
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని.. కుల, మత, ప్రాంత, రాజకీయాలు చూడకుండా సంక్షేమం అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.
''నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి.. రేపు మరింత బాగుంటుందనే భరోసా కల్పించాలి. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికల ప్రచారానికి మాత్రమే. కానీ మేం రెండేళ్ల కాలంలోనే 94.5 శాతం హామీలు నెరవేర్చాం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు..రైతులకు తోడుగా ఉంటున్నాం.
కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, తిరుపతి ఉపఎన్నిక సహా ఏ ఎన్నిక వచ్చినా దేవుడి దయతో ఒకే జెండా ఎగిరింది. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించాం. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించాం. మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం. మనం ప్రజలకు సేవకులమని గుర్తుపెట్టుకుని పనిచేయాలి'' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment