సాక్షి, పాలకొల్లు: లాక్‌డౌన్ నేపథ్యంలో పనిలేకుండా బయటకొచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని ఓ వైపు పోలీసులు హెచ్చిరిస్తున్నా... మరోవైపు జనాలు రోడ్లమీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఫలితం లేకపోతోంది. నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నా... రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. (వారికి ముందుగా పరీక్షలు చేయాలి : సీఎం జగన్)
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో లాక్‌డౌన్ నియమ నిబంధనలను అతిక్రమించి నిర్లక్ష్యంగా తిరుగుతున్న పలువురిని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో వారికి సన్మానం చేశారు. అందరిని వరుసగా నిలబెట్టి పది గుంజీలు తీయించారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించిన వారిందరికీ పూలదండలు వేశారు. రేపటి నుండి మేం బయటకురామంటూ వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు!)
Comments
Please login to add a commentAdd a comment