AP Budget 2021 - 22, Rs 24624 Cr Allocated For Education Sector - Sakshi
Sakshi News home page

AP Budget 2021: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు

Published Thu, May 20 2021 11:50 AM | Last Updated on Thu, May 20 2021 12:57 PM

AP Budget 2021: Rs 24624 Crore Allocated For Education Sector - Sakshi

సాక్షి, అమరావతి: పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతారు. రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం మరోమారు స్పష్టమైంది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా.. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్‌లో ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

2021-22 వార్షిక బడ్జెట్‌:

  • విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
  • స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
  • జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
  • జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
  • ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు

చదవండి: AP Budget 2021: హైలెట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement