enquiry ordered
-
మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఆరోపణలు
సాక్షి, లక్నో : యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఉన్నావ్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసు మరువకముందే మరో యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై 19 ఏళ్ల యువతి లైంగిక దాడి ఆరోపణలు చేశారు. బైసౌలి ఎమ్మెల్యే కుషాగర సాగర్‌తో తాను మైనర్‌గా ఉన్న 2014 నుంచి తనకు సంబంధం ఉందని, తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి రెండేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. గతంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు 18 సంవత్సరాలు రాగానే ఇద్దరికీ వివాహం జరిపిస్తానని ఎమ్మెల్యే తండ్రి హామీ ఇచ్చారని చెప్పారు. తాను రూ 20 లక్షలు తీసుకుని రాజీ పడ్డానని ఎమ్మెల్యే తండ్రి తనపై దుష్ర్పచారం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సర్కిల్ ఆఫీసర్ నీతి ద్వివేదికి అప్పగించామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని ఎస్ఎస్పీ కళానిధి నైతాని చెప్పారు. అయితే మరో వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన ఎమ్మెల్యే సాగర్ బాధితురాలి ఆరోపణలు నిరాధారమంటూ తోసిపుచ్చారు. గతంలో బాలిక తమ వద్ద పనిచేసిందని, అప్పట్లో బాలిక కుటుంబం తనపై చేసిన ఆరోపణలు పోలీసుల విచారణలో వాస్తవం కాదని తేలిందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి వారు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన కాపీ తన వద్ద ఉందని చెప్పారు. -
కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం
-
కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీని కోర్టు ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు విజయశాంతి, హరీష్‌రావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ బాలాజీ వధేరా అనే న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ముగ్గురూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వధేరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సీబీఐ కోర్టు ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. -
ఎన్నికల విధులకు 14 ఏళ్ల కుర్రాడు!!
ఎక్కడైనా 14 ఏళ్ల కుర్రాడికి ఓటు హక్కే రాదు. అలాంటిది ఏకంగా బూత్ లెవెల్ అధికారిగా నియమితుడు కావడమంటే!! ఈ ఉదంతం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వెలుగుచూసింది. మహ్మద్ షేక్ యూసుఫ్ (14) అనే బాలుడిని అక్కడ బీఎల్వోగా నియమించారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, మొత్తం హైదరాబాద్ లోక్‌సభ స్థానంలోని 1405 బీఎల్వోల నియామకంపై విచారణకు ఆదేశించారు. ఎవరో వ్యక్తి ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు ఇక్కడ ఉన్న బీఎల్వోలు అందరూ ఒక పార్టీకి చెందినవాళ్లేనని అతడు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు. -
'ప్రేమికులకు గుంజిళ్ల'పై డీసీపీ సీరియస్
గోల్కొండ కోటలో ప్రేమికులతో గుంజిళ్లు తీయించిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కౌన్సెలింగ్ అంటూ గుంజిళ్లు తీయించిన వీడియోలు మొత్తం యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం, మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మొత్తంపై తగిన విచారణ జరిపించి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్‌ను ఆయన ఆదేశించారు. ఆ నివేదిక అందగానే దాని ఆధారంగా అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.