
సాక్షి, అమరావతి: రాష్ట్ర హోం శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.7,039.17 కోట్లను కేటాయించారు. గతేడాది రూ.6,364.98 కోట్లు కేటాయించగా ఈ ఏడాది అదనంగా రూ.674 కోట్లకుపైగా కేటాయింపులు పెరిగాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. కాగా, పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వారి కోసం రూ.200 కోట్లు కేటాయించింది.
గతంలో రూ.264 కోట్లు కేటాయించి రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులకు చెల్లించారు. తాజాగా కేటాయించిన మొత్తాన్ని రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసినవారికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment