెట్రోలో ప్రయాణించేందుకు టిక్కెట్ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు తీయలేదా 30 రూబుల్స్‌ను చెల్లించాల్సిందే. 30 రూబుల్స్ డాలర్ కన్నా కొంచెం తక్కువే అయినప్పటికీ రష్యా ప్రజలకు అవి చాలా ఎక్కువ. 2014 వింటర్ ఓలిపింక్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన రావడంతో 2013లోనే మెట్రో స్టేషన్లో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. యంత్రం ముందు గుంజీలంటే మనలాగా చెవులు పట్టుకొని తీయాల్సిన అవసరం లేదు. రెండు చేతులు ముందుకు చాపి, మొకాళ్లను వంచి, కూర్చొని లేస్తే చాలు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగంలో బాగా పాపులర్ అయింది. దాంతో ఓ మెక్సికో నగరంలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విజయం సాధించింది. అక్కడ రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీయకపోతే పెద్దగా వచ్చే నష్టమేమి లేదు. ఎందుకంటే అక్కడ మెట్రో రైలు టిక్కెట్ వారి కరెన్సీలో పది రూపాయలతో సమానం. -
ప్రభుత్వ ఉద్యోగి చేత గుంజీళ్లు తీయించిన ఎమ్మెల్యే
-
ప్రభుత్వ ఉద్యోగి చేత గుంజీళ్లు తీయించిన ఎమ్మెల్యే
భువనేశ్వర్ : కొత్తగా ఎన్నికైన బీజేడీ నాయకుడు ఒకరు ప్రభుత్వ ఇంజనీరు చేత ప్రజల ముందు గుంజీళ్లు తీయించి.. వివాదంలో చిక్కుకున్నారు. వివరాలు.. ఒడిషా పట్నాగఢ్ నుంచి బీజేడీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ కుమార్ మెహర్ ఓ ఇంజనీరు చేత జనాల ముందు 100 గుంజీళ్లు తీయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఇంత కఠిన చర్యలు తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. తన నియోజకవర్గంలో రోడ్ల నాణ్యత.. ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవడంతో ఆగ్రహించిన సరోజ్ కుమార్ అందుకు బాధ్యుడైన ఇంజనీర్ని పిలిపించాడు. రోడ్ల నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించనందుకు గాను సదరు ఇంజనీర్ జనాల ముందు 100 గుంజీళ్లు తీయాల్సిందిగా సరోజ్ ఆదేశించాడు. ఒక వేళ తాను చెప్పినటు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని బెదిరించాడు. దాంతో సదరు ఇంజనీర్ గుంజీళ్లు తీస్తూ.. పనిలో నాణ్యత పాటించనందుకు క్షమాపణలు తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యేను పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానిక చానెళ్లలో కూడా ప్రసారమవుతుంది. -
నిరూపించకుంటే 100 గుంజీలు తీయాలి
బంకురా/పురూలియా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలను రుజువుచేయలేకపోతే ఆయన వంద గుంజీలు తీయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే మోదీ తాను చేసిన ఆరోపణలను ఏ ఒక్క అభ్యర్థిపైనైనా రుజువు చేస్తే లోక్‌సభ బరిలో ఉన్న మొత్తం 42 మంది టీఎంసీ అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరిస్తానని ఆమె సవాల్ విసిరారు. గురువారం బెంగాల్‌లోని బంకురా నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఎంసీ అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మమత కూడా అదే నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ ‘బొగ్గు గనుల తవ్వకాల వ్యవహారమంతా కేంద్రంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. గనులకు కాపలాగా ఉండేది కూడా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్). బొగ్గు గనులను అక్రమంగా తవ్వుతున్నది బీజేపీ వాళ్లే’ అంటూ మోదీపై ఎదురుదాడి చేశారు. తన దగ్గర ఒక పెన్‌డ్రైవ్ ఉందనీ, దాన్ని బయటపెడితే బొగ్గు మాఫియా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూస్తాయని మమత హెచ్చరించారు. ఓ కేంద్ర మంత్రి, మరో బీజేపీ ఎంపీకి సంబంధించిన వివరాలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణాల్లో టీఎంసీ నేతలపై వచ్చిన ఆరోపణలు కూడా రుజువుకాలేదని ఆమె పేర్కొన్నారు. ఈ దేశాన్ని దుర్యోధన, దుశ్శాసనులు పాలిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మోదీని కొడతానని నేను అనలేదు.. మోదీని చెంపదెబ్బ కొడతానని తానెప్పుడూ అనలేదని మమత స్పష్టం చేశారు. ఆయనను కొట్టాల్సిన అవసరం తనకు ఏంటని ఆమె ప్రశ్నించారు. బుధవారం మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని అనడం తెలిసిందే. దీనిపై మోదీ గురువారం మాట్లాడుతూ ‘మమత నన్ను కొడతానంటున్నారు. ఆమె నాకు అక్క వంటివారు. ఆమె కొట్టినా నాకు అది ఆశీర్వాదమే’ అని పేర్కొన్నారు. దీంతో మమత మాట్లాడుతూ మోదీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని తాను అన్నానే తప్ప, తానే మోదీని చెంపదెబ్బ కొడతానని కాదని వెల్లడించారు. ప్రజలే తమ ఓటుతో మోదీకి బుద్ధి చెబుతారనే అర్థంలో తాను ‘ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ’ అన్నానని తెలిపారు. -
'ప్రేమికులకు గుంజిళ్ల'పై డీసీపీ సీరియస్
గోల్కొండ కోటలో ప్రేమికులతో గుంజిళ్లు తీయించిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కౌన్సెలింగ్ అంటూ గుంజిళ్లు తీయించిన వీడియోలు మొత్తం యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం, మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మొత్తంపై తగిన విచారణ జరిపించి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్‌ను ఆయన ఆదేశించారు. ఆ నివేదిక అందగానే దాని ఆధారంగా అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.