న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్‌డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్‌లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్‌లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment