గోల్కొండ కోటలో ప్రేమికులతో గుంజిళ్లు తీయించిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కౌన్సెలింగ్ అంటూ గుంజిళ్లు తీయించిన వీడియోలు మొత్తం యూట్యూబ్లో ప్రత్యక్షం కావడం, మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన మొత్తంపై తగిన విచారణ జరిపించి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఆసిఫ్నగర్ ఏసీపీ వినోద్కుమార్ను ఆయన ఆదేశించారు. ఆ నివేదిక అందగానే దాని ఆధారంగా అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
'ప్రేమికులకు గుంజిళ్ల'పై డీసీపీ సీరియస్
Published Tue, Dec 24 2013 9:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement