
నాణ్యమైన చదువును చెప్పించడంతో పాటు, వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోనూ చిన్నారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామగా మారిపోయారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
సాక్షి, అమరావతి: నాణ్యమైన చదువును చెప్పించడంతో పాటు, వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలో చిన్నారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామగా మారిపోయారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
గురువారం ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ, అన్నం పెట్టి.. ఎదుటి వారి ఆకలి తీర్చే ప్రతిఒక్కరూ లోకంలో వందనాలు అందుకోతగినవారేనని, సీఎం వైఎస్ జగన్ ఆ కోవకే చెందినవారని.. అందుకు జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యమని తెలిపారు. చదువుతో పాటు సరైన పోషకాహారం అవసరాన్ని గుర్తించిన సీఎం జగన్.. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని మంత్రి రాజేంద్రనాథ్ అన్నారు.
చదవండి: AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే..
AP Budget 2021: ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కీలక కేటాయింపులు