మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఆరోపణలు | Girl Accuses UP BJP MLA Of Rape He says Allegation Baseless  | Sakshi
Sakshi News home page

మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఆరోపణలు

Published Wed, May 30 2018 4:03 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Girl Accuses UP BJP MLA Of Rape He says Allegation Baseless  - Sakshi

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుషాగర సాగర్‌

సాక్షి, లక్నో : యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఉన్నావ్‌ లైంగిక వేధింపుల ఆరోపణల కేసు మరువకముందే మరో యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై 19 ఏళ్ల యువతి లైంగిక దాడి ఆరోపణలు చేశారు. బైసౌలి ఎమ్మెల్యే కుషాగర సాగర్‌తో తాను మైనర్‌గా ఉన్న 2014 నుంచి తనకు సంబంధం ఉందని,  తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి రెండేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు బరేలీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ)కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.

గతంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు 18 సంవత్సరాలు రాగానే ఇద్దరికీ వివాహం జరిపిస్తానని ఎమ్మెల్యే తండ్రి హామీ ఇచ్చారని చెప్పారు. తాను రూ 20 లక్షలు తీసుకుని రాజీ పడ్డానని ఎమ్మెల్యే తండ్రి తనపై దుష్ర్పచారం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సర్కిల్‌ ఆఫీసర్‌ నీతి ద్వివేదికి అప్పగించామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని ఎస్‌ఎస్‌పీ కళానిధి నైతాని చెప్పారు.

అయితే మరో వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన ఎమ్మెల్యే సాగర్‌ బాధితురాలి ఆరోపణలు నిరాధారమంటూ తోసిపుచ్చారు. గతంలో బాలిక తమ వద్ద పనిచేసిందని, అప్పట్లో బాలిక కుటుంబం తనపై చేసిన ఆరోపణలు పోలీసుల విచారణలో వాస్తవం కాదని తేలిందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి వారు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన కాపీ తన వద్ద ఉందని చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement