Soumya Swaminathan
-
Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు
#BharatRanta M S Swaminathan భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది.మరణానంతరం స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు దక్కనుంది. దీనిపై స్వామినాథన్ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్ , డబ్ల్యూహెచ్‌వో మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. ఆయన జీవితకాలంలో ఈ అవార్డు దక్కి ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉండేవారని అభిప్రాయ పడ్డారు. కానీ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదనీ గుర్తింపుకోసం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. కాలా చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారంటూ తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారు. సమాజంలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారామె. ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్ కాగా దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేసి భారత హరిత విప్లవ పితామహుడుగా పేరు తెచ్చుకున్నారు స్వామినాథన్ ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేసి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులునింపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులందుకున్నారు. అలాగే హెచ్‌కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా అందుకున్నారు. స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. #WATCH | On M S Swaminathan being conferred the Bharat Ratna, Former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, Dr Soumya Swaminathan says, "I am sure that he would have also been happy if the news had come during his lifetime.… pic.twitter.com/gz3r6udKPb — ANI (@ANI) February 9, 2024 -
ఫోర్త్ వేవ్ వచ్చినా భయం లేదు: సౌమ్య స్వామినాథన్
సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో కోవిడ్ ఫోర్త్ వేవ్ వచ్చినా భయం లేదని, అయితే అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికి రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. విశాఖలో ఏఏపీఐ గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొనడానికి వచి్చన ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇండియాలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరిగిందన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరన్నారు. ఇప్పటిదాకా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు బూస్టర్ డోసు వేయించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం అభినందించదగ్గ విషయమని చెప్పారు. భారత్‌లో మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, హృద్రోగ సమస్యలు వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల 70 ఏళ్ల కంటే ముందుగానే చనిపోతున్నారని తెలిపారు. ఇందుకు జన్యు పరమైన కారణాలతో పాటు పర్యావరణ కాలుష్యం, వ్యక్తిగత నడవడిక, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కారణాలని చెప్పారు. ఇలాంటి వ్యాధులపై జనంలో అవగాహన పెంచడం ద్వారా ముందుగానే వీటి బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. దేశంలో కోవిడ్ సహా వివిధ వ్యాధుల నిర్ధారణకు మరిన్ని లేబరేటరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
కరోనా మహమ్మారి...తగిన గుణపాఠం చెప్పింది: డబ్యూహెచ్ఓ చీఫ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మానవులకు తగిన గుణపాఠం చెప్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేసిందన్నారు. ప్రధానంగా పర్యావరణ మార్పు, మరుగునపడిపోతున్న మానవ తప్పిదాలను మనకు అవగతమయ్యేలా చేసిందని చెప్పారు. అంతేకాదు పర్యావరణ మార్పుల కారణంగా పాకిస్తాన్ ఎలా వరదలతో అల్లాడిందో కళ్లారా చూశామన్నారు. ఇలాంటి విపత్తే ఏ దేశానికైనా భవిష్యత్తులో జరగవచ్చు అని చెప్పారు. అంతేగాదు ఆమె ప్రజా ఆరోగ్య విధానం, పరిశోధనల ఆవశక్యత గురించి కూడా నొక్కి చెప్పారు. అలాగే వ్యాక్సిన్లు శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా వివరించారు. బూస్టర్ డోస్ తీసుకున్న చాలామంది కరోనా వ్యాధి భారిన పడ్డారని, ఇలాంటివి ఒకటి లేదా రెండు కేసులు మినహ అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అంతేగాదు వ్యాక్సిన్లు అనేవి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. వ్యాక్సిన్ల కారణంగా సుమారు 20 బిలియన్ల మంది ప్రాణాలు రక్షింపబడ్డారని అన్నారు. అలాగే భారత్ కూడా ప్రజలందరూ వ్యాక్సిన్లు వేయించుకునేలా గట్టి చర్యలు తీసుకుందని ప్రశంసించారు. (చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం) -
ప్రస్తుతమున్న టీకాలు ఒమిక్రాన్‌ను నిరోధిస్తాయా?
న్యూఢిల్లీ: కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.2 వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. మిగతా సబ్ వేరియంట్స్‌తో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనదని.. భారత్, డెన్మార్క్ దేశాల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపనుందని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడి రెండు నెలలే అయినందువల్ల దాని ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి అంచనాకు రాలేకపోతుందన్నారు. ఒమిక్రాన్ తిరిగి ఇన్ఫెక్షన్కు కారణమవుతుందా, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త వేరియంట్ నుంచి కోలుకున్న రోగుల రక్తం డెల్టా ఇన్ఫెక్షన్కు కారణమయినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయని.. భవిష్యత్ వేరియంట్ల విషయంలో ఇలా జరుగుతుందో, లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేవని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ‘పస్తుతమున్న టీకాలు డెల్టా వేరియంట్ కంటే కూడా తక్కువగా కొత్త వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. అయితే, టీకాలు వేసిన రోగులలో మరణాలు.. తీవ్రమైన వ్యాధి కేసులు తక్కువగా ఉన్నట్లు క్లినికల్ డేటా చూపిస్తోంది. కాబట్టి ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పనిచేస్తాయా, లేదా అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించే విషయంలో టీకాలు బాగా పనిచేస్తున్నాయి. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా నిలుస్తున్నాయ’ని చెప్పారు. యాంటీబాడీ ప్రతిస్పందనను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ల పనితీరుపై అంచనా రాలేమని.. క్లినికల్ డేటాను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు టీ-సెల్ ప్రతిస్పందన వంటి ఇతర అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిడ్ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి భవిష్యత్‌లో మరిన్ని వేరింయట్స్ రావొచ్చన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొనే యూనివర్సల్ వ్యాక్సిన్ గురించి డబ్ల్యూహెచ్ఓ కసరత్తు చేస్తోందన్నారు. బూస్టర్ డోస్ తీసుకోవాలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి స్థానిక డేటాను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. అధిక జనాభాకు టీకాలు వేయడంలో భారతదేశం విజయవంతం అయిందని ప్రశంసించారు. నోటి ద్వారా తీసుకునే మాత్రలు కోవిడ్ అన్ని వేరియంట్లను నియంత్రించడానికి పనికొస్తాయని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్‌లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
Covid 19: కోవిడ్ శని దాదాపు విరగడైనట్లే!
భారతీయులకు ఓ శుభవార్త! 18 నెలలుగా పీడిస్తున్న కోవిడ్ శని దాదాపు విరగడైనట్లే! అక్కడక్కడ.. అడపాదడపా కొన్ని కేసులు నమోదు కావడం మినహా... రోజులో లక్షల కేసులు... వేల మరణాలను చూసే అవకాశం లేదు! ఈ మాట అంటోంది ఎవరో కాదు... దేశంలోనే ప్రముఖ వైరాలజిస్టు ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్ అంతేనా.. ఇక హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చా అంటే...? ప్రమాదకరమైన రూపాంతరితం అవతరిస్తే తప్ప! సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు 31 వేల పైచిలుకు. వారం సగటు కూడా దాదాపు ఇంతే. గత ఏడాది మార్చి నుంచి అంటే లాక్డౌన్ మొదలైన నాటి నుంచి చూసినా.. ఇప్పుడు దేశం మొత్తమ్మీద ఉన్న కేసుల సంఖ్య ఒక్కశాతం కంటే తక్కువ. ప్రమాదకర కొత్త రూపాంతరితం ఏదీ అవతరించకపోతే ఇకపై రోజుకు లక్షల సంఖ్యలో కేసులు, వేల మరణాలు ఉండకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్, వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ అధ్యాపకురాలైన గగన్‌దీప్ కాంగ్ స్పష్టంచేశారు. ఆమె ‘ద వైర్’ న్యూస్‌పోర్టల్‌తో మాట్లాడుతూ కోవిడ్‌కు సంబంధించి భారత్ మహమ్మారి స్థాయి (పాండెమిక్) నుంచి దిగువస్థాయి (ఎండెమిక్)కి చేరుతోందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ కూడా ఇటీవల ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయని, ఒకటి, రెండో దశల మాదిరిగా ఉండదని తెలిపారు. వినాయక చవితితో మొదలైన పండుగల సీజన్ కారణంగా కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న ఆందోళనల నేపథ్యంలో గగన్‌దీప్ కాంగ్ మాటలు ఊరటనిచ్చేవే. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... జాగరూకతతో ఉండాలి దేశంలో డెల్టా రూపాంతరితం విజృంభించి పతాకస్థాయికి చేరిన తరువాత కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నప్పటికీ గత జనవరిలో ఉన్న స్థాయికి చేరలేదని, దీనిపై కొంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లోనూ అత్యధికం కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రల నుంచి మాత్రమే ఉంటున్నాయి. ఇకపైనా ఇదే పద్ధతిలో కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవడం.. మిగిలిన ప్రాంతాల్లో దాదాపు లేకపోవడం అన్న ధోరణి కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల్లోని వైరస్ రూపాంతరితాలు, టీకా వేయించుకున్న వారి సంఖ్య, అప్పటికే వ్యాధిబారిన పడ్డ వారి సంఖ్య, మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం తదితర అంశాలపై కేసుల సంఖ్య ఆధారపడుతుంది. (చదవండి: భారత్‌లో కొత్త వేరియంట్‌పై ఆధారాల్లేవు) ఎంఆర్ఎన్ఏ వైరస్ అయిన కోవిడ్ ఇప్పటికీ చాలా వేగంగా జన్యు మార్పులకు గురవుతోంది. ఫలితంగా కొత్త రూపాంతరితం పుట్టుకొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కొత్త రూపాంతరితాలన్నింటితో ప్రమాదం లేకపోయినా.. జరిగిన జన్యు మార్పులను బట్టి కొన్ని రూపాంతరితాలు ప్రమాదకరంగా మారవచ్చు. వైరస్ ప్రవర్తనలో అనూహ్య మార్పులేవీ లేకుండా.. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే రెండో దశ మాదిరిగా ఇంకోసారి దేశంలో కోవిడ్ విజృంభించే అవకాశం లేకపోలేదు. బూస్టర్లు ఇప్పుడు అనవసరం కోవిడ్ నిరోధానికి బూస్టర్ టీకాలు ఇవ్వాలన్న కొందరి ఆలోచన సరైంది కాదు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరిగా లేని వారికి ఇస్తే ఇవ్వొచ్చు. అయితే ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం కోవిడ్–19పై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఇకపై తగ్గించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్ కాలంలో మరుగునపడ్డ ఇతర వ్యాధుల చికిత్సపై దృష్టి పెట్టాలి. మూడోదశపై అనవసరమైన ఆందోళనను పక్కనబెట్టి నెలలపాటు చికిత్సకు దూరంగా ఉన్న క్షయ, కేన్సర్ తదితర వ్యాధిగ్రస్తుల అవసరాలను పూరించాలి. కోవిడ్ పరిచయమైన తొలినాళ్లలో టెస్టింగ్, ట్రేసింగ్లకు ప్రాధాన్యం లభించిందని, కోవిడ్ నిర్వహణకు అప్పట్లో అది అత్యవసరమైందని, ఇప్పుడా పరిస్థితి లేదు. (ఇంట్లో మృతిచెందినా పరిహారం: కరోనా మృతుల పరిహారంపై మార్గదర్శకాలు) -
పాఠశాలలు ప్రారంభించాల్సిందే: డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్
జెనీవా: కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రపంచ దేశాలన్నీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం పరోక్షంగా విద్యారంగంపై తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. కోవిడ్–19 ఉందని పిల్లల్ని నాలుగ్గోడల మధ్య ఉంచితే దీర్ఘకాలంలో వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలన్నీ పాటిస్తూ, సకల జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను పునఃప్రారంభించడమే మంచిదన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది అందరికీ వ్యాక్సిన్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇండోర్ సమావేశాలకి దూరంగా ఉండాలని సూచిస్తూ సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు. భారత్‌లో కోట్ల మంది పిల్లలు హఠాత్తుగా స్కూలుకి వెళ్లడం మానేశారని, దీంతో వారి చదువు బాగా దెబ్బతిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మూడో వేవ్ ప్రభావం చూపిస్తుందని అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ఆరునెలలు జాగ్రత్తలు పాటించాలి ‘నాకు తెలుసు అందరూ అలిసిపోయారు. ప్రతీ ఒక్కరూ బంధుమిత్రుల్ని కలుసుకోవాలని, విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాస్త ఓపిక వహించాలి. మరో ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి వ్యాక్సినేషన్ ఎక్కువ మందికి ఇవ్వడం పూర్తయితే నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి’ అని అన్నారు. -
కోవాగ్జిన్‌పై ఆరు వారాల్లో నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్‌కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్ఓకు అందించాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓలోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్‌కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్/బయోఎన్‌టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్కే బయో/ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలను డబ్ల్యూహెచ్‌వో తమ ఈయూఎల్ జాబితాలో ఇప్పటికే చేర్చింది. మరో 105 వ్యాక్సిన్లు కూడా వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 27 వ్యాక్సిన్లు మూడు/నాలుగు ట్రయల్స్‌ను దాటాయని పేర్కొన్నారు. మరో 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇటీవల డెల్టా వేరియంట్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. -
కరోనా నెమ్మదించలేదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వస్తోందన్న భావన వద్దని, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిదని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటం, లాక్డౌన్ నిబంధనల సడలింపు, టీకాల కార్యక్రమం మందగమనం, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం.. ఈ నాలుగు అంశాలు దీనికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితిపై బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, వ్యాధి ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నా యని ఆమె వివరించారు. ‘‘శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 9,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముందు వరసలో ఉన్నాయి. యూరప్‌లో గత వారం రోజుల్లో 32.2 శాతం, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2 శాతం, ఆఫ్రికాలో 18.2 శాతం కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముం దు వరసలో ఉన్నాయి. యూరప్‌లో గత వారం రోజుల్లో 32.2%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2%, ఆఫ్రికాలో 18.2% కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. -
థర్డ్‌వేవ్ భయాలకు ఇదే సరైన పరిష్కారం!
జెనీవా: నాసల్ వ్యాక్సిన్ వస్తేనే ఇండియాలో విద్యా వ్యవస్థ గాడిన పడుతుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. సాధారణ వ్యాక్సిన్లతో పోల్చినప్పుడు ముక్కు ద్వారా టీకా అందించడం తేలికన్నారు. ఎక్కడైనా ఆ టీకాను సుళువుగా అందించవచ్చని, ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలకు నాసల్ వ్యాక్సిన్లను స్కూళ్లలోనే అందించవచ్చని చెప్పారు. దీనివల్ల దాదాపుగా స్కూల్ అంతా ఒకేసారి ఇమ్యూన్ అవుతుందని చెప్పారు. దీంతో పాఠశాలలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి భయం పోతుందన్నారు. ఫలితంగా పిల్లలు స్వేచ్ఛగా స్కూల్‌కి వెళ్లి చదువుకోగలరని, తల్లిదండ్రులు సైతం ధైర్యంగా పిల్లలను పాఠశాలకు పంపగలరంటూ ఆమె అభిప్రాయడ్డారు. అంతకంటే ముందు ఉపాధ్యాయులు, ఇతర స్కూల్ స్టాఫ్‌కి కూడా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. అప్పుడే కరోనా థర్డ్‌వేవ్ భయాలు తొలగిపోతాయన్నారు. అయితే ప్రస్తుతం నాసల్ వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ వ్యాక్సిన్లకు అనుమతులు రావొచ్చని... అప్పటి వరకు థర్డ్‌వేవ్ భయాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం సాగుతుండంతో సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి: 20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు) -
Soumya Swaminathan: వ్యాక్సినే పరమౌషధం!
ఇది సంక్లిష్ట దశ.. భారతదేశంలో ప్రస్తుతం సంక్లిష్ట దశ కొనసాగుతోంది. రానున్న 6 నుంచి 18 నెలల పాటు ఈ వైరస్‌తో మనం చేసే పోరాటమే కీలకమైనది. వైరస్‌ను అంతం చేయాలా లేదా నిరోధానికి మాత్రమే పరిమితం కావాలా అన్నది ఈ పోరాటం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వైరస్ ప్రభావం ఎంత కాలం ఉంటుందన్నది ఊహించడం ఇప్పుడు కష్టం. కానీ ఏదో దశలో ఈ వైరస్ అంతంకాక తప్పదు’ సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు వ్యాక్సినేషనే కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు. రానున్న 6 నుంచి 18 నెలల కాలంలో తీసుకునే చర్యలను బట్టి కోవిడ్‌పై ఆయా దేశాలు చేస్తున్న పోరాటం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని 30 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాతే కరోనా మరణాల సంఖ్యలో తగ్గుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది (2022) పూర్తిగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసమే కేటాయించాల్సి ఉంటుందని, వచ్చే సంవత్సరంలో 70–80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావాల్సి ఉందని జాతీయ మీడియాతో చెప్పారు ‘ఈ వైరస్ వ్యాప్తికి ఎక్కడో ఒక దగ్గర అంతం ఉంది. అయితే వైరస్ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తూ వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల వ్యాధి నిరోధకత ఎంత కాలం ఉంటుందన్నది కీలకం’అని వెల్లడించారు. ఆమె వెల్లడించిన ముఖ్యాంశాలు.. వేరియంట్ ప్రధానం కాదు ‘ఇప్పుడు దేశంలో ఏ వేరియంట్ ఉంది.. ఎంత కా లం ఉంటుందన్నది ముఖ్యం కాదు. ఏ వేరియంట్ అయినా వ్యాప్తి చెంది రోగ లక్షణాలకు కారణమవు తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు గుర్తించాల్సింది.. గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే.. మాస్కు ధరించాలి. జన సమూహాల్లోకి వెళ్లవద్దు. ఇరుకు ప్రదేశాల్లో కలవద్దు. వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటిస్తూ తగినంత శుభ్రంగా ఉండాలి’ మన వ్యాక్సిన్లు చాలా సమర్థవంతమైనవి ‘నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం భారతదేశంలో ఇస్తున్న వ్యాక్సిన్లు కరోనా వైరస్ వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేయగలిగిన సామర్థ్యం ఉన్నవి. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న సంఘ టనలున్నాయి. కానీ అది సాధారణం. ఎందుకంటే ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం భద్రత ఇవ్వదు. కానీ, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ లక్షణాలు తీవ్రమై ఐసీయూ వరకు వెళ్లే పరిస్థితి రాదు. అందుకే వ్యాక్సినేషన్ తప్పనిసరి’ చికిత్సలో ప్రొటోకాల్ పాటించాలి.. కోవిడ్ చికిత్స విషయంలో ప్రొటోకాల్ కీలకం. ఎందుకంటే సరైన సమయంలో రోగికి సరైన మందు ఇవ్వకుండా వేరే మందు ఇస్తే అది మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. ప్రస్తుతం స్టెరాయిడ్ మాత్రం ఆస్పత్రిలో ఆక్సిజన్ తీసుకుంటున్న వారికి పనిచేస్తోంది. ఏ మందు ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రొటోకాల్ పాటించాలి. అయితే కోవిడ్ చికిత్స విషయంలో డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు స్పష్టం గా ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశంలో సొంత చికిత్స విధానాలు రూపొందించుకోవాలి. అధ్యయనాల ఆధారంగా అప్‌గ్రేడ్ అవుతూ రోగలక్షణాలకు అనుగుణంగా ఈ చికిత్సా పద్ధతులుండాలి’అని సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. 50 దేశాల్లో బి.1.617 వేరియంట్ ‘భారత్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా వైరస్‌కు చెందిన బి.1.617 వేరియంట్ ఎక్కువగా సంక్రమణ చెందడానికి అవకాశం ఉంది. యూకేలో గుర్తించిన బి.1.1.7 వేరియంట్‌కు కూడా సంక్రమణ చెందే సామర్థ్యం ఉంది. ఒకానొక సమయంలో ఈ వేరియంట్ భారత్‌లో ఎక్కువగా కనిపించింది. కానీ ప్రస్తుతం ఉన్న బి.1.617 వేరియంట్ వైరస్ 50 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ వేరియంట్ పలు స్ట్రెయిన్లుగా విడిపోతోంది’ ఏ వేరియంట్‌కు చెందిన ఏ స్ట్రెయిన్.. ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై పూర్తి స్థాయి అధ్యయనాలు, డేటా అందుబాటులో లేవు. అయితే కోవాగ్జిన్ అయినా కోవిషీల్డ్ అయినా.. వ్యాక్సిన్ ఏదైనా యాంటీబాడీలను అప్రమత్తం చేసి వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు మరిన్ని అధ్యయనాలు జరగడం అత్యవసరం. రోగుల ఆరోగ్య చరిత్ర, వ్యాధి తీవ్రత, సంక్రమణ చెందిన విధానాన్ని పరిశీలించాల్సి ఉంది’ అని చెప్పారు. -
కరోనా: ఐవర్‌మెక్టిన్‌పై కీలక సూచనలు చేసిన డబ్యూహెచ్‌వో
జెనీవా: నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్ మెడిసిన్ ఐవర్‌మెక్టిన్ ను తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని, కరోనా రోగుల్లో మరణ ముప్పు కూడా తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్ వెల్లడించింది.కరోనా చికిత్సలో ఐవర్మెక్టిన్ను వాడేలా చర్యలు తీసుకోవాలని గోవా ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే సూచనలు చేశారు. తాజాగా కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్‌ను వినియోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు కచ్చితమైన భద్రత, సమర్థత కలిగి ఉండాలని డబ్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ మెడిసిన్‌ను కేవలం కోవిడ్‌పై జరిపే క్రినికల్ ట్రయల్స్‌లో మాత్రమే వాడాలని సూచించారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్‌పై మొత్తం 27 కంట్రోల్ ట్రయల్స్ జరిపామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ పియరీ కోరీ తెలిపారు. మొత్తం 2,500 మంది రోగుల మీద ఈ మెడిసిన్‌ను పరీక్షించామని పేర్కొన్నారు. ఇది తీసుకున్న వారిలో మరణాల రేటు తగ్గగా, రికవరీ సమయం కూడా ఇతరులతో పోలిస్తే తగ్గిందని పేర్కొన్నారు.ప్రస్తుతం డబ్యూహెచ్‌వో తీసుకున్న నిర్ణయంతో కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్ వాడకానికి తెరపడనుంది. Safety and efficacy are important when using any drug for a new indication. @WHO recommends against the use of ivermectin for #COVID19 except within clinical trials https://t.co/dSbDiW5tCW — Soumya Swaminathan (@doctorsoumya) May 10, 2021 చదవండి: కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్ సంజీవని -
వారంలో కరోనా టీకా ఎగుమతులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్లు భారత్ నుంచి వారం రోజుల్లో ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సార్స్–సీవోవీ–2 వైరస్ పరిశోధనలను వేగవంతం చేయడం నుంచి అందరికీ టీకా అందేలా చేసేందుకు ‘కోవాక్స్’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అన్ని దేశాలకు టీకా సరఫరా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బయో ఆసియా–2021 సదస్సులో భాగంగా సోమవారం ‘ప్రపంచానికి టీకా వేయించడం.. భారత్ ప్రస్తుత స్థితి, భవిష్యత్ సమర్థత’ అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. కోవాక్స్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక వనరుల అవసరం ఉందని ఈ ఏడాది సుమారు 300 కోట్ల డాలర్ల నిధులు అవసరమని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. పెద్ద ఎత్తున టీకా తయారీకి ప్రత్యేక కేంద్రాలు అవసరమవుతాయని, కోవాక్స్‌లో భాగమైన 199 దేశాలు కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే తారతమ్యాలు, వివక్ష వంటివి లేకుండా అందరినీ టీకా ద్వారా కోవిడ్ నుంచి రక్షణ కల్పించొచ్చని వివరించారు. కోవాక్స్ ప్రయత్నాల ఫలితంగా ఇంకో వారంలోనే భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున టీకాలు 25–30 దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు. రకరకాల టీకాల తయారీ, నిల్వ, నిర్వహణ అంశాల్లో భారతీయ కంపెనీలు ఎంతో కృషి చేశాయని చెప్పారు. రూపాంతరిత వైరస్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని సకాలంలో గుర్తించి జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా నియంత్రించొచ్చని వివరించారు. ఎవరూ సురక్షితం కాదు.. తగిన టీకా వేయించుకోనంత వరకు ప్రపంచంలో ఎవరూ సురక్షితంగా ఉన్నామనుకోవద్దని యూనిసెఫ్ ప్రధాన సలహాదారు రాబిన్ నంది స్పష్టం చేశారు. గతంలో కొత్త టీకాలు పేద దేశాలకు చేరేందుకు చాలా ఏళ్లు పట్టేదని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కోవాక్స్ ఉపయోపడుతుందని చెప్పారు. 2021 నాటికి కనీసం 200 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్లను పంపిణీ చేయాలన్నది యునిసెఫ్ లక్ష్యమని వివరించారు. కోవాగ్జిన్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను సకాలంలో అందివ్వలేకపోయామని భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ ఎండీ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ముక్కు ద్వారా పిచికారీ చేసే టీకా తొలి దశ ప్రయోగాలు ఈ వారం మొదలు అవుతాయని చెప్పారు. కోవాక్స్‌లో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏటా 4 కోట్ల టీకాలు తయారు చేసే సామర్థ్యం తమ వద్ద ఉందన్నారు. -
కరోనా వ్యాక్సిన్ భారత్‌తోనే సాధ్యం
పుట్టపర్తి అర్బన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు భారతదేశమే త్వరగా వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 39వ స్నాతకోత్సవంలో ఆమె వర్చువల్ విధానం ద్వారా ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాతో వణికిపోయాయన్నారు. ప్రసుత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఇండియన్ జనరిక్ కంపెనీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుందన్నారు. ప్రపంచంలో 40 నుంచి 50 శాతం మందికి వ్యాక్సిన్ అందజేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. వర్సిటీ చాన్సలర్ కె.చక్రవర్తి, వైస్ చాన్సలర్ సీబీ సంజీవి, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తదితరులు మాట్లాడుతూ.. సత్యసాయి మానవీయ విలువలే ప్రామాణికంగా విద్యా విధానాన్ని రూపొందించారన్నారు. అనంతరం 15 మందికి బంగారు పతకాలు, ఏడుగురికి డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ర్యాపిడ్ కోవిడ్–19 టెస్ట్ కిట్‌ను ప్రశాంతి నిలయంలో ఆవిష్కరించారు. కాగా.. సోమవారం సత్యసాయిబాబా 95వ జయంతి వేడుకలు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరంలో వైభవంగా జరగనున్నాయి. కోవిడ్ సేవల్లో ‘అనంత’ ముందంజ కోవిడ్ బాధితులకు సేవలందించడంలో అనంతపురం జిల్లా ముందంజలో ఉంది. తరువాత స్థానంలో వైఎస్సార్ జిల్లా నిలిచింది. కోవిడ్ ఆస్పత్రుల వారీగా డాక్టర్ల సేవలు, నర్సింగ్, పారిశుధ్యం వంటి 12 విభాగాలను పరిశీలించి పాయింట్లు ఇచ్చారు. జిల్లాల వారీగా ఈ పాయింట్లు లెక్కించారు. 2,500 పాయింట్లకు మించి సాధించిన జిల్లాను సగటుకు మించి సేవలు అందించినవిగాను, అంతకంటే తక్కువ పాయింట్లు సాధించిన వాటిని సగటు కంటే తక్కువ సేవలందించినవిగాను లెక్కించారు. అనంతపురం జిల్లా 2,710.39 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 9 ఆస్పత్రులు కోవిడ్ సేవలు అందిస్తున్నాయి. 2,676.99 పాయింట్లతో వైఎస్సార్ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 11 ఆస్పత్రులు కోవిడ్ సేవల్లో ఉన్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు 2,500 పాయింట్లకంటే తక్కువలో ఉన్నాయి. సగటున అన్ని జిల్లాలు కలిపి లెక్కిస్తే 2,500.55 పాయింట్లతో ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ వచ్చిన తొలిరోజుల్లో 248 ఆస్పత్రులు కోవిడ్‌కు వైద్యసేవలందిస్తుండగా, ఇప్పుడా సంఖ్య 149కి తగ్గింది. ప్రస్తుతం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 20 ఆస్పత్రులు, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో మూడు ఆస్పత్రులు కోవిడ్ సేవల్లో ఉన్నాయి. -
అడుగడుగునా వివక్ష
లైంగిక వేధింపులకు సంబంధించిన ఉదంతాలు వెల్లడైనప్పుడు సమాజంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. కారకులపై చర్యకు అందరూ డిమాండ్ చేస్తారు. కానీ లింగ వివక్ష అలా కాదు. చాలా సందర్భాల్లో అది బాధితులకు తప్ప కనబడదు. వారు ఫిర్యాదు చేస్తే తప్ప ఎవరి దృష్టీ పడదు. ఒక్కోసారి ఫిర్యాదు చేసినా చివరకు అది వివక్షగా పరిగణనలోకి రాకపోవచ్చు. బాధితులు దాన్ని సరిగా చెప్పలేకపోవచ్చు. లింగ వివక్ష బాహాటంగా కనబడినప్పుడు సైతం బాధితులకు అండగా నిలిచే ధోరణి అన్నిచోట్లా వుండదు. అసలది పెద్దగా చర్చకు రాదు. మంగళవారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చాలా నిర్మొహమాటంగా మాట్లాడి మంచి పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమా నాలనూ, అవరోధాలనూ చెప్పారు. అడుగు ముందుకు పడుతున్నా, ఆధునికత విస్తరిస్తున్నా, అభివృద్ధి సాధిస్తున్నామని అనుకుంటున్నా మారనిది ఈ లింగ వివక్ష. పిండ దశతో మొదలుపెట్టి అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో ఇది తప్పడం లేదు. సౌమ్యా స్వామినాథన్ వంటివారు మాట్లాడటం వల్ల ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్నవారు ఆ విషయాన్ని సూటిగా చెప్పగలిగే, గట్టిగా ప్రశ్నించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆమె చెప్పిన విషయాలు వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లో పనిచేసినప్పుడు తాను ఎదు ర్కొన్న వివక్ష గురించి ఆమె చెప్పారు. ఐసీఎంఆర్ మన దేశంలో జీవ వైద్య పరిశోధనలో సర్వో న్నతమైన సంస్థ. 1911లో భారతీయ పరిశోధనా నిధి సంఘం(ఐఆర్‌ఎఫ్‌ఏ)గా ఆవిర్భవించిన ఆ సంస్థ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో ఐసీఎంఆర్గా రూపుదిద్దుకుంది. అది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధనా విభాగం సారథ్యంలో పనిచేస్తుంది. గర్భధారణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, అంటురోగాలు, పౌష్టికాహార లోపాలు, కేన్సర్, గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, మానసిక ఆరోగ్యం, ఔషధాలు వగైరాల్లో ఐసీఎంఆర్ పరిశోధనలు చేస్తుంది. సమాజ ఆరోగ్య పరిరక్షణకు అవలంబించాల్సిన ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందిస్తుంది. సగటు మనుషుల్లో కనబడే కుల, మత, ప్రాంత, జెండర్ వివక్షలవంటివి ఇలాంటిచోట తావుండదని అందరూ అను కుంటారు. ఆశిస్తారు. విద్యాపరంగా, మేధోపరంగా ఇక్కడివారు ఉన్నతంగా వుంటారని భావిస్తారు. అయితే సౌమ్య వెల్లడించిన అంశాలు ఇందుకు విరుద్ధంగా వున్నాయి. కమిటీ సమావేశాల్లో ఎప్పుడూ పురుషాధిక్యత రాజ్యమేలుతుందని, పరిశోధనకు సంబంధించి చెప్పేవి పూర్తిగా వినకుండానే కొట్టిపారేయడం లేదా ఆ ఆలోచనను హేళన చేయడం తనకు తరచు ఎదురయ్యేదని ఆమె చెప్పిన మాటలు విషాదం కలిగిస్తాయి. ఇందువల్ల రెండోసారి ఏదైనా ప్రతిపాదించదల్చుకున్నప్పుడు, ఒక అభిప్రాయం చెప్పదల్చుకున్నప్పుడు సంకోచం ఏర్పడేదని కూడా ఆమె చెప్పారు. ఇలాంటిచోట కొత్త ఆలోచనలకూ, సృజనకూ తావుంటుందా? స్వాతంత్య్ర వచ్చి ఏడు పదులు దాటుతున్నా మన దేశంలో అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువే. పాఠశాల విద్యలో చేరిన ఆడపిల్లల్లో ఎక్కువ శాతం అనేకానేక అవాంతరాల వల్ల మధ్యలోనే చదువు చాలించుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్లేసరికి అది మరింతగా తగ్గుతుంది. గతంతో పోలిస్తే శాస్త్ర పరిశోధనా రంగంలో ఇప్పుడు మహిళల శాతం బాగా పెరిగినా అదింకా ఉండవలసినంతగా లేదు. ఇప్పుడే ఇలావుంటే ఆమె కెరీర్లో అడుగుపెట్టేనాటికి ఎలాంటి స్థితి వుండేదో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. మన సమాజంలో కుటుంబం సహాయసహకారాలు, ప్రోత్సాహం లేకపోతే ఆడపిల్లలు అన్నివిధాలా ఎదగటం చాలా కష్టం. భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ కుమార్తెగా మాత్రమే కాదు... సాయుధ దళాల వైద్య కళాశాలలో, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో ఉన్నత చదువులు చదివిన ఆమెకు సైతం పనిచేసేచోట వివక్ష తప్పలేదంటే బాధాకరమే. చదువుకునే రోజుల్లో ఎదురుకాని పరిస్థితులు పనిచేసేచోట వున్నాయని ఆమె అంటున్నారు. మహిళా పరిశోధకులు తమ పరిశోధనాంశాలకు గ్రాంట్లు తెచ్చుకోవాలన్నా, వారి పరిశోధనా ఫలితాలు ప్రతిష్టాత్మక పత్రికల్లో ప్రచురింపజేసుకోవాలన్నా సమస్యలెదురవుతుంటా యన్నది ఆమె మరో ఆరోపణ. ఇవి ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు సరిగదా... మరింతగా పెరిగా యంటున్నారామె. ప్రపంచ ఆరోగ్య రంగంలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిలో 70 శాతం వరకూ మహిళలే. కానీ ఆ రంగం తీరుతెన్నులను నిర్ణయించాల్సిన సారథ్య బాధ్యతల్లో వారు 25 శాతం మించరని ఈమధ్య బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు వున్నారని ఆ అధ్యయనం తెలిపింది. అచ్చం సౌమ్యా స్వామినాథన్ తరహాలోనే అమెరికాలోని ఎంఐటీలో సైన్స్ చరిత్రను బోధించే మహిళా శాస్త్రవేత్త అభా సూర్ కొన్నేళ్లక్రితం భారత్‌లోనూ, ఇతరచోట్లా అమల వుతున్న లింగ వివక్షపై ఒక పుస్తకమే రాశారు. 60వ దశకంలో లేజర్ కిరణాల గురించి పరిశో ధించేటపుడు లింగ వివక్షతోపాటు, కుల వివక్ష కూడా వుండేదని ఆమె అన్నారు. మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ బెంగళూరు ఐఐఎస్సీ సారథిగా వున్నప్పుడు మహిళా శాస్త్రవేత్తలకు ఎదురైన ఇబ్బందుల్ని తెలిపారు. తరతమ భేదాలతో దాదాపు అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకూ ఇలాంటి వివక్ష ఏదో ఒక దశలో ఎదురవుతోందన్నది వాస్తవం. కనుకనే ఇప్పుడు సౌమ్య ప్రస్తావించిన అంశాలను ఐసీఎంఆర్ మాత్రమే కాదు...అన్ని సంస్థలూ సీరియస్‌గా తీసుకుని తమ నిర్వహణా పద్ధతులనూ, విధానాలనూ సమీక్షించి సరిదిద్దుకోవాలి. వివక్ష ఏ రూపంలో వున్నా రూపుమాపాలి. -
2021 దాకా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు..
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్-19 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని.. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అదే విధంగా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలి రెండు దశల్లో ప్రాథమిక పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని.. వ్యాక్సిన్ పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షించే మూడో దశే అత్యంత కీలకం, కఠినమైనదని పేర్కొన్నారు. ప్రస్తుతం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ మాత్రమే క్లినికల్ ట్రయల్స్ ఫేజ్-3లో ఉందని తెలిపారు. ‘‘ఏయే వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి, వాటి అభివృద్ధి తీరును డబ్ల్యూహెచ్ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.(కరోనా వ్యాక్సిన్ : ప్రకటనలో గందరగోళం) ‘‘ఇప్పటివరకు కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున పేషెంట్ల చికిత్సకు రెమెడిసివిర్ వంటి మందులు ఉపయోగిస్తున్నారు. అయితే అది పూర్తిస్థాయిలో మరణాలను కట్టడి చేస్తుందనే విషయంపై ఎలాంటి స్పష్టతా లేదు. అలాగే ఫావిపిరవిర్ కూడా అంతే. నిజానికి దానిని అమితంగా ఉపయోగించడం వల్ల టెరాజెనిక్(జనన లోపాలు) తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి’’ అని పేర్కొన్నారు. ఇక కరోనా మరణాలపై అన్ని దేశాలు కచ్చితమైన లెక్కలు చెబుతున్నాయా లేదా అన్న విషయం బయటపడటానికి మరికొంతకాలం వేచి చూడక తప్పదని అభిప్రాయపడ్డారు. ఇక ఆగష్టు 15 నాటి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటన గురించి మాట్లాడుతూ.. ట్రయల్స్ నిర్వహించడానికి చాలా సమయం పడుతుందని, అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తికావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు. కాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది. (భారత్: 20 వేలు దాటిన కరోనా మరణాలు) -
ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వాక్సిన్
లండన్: ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావంతో ఉన్నట్టు ఆ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వైరస్ తాజా ఔష«ధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ సౌమ్య మాట్లాడారు. పదిమందిపై వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగం జరుగుతోందని, వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడవ దశకు చేరుకున్నారని డాక్టర్ సౌమ్య చెప్పారు. గేమ్ చేంజర్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కితాబిచ్చిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి కోవిడ్ మరణాలను నివారించే శక్తి లేదని మానవ ప్రయోగాల్లో తేలిపోయిందని సౌమ్య చెప్పారు. -
భారత్‌లోనే తక్కువ: డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచ దేశాలను నిలువెల్లా వణికిస్తున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు ఈ అంశాలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు. సోమవారం నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు పాటుపడుతున్న భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. (కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు!) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యం కాకపోతే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తగితన్ని టీకాలు అందుబాటులో ఉండకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే వ్యాక్సిన్ డెవలప్ చేసి, పరీక్షిస్తే సరిపోదని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా అత్యంత అవసరమన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా రెండున్నర లక్షల పైచిలుకు మరణించారు. భారత్‌లో 67,700 మంది కరోనా బారిన పడగా 2215 మంది మరణించారు. (ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం ఎక్కడ!?) చదవండి: (చైనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) -
హూ ఈజ్ షీ
అమ్మ టీచరు, నాన్న టీచరు అయితే, ఆ ఇంటి పిల్లలు కూడా టీచర్లే అవుతుంటారు. అది టీచర్ల కుటుంబం. అమ్మానాన్నలు డాక్టర్లయితే పిల్లలూ డాక్టర్లే అవుతుంటారు... అది డాక్టర్ల ఫ్యామిలీ. అలాగే... సౌమ్యా స్వామినాథన్‌ది సైంటిస్టుల ఫ్యామిలీ. ఈ ఇంట్లో అందరూ పరి శోధకులే. పరిపరి విధాల శోధించి సమాజానికి దిశను చూపించేవాళ్లే. శోధించి, సాధించిన ఫలాలను సమాజ శ్రేయస్సుకు అంకితం చేసేవాళ్లే. దేశ నిర్మాణం కోసం చెమట చుక్కలను అర్పించిన వాళ్లే. ఎం.ఎస్ స్వామినాథన్ పరిశోధనలతో మన కంచాలు నిండుతున్నాయి. మీనా స్వామినాథన్ విశ్లేషణలతో పిల్లల బుద్ధి పువ్వుల్లా వికసిస్తోంది. వీరిద్దరి మేధకు వారసురాలు సౌమ్య. సమస్త జనావళి ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యం చదివి మందులివ్వడంతో సరిపెట్టుకుంటే చాలదనుకున్నారు సౌమ్య. సమాజాన్ని అధ్యయనం చేశారు, వ్యాధుల మీద పరిశోధనలు జరిపారు, మందుల కోసం ప్రయోగాలు చేశారు. అలా... సౌమ్యా స్వామినాథన్ 30 ఏళ్లుగా పరిశోధనల్లోనే మునిగిపోయారు. పిల్లల డాక్టర్‌గా... పిల్లల ఆరోగ్యం కోసం విశేషంగా పరిశో«ధించారు. చెన్నైలోని నేషనల్ ట్యూబర్‌క్యూలోసిస్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్‌గా టీబీ వ్యాధిని నిర్మూలించడానికి రీసెర్చ్ చేశారు. ఆమె ఐసిఎమ్ఆర్... ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో డైరెక్టర్ జనరల్‌గా, ఆరోగ్య పరిశోధన, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీగా దేశానికి ఆరోగ్యపథాన్ని నిర్దేశించారు. ఇన్ని కీలకమైన బాధ్యతలతో వచ్చిన అనుభవమే ఆమెను ఎల్లలు దాటించింది. ఐక్యరాజ్యసమితి చూపు ఆమె మీదకు మళ్లింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ను చేసింది. సౌమ్య పని క్షేత్రం జెనీవాకు చేరింది. ఇది జరిగి ఆరు నెలలు దాటింది. ఇప్పుడామె డబ్లు్యహెచ్‌ఓలో అనేక విభాగాల్లో సీనియర్ పాలసీ అడ్వైజర్. పబ్లిక్ హెల్త్ కోసం ప్రపంచ స్థాయి సమీక్షలలో సౌమ్య పాత్ర కీలకమైనది. క్లినికల్ కేర్, రీసెర్చ్‌లో ఆమె అనుభవం, చిత్తశుద్ధి ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి హెచ్ఐవి/ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్, మలేరియాలను తరిమి కొట్టడానికి పనికొస్తోంది. ఆ వ్యాధుల నిర్మూలన కోసం ప్రోగ్రామ్ రూపొందించి సేవలందిస్తున్నారు సౌమ్య. యునిసెఫ్‌తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమన్వయకర్తగా ఉష్ణమండల దేశాల్లో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ కోసం పరిశోధన, శిక్షణ కార్యక్రమాల రూపకల్పనలో ప్రపంచానికి ఓ దారి చూపిస్తున్నారామె. తొలి ఇండియన్ డబ్లు్యహెచ్‌ఓలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరిన తొలి భారతీయురాలు సౌమ్య. ఆమెను ఈ స్థాయికి చేర్చిన ప్రయాణం చెన్నైలో మొదలైంది. బాల్యం, ప్రాథమిక విద్య చెన్నైలో సాగాయి. ఎంబీబీఎస్ పుణెలోని ఎఎఫ్ఎమ్సి (ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్)లో, ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఎం.డి చేశారు. పీహెచ్‌డీకి విదేశాలకు వెళ్లారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీడియాట్రిక్ పల్మనాలజీలో పరిశోధనను పూర్తి చేశారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్లలో ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థల్లో పరిశోధన విభాగాల్లో పనిచేశారు. మూడవ ప్రపంచ దేశాల మహిళా శాస్త్రవేత్తల సమాఖ్యలో కూడా సౌమ్య కీలకమైన సభ్యురాలు. పరిశోధన రంగంలో మహిళల పాత్ర అపారమని నమ్ముతారు ఆమె. ‘‘మహిళ ఆలోచనలు ఎప్పుడూ ఇంట్లో వాళ్ల సౌఖ్యం, సంక్షేమం, సంతోషం చుట్టూ తిరుగుతుంటాయి. ప్రతి తల్లి... తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, తన బిడ్డ సమాజంలో గౌరవస్థానంలో ఉండాలని కోరుకుంటుంది. మహిళలు చేసే పరిశోధనలు ప్రధానంగా వీటి చుట్టూనే సాగితే, వాటిæ ఫలితంగా ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన సమాజం ఏర్పడుతుంది’’ అంటారు సౌమ్యా స్వామినాథన్. ఇప్పుడామె ముందున్న ప్రధాన లక్ష్యం టీబీ రహిత సమాజం. టీబీ జీరో సిటీ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి టీబీ నిర్మూలనకు పనిచేస్తున్నారామె. ఇంకా నేర్చుకో డబ్లు్యహెచ్వోలో అవకాశం వచ్చినప్పుడు తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేస్తుంటారు సౌమ్య. ‘దేశం బయటకు వెళ్లినప్పుడు మన దృష్టి కోణం మారుతుంది. ఆ కోణం నుంచి దేశాన్ని చూసినప్పుడు మనదేశానికి ఏం అవసరమో తెలుస్తుంది. నాకు కూడా మనదేశంలో పరిశోధించినంత కాలం తెలుసుకున్న విషయాలకంటే ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో మనదేశానికి ఇంకా ఏం కావాలో తెలిసింది. నీకు కూడా ఇంకా నేర్చుకోవడానికి, దేశానికి అవసరమైన పనులు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థలో పని చేయడం బాగా ఉపకరిస్తుంది. ఇంకా నేర్చుకుంటావు’ అన్నారట స్వామినాథన్. సౌమ్య అమ్మా నాన్నలిద్దరూ కేంబ్రిడ్జిలో చదివారు. సౌమ్య తల్లి పిల్లల మే«ధా వికాసం కోసం శ్రమిస్తే, సౌమ్య పిల్లల దేహ ఆరోగ్యం కోసం ఓ తల్లిలా శ్రమిస్తున్నారు. తండ్రి హరిత విప్లవ పితామహుడు. తల్లితండ్రులిద్దరూ మేధతో సమాజానికి దిశా నిర్దేశం చేసిన వాళ్లే. అందుకేనేమో ఆ మేధస్సు వనంలో పూసిన ఈ సౌమ్య అనే పువ్వు ప్రపంచానికి ఆరోగ్యపరిమళాలను అద్దుతోంది. సౌమ్య అమ్మ! మీనా స్వామినాథన్ ఈ తరానికి సౌమ్య అమ్మగానే పరిచయం. ఆమె మనదేశ విద్యావ్యవస్థలో ఒక కొత్త నిర్మాణానికి పునాదులు వేశారు. అదే ప్రీస్కూల్ ఎడ్యుకేషన్. క్లాస్రూమ్ బయట–లోపల పిల్లలు నేర్చుకునే పద్ధతుల గురించి చెప్పారు. పాఠాలు నేర్చుకోవడానికంటే ముందు భాష నేర్చుకోవాలని చెప్పారు. అందుకోసం కరికులమ్ రూపొందించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పలకతో పనిలేకుండా నేర్పించాల్సిన విషయాలెన్నో ఉంటాయి. అక్షరాలు దిద్దడానికంటే ముందే పదాలను నేర్పించడం, భావవ్యక్తీకరణకు అవసరమైనంత భాషను నేర్పించడం, చిన్న చిన్న నాటికలతో పిల్లల్లో సృజనాత్మకతను రేకెత్తించడం ఎలాగో చెప్పారు. ఈ ప్రక్రియ సంపన్న వర్గాల దగ్గరే ఆగిపోకుండా రోజువారీ పనులు చేసుకునే శ్రామిక వర్గాల పిల్లలకు కూడా చేరాలని ఆకాంక్షించారు. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్‌కు ఒక రూపాన్నిచ్చారామె. ఎర్లీ చైల్డ్ కేర్, ఎడ్యుకేషన్ విభాగంలో యునెస్కోకు కన్సల్టెంట్‌గా సేవలందించారు. యునిసెఫ్ తరఫున బాధ్యతలతోపాటు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండియన్ అసోసియేషన్‌కి అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారామె. చైల్డ్ డెవలప్మెంట్ గురించి పత్రికల్లో వ్యాసాలు, పుస్తకాలు రాశారు. ఇప్పుడు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ సెంటర్లలో టీచర్లకు నియమావళిగా మార్గదర్శనం చేస్తున్నది మీనా స్వామినాథన్ పుస్తకాలే. సౌమ్య నాన్న సౌమ్యా స్వామినాథన్ తండ్రి మన్‌కోంబు సాంబశివన్ స్వామినాథన్. అంత పొడవైన పేరుతో మనకు పరిచయం లేదు, ఆయన ఎం.ఎస్ స్వామినాథన్గానే తెలుసు. హరిత విప్లవానికి నారు పోసిన వ్యవసాయ శాస్త్రవేత్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇరవై ఏళ్లు దాటినా కూడా మనదేశం తిండి గింజలను దిగుమతి చేసుకుంటున్న రోజులవి. దేశం కడుపు నిండా అన్నం తినడానికి, ప్రతి కంచంలో అన్నాన్ని చూడడానికి రాత్రింబవళ్లు పరిశోధనలు, ప్రయోగాలు చేశారాయన. ఒకటికి రెండింతలు, మూడింతలు పండే సస్యాలను రూపొందించాడు. నేల లోని సారాన్ని పంటకు చేర్చే మార్గాలను అన్వేషించారు. హరిత విప్లవంతో దేశాన్ని సస్యశ్యామలం చేశారు. ఆయన పరిశోధనలను ఆచరణలో పెట్టింది వ్యవసాయరంగం. వరి, గోధుమలను ఎక్కువగా పండించి, ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది భారతదేశం. ఈ గౌరవం దేశానిది! ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇది నాకు అందుతున్న గౌరవం కాదు, మన దేశానికి దక్కిన గౌరవం. వైద్యరంగంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కల్పించినందుకు దేశం పట్ల కృతజ్ఞతతో ఉంటాను. మన వాతావరణంలో వచ్చే అనారోగ్యాలు– వాటి నివారణ కోసం విస్తృతంగా పని చేయడానికి నాకిది మంచి అవకాశం. ’’ – డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డబ్ల్యూహెచ్‌వో సౌమ్య అవార్డులు ♦ ద ఆస్ట్రా జెనికా రీసెర్చ్ ఎండోమెంట్ అవార్డు(2016) ♦ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ (2013) ♦ తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు (2012) ♦ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లయిడ్ మైక్రోబయాలజిస్ట్స్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ (2011) ♦ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ క్షణిక ఓరేషన్ అవార్డు (2008) ♦ డాక్టర్ కేయా లహరీ గోల్డ్ మెడల్ (1999లో 11వ నేషనల్ పీడియాట్రిక్ పల్మనరీ కాన్ఫరెన్స్ పేపర్‌కి) – మంజీర -
ఆడవలసింది!
భారతీయ ఉమన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఆ జల్లులు ‘ఆడబోవడం లేదు’ అని ఆమె ప్రకటించినందుకు కాకుండా, ఆడి ఏదైనా సాధించినందుకు కురుస్తున్నట్లయితే మరింత బాగుండేది. జూలై 26 నుంచి ఆగస్టు 4 వరకు ఇరాన్‌లోని హమదాన్‌లో ఏషియన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అక్కడ చాంపియన్‌గా నిలిచిన టీమ్ ‘వరల్డ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సంపాదిస్తుంది. అయితే భారతీయ ఉమన్ గ్రాండ్‌మాస్టర్, ఒకప్పటి వరల్డ్ జూనియర్ గర్ల్స్ చాంపియన్ సౌమ్య స్వామినాథన్ ఆకస్మిక నిర్ణయంగా తన ఇరాన్ ప్రయాణాన్ని మానుకున్నారు! ఇరాన్ సంప్రదాయం ప్రకారం క్రీడాకారిణులు తప్పనిసరిగా తలగుడ్డను (హెడ్ స్కార్ఫ్) ధరించి ఆటలో కూర్చోవాలన్న నిబంధన తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌమ్య ఫేస్బుక్లో ప్రకటించారు. భారత జట్టు సభ్యురాలిగా సౌమ్య మొదట ఈ పోటీలకు ఆమోదం తెలిపినప్పుడు అవి బంగ్లాదేశ్‌లో జరుగుతున్నట్లు ఆలిండియా చెస్ ఫెడరేషన్ ఆమెకు తెలిపింది. ఈవెంట్ ఇరాక్‌కు మారిందని తెలిసిన వెంటనే సౌమ్య కేవలం ఈ ఒక్క హెడ్ స్కార్ఫ్ నిబంధన కారణంగానే ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నానని తన పోస్ట్‌లో వెల్లడించారు. సౌమ్య (29) పుణె యువతి. ఇండియాలో నెం.5, వరల్డ్‌లో నెం.95 ర్యాంకు ఉన్న చెస్ ప్లేయర్. దేశానికే ప్రతిష్ట. అలాంటి అమ్మాయి తన వ్యక్తిస్వేచ్ఛకు చెక్ చెప్పుకోలేనని చెప్పి, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు ఇప్పుడేమీ రెండు జట్లుగా విడిపోలేదు! సౌమ్య రైట్ అని అంతా ఒక జట్టుగా ఉండి, ఆమెను అభినందిస్తున్నారు. ‘‘నిర్బంధంగా నేను స్కార్ఫ్ ధరించలేను. ఇష్టం లేని పని చెయ్యడం అంటే నన్ను నేను అగౌరవ పరచుకోవడం. మనిషిగా నా హక్కును నేనే ఉల్లంఘించుకోవడం. నా గొంతును నేనే నొక్కేసుకోవడం. నా ఆలోచనల్ని నేనే మింగేసుకోవడం. నా మనస్సాక్షిని నేనే మోసం చేసుకోవడం. నా మతాన్ని నేనే తక్కువ చేసుకోవడం. ఇరాన్ వెళ్లి ఆడి.. నాకు నేను లేకుండా పోవడం కన్నా, వెళ్లకుండా నాకు నేను మిగిలిపోవడం ముఖ్యం అనుకున్నాను’ అనే అర్థంలో సౌమ్య తన మనోభావాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఏ దేశపు వస్త్ర సంప్రదాయాలు ఆ దేశానికి ఉంటాయి. బయటి నుంచి వచ్చినవారు తమ సంప్రదాయాలను అనుసరించాలని ఆ దేశాలు ఆకాంక్షించడం సహజమే. ఆకాంక్ష వరకైతే ఇబ్బంది లేదు. పట్టింపయితేనే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇరాన్లో స్కార్ఫ్‌పై పట్టింపు ఉంది. ఆ దేశ మహిళలు, బయటి దేశాల నుంచి వచ్చిన మహిళలు తప్పనిసరిగా తలను, రెండు చెవుల్నీ కప్పుతూ చున్నీ లాంటి వస్త్రాన్ని చుట్టుకోవాలి. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే లౌక్యం లాంటిది కాదది. సంప్రదాయానికి వాళ్లు ఇచ్చుకుంటున్న గౌరవం, మర్యాద. విదేశీయుల్ని కూడా వాటిని ఇచ్చిపుచ్చుకోమంటున్నారు. అయితే వ్యక్తికి ఉండవలసిన గౌరవ మర్యాదల మాటేమిటన్నది సౌమ్యలాంటి క్రీడాకారిణుల ప్రశ్న. ‘క్రీడా వేదికను మార్చడంపై ఆలిండియా చెస్ ఫెడరేషన్ కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ఉండవలసిందా?’ అని అమిత్ కర్మాకర్ అనే మీడియా ప్రతినిధి అడిగినప్పుడు.. ‘ప్రతి ఒక్కరూ నాలాగే అనుకోవాలని నేనెందుకు భావిస్తాను?’ అన్నారు సౌమ్య. (నాజీ పైకిడ్జే, మరియా మఝిచెక్, అన్నా మఝిచెక్ : హెడ్స్కార్ప్తో ఆడేందుకు నిరాకరించినవారు ) (పద్మినీ రౌత్, హారిక : హెడ్‌స్కార్ఫ్‌తో ఆడివచ్చినవారు) హెడ్‌స్కార్ఫ్ ధరించడం ఇష్టం లేకనే గత ఏడాది టెహ్రాన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అమెరికన్ చెస్ క్రీడాకారిణి నాజీ పైకిడ్జే కూడా ఆట నుంచి తప్పుకున్నారు. (అదే ఆటకు మన దేశం నుండి వెళ్లిన హారిక, పద్మినీ రౌత్ చక్కగా తల చుట్టూ వస్త్రాన్ని కప్పుకుని చెస్ బోర్డు ముందు కూర్చున్నారు). సౌదీ అరేబియాలో జరిగిన ప్రీమియర్ టోర్నమెంట్‌కు ఉబ్జెకిస్తాన్ నుంచి ఎంపికైన ఇద్దరు అక్కచెల్లెళ్లు అన్నా మఝిచెక్, మరియా ముఝిచెక్ కూడా స్కార్ఫ్‌తో ఆడేది లేదని ఆట నుంచి నిష్క్రమించారు. ‘‘టీమ్ డ్రెస్, ఫార్మల్స్, స్పోర్ట్స్ డ్రెస్ వీటిని ధరించాలని చాంపియన్‌షిప్ నిర్వాహకులు అనడంలో అర్థం ఉంది. కానీ మతపరమైన వస్త్రధారణను నిబంధనగా పెట్టడం ఏమిటి?!’ అని సౌమ్య ఆవేదన. ఈ ఆవేదన అసంబద్ధమని ఎక్కడా ఒక్క కామెంట్ కూడా రాలేదు. మతాలకు, జాతీయతలకు అతీతులైన ఒకరిద్దరు శుద్ధ సంప్రదాయవాదులు మాత్రం ‘స్కార్ఫ్ కట్టుకుని ఆడితే ఏం పోయిందీ పిల్లకు!’ అని ఆశ్చర్యపోయారు. స్పోర్టివ్‌గా తీసుకోవడం అది. సౌమ్య కూడా హెడ్‌స్కార్ఫ్ నిబంధనను తేలిగ్గా తీసుకుని (స్పోర్టివ్‌గా) ఆడి రావచ్చు. లౌకిక భాషలో ఈ స్పోర్టివ్‌నెస్‌కు అర్థం ‘పర మత సహనం’. మతపరమైన దేశంలో మతానికి ప్రాధాన్యం ఉన్నట్లే.. లౌకికరాజ్యంలో పర మత సహనం ఉంటుంది. దేశంలో ఉన్నవాళ్లతో కలిసి ఉండడం మాత్రమే కాదు, దేశం వెళ్లినప్పుడు అక్కడివాళ్లతో కలిసిపోవడం కూడా పర మత సహనమే. కాబట్టి ఒక లౌకికరాజ్య పౌరురాలిగా సౌమ్య హెడ్‌స్కార్ఫ్ కట్టుకుని ఆడి వస్తే తప్పేం అవదు. ఆటల్ని, మతాన్ని కలిపిచూడ్డం సరికాదని సౌమ్య అంటున్నారు. రైట్, ఆ దేశం కలిపి చూసింది. ఒక క్రీడాకారిణిగా తను చేసిందీ అదే! మతం నుంచి ఆటను వేరు చేసి చూడలేకపోవడం. అందువల్లనే కదా తను ఆట నుంచి విరమించుకున్నారు!! - మాధవ్ శింగరాజు -
బురఖా నిబంధన : తప్పుకున్న భారత క్రీడాకారిణి
హైదరాబాద్ : ఇరాన్లో నిర్వహించబోయే ‘ఏషియన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్’లో పాల్గొనడంలేదని మాజీ వరల్డ్ జూనియర్ గర్ల్స్ చాంపియన్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు. జులై 26 నుంచి ఆగస్టు 6 వరకూ ఇరాన్‌లోని హమదాన్‌లో నిర్వహించబోయే ఈ టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ దేశంలో ఉన్న ‘తలకు తప్పనిసరిగా స్కార్ఫ్ ధరించాల’నే నిబంధన వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘ఇరానీ చట్టాలలో మహిళలు తప్పనిసరిగా తలపై స్కార్ఫ్ లేదా బురఖా ధరించాలనే నియమం ఉంది. కానీ ఇలా బలవంతంగా స్కార్ఫ్ లేదా బురఖా ధరించడం అంటే నా స్వేచ్ఛకు ఆటంకం కల్గించడమే అవుతుంది. ఇలా చేస్తే నా హక్కులకు, నా మతానికి గౌరవం ఇవ్వనట్లే అవుతుంది. అందుకే నేను ఇరాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. టోర్నీలో భాగంగా మమ్మల్ని నేషనల్ టీం డ్రస్ కానీ, ఫార్మల్స్ కానీ, లేదా మరేదైనా స్పోర్ట్ డ్రెస్ వేసుకోమని కోరితే మేము సంతోషంగా ఒప్పుకునేవాళ్లము. అంతేకాని ఇలా మతపరమైన నియమాలను ఆటగాళ్ల మీద బలవంతంగా రుద్దడం సరైంది కాదు. ఇలాంటి అధికారిక చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేటప్పుడు క్రీడాకారుల మనోభావాలను, హక్కులను పట్టించుకోకపోవడం విచారకరం. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పటికి గర్వ కారణమే. క్రీడాకారులు వారి ఆట కోసం చాలా విషయాల్లో సర్దుకుపోతుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అలా చేయలేమని’ సౌమ్య తన పోస్టులో పేర్కొన్నారు. అథ్లెట్లు ఇలా టోర్నీ నుంచి తప్పుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇండియా ‘టాప్ షూటర్’ హీనా సింధూ కూడా ఇలానే 2016లో ఇరాన్లో నిర్వహించిన ‘ఏషియన్ ఎయిర్‌గన్ మీట్’ నుంచి తప్పుకున్నారు. అయితే అప్పుడు కూడా తలపై స్కార్ఫ్ ధరించాలనే నియమమే ఇందుకు కారణం. -
డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్‌గా సౌమ్య
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ కూతురు సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యక్రమాల అమలు విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీపీ–డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్)గా నియమితులయ్యారు. ఈ పదవి డబ్ల్యూహెచ్‌వోలో రెండో అత్యున్నతమైనది కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అయిన సౌమ్య క్షయ నిర్మూలనపై చేసిన పరిశోధనలతో గుర్తింపు పొందారు. గతంలో ఆమె చెన్నైలోని జాతీయ క్షయ పరిశోధనా సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశారు. -
‘ఆరోగ్యానికి’ జీడీపీలో 1 శాతమే
భారత వైద్య పరిశోధనా మండలి డీజీ సౌమ్యా స్వామినాథన్ - పేదరికం ఊబిలోకి ఏటా 10 లక్షల మంది - భారీగా ఔషధ ఎగుమతులు... మనకేమో అందవు - బీపీ, షుగర్‌లతోనే గుండెపోటు మరణాలు - రాజకీయ చిత్తశుద్ధితోనే ప్రజారోగ్యం - సార్వత్రిక ఆరోగ్య బీమా రావాలి సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ప్రజారోగ్యంపై చేస్తున్న ఖర్చు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం మాత్రమే! అదే కెనడా తన జీడీపీలో 7 శాతం వెచ్చిస్తోంది’’ అని భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైద్య పరిశోధనకు దేశంలో ఎక్కువగా నిధులు కేటాయించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజారోగ్య సాధనకు రాజకీయ చిత్తశుద్ధి అవసరమన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) 60వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం ఇక్కడ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘దేశంలోని పేదలకు అందుబాటులో ఆరోగ్య భద్రత’ అన్న అంశంపై ఆమె ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. కొన్ని దశాబ్దాల క్రితం అంటురోగాలతో ఎక్కువ మంది చనిపోయేవారని, ఇప్పుడు మాత్రం జీవన శైలి (దీర్ఘకాలిక) రోగాల కారణంగా అధికంగా మరణిస్తున్నారని వివరించారు. ‘‘ప్రాథమిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే జీవిత కాలాన్ని పెంచవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా ఉప ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఆరోగ్య, స్వస్థత కేంద్రాలను కూడా నెలకొల్పాలి. డాక్టర్ల కొరత తీర్చేందుకు ఆయుష్ వైద్యులకు ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సు నిర్వహించి వారి సేవలను వాడుకోవాలి’’ అని సూచించారు. మన దేశంలో గుండె సంబంధిత మరణాలే అధికంగా చోటుచేసు కుంటున్నాయి. జీవనశైలిలో మార్పుల వల్ల బీపీ, షుగర్ వంటివి పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం. పట్టణాల్లో కాలు ష్యంతో అనేక వ్యాధులకు కారణమవు తోంది. గ్రామాల్లో ఇప్పటికీ మహిళలు కట్టెల పొయ్యి ఎక్కువగా వాడు తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. దేశంలో జననాల రేటు నమోదు కచ్చితంగా ఉంది గానీ కానీ మరణాల రేటు సరిగా నమోదవడం లేదు. అంతేగాక మరణాల కు కారణాలపై సరైన సమాచారమే ఉండట్లేదు. దాంతో ప్రజారోగ్యంపై అవగాహనకు రాలేకపోతున్నాం’’ అని ఆమె వివరించారు. ఏటా 10 లక్షల మంది పేదరికం వైపు దేశంలో ఏటా 10 లక్షల మంది పేదరికపు ఊబిలోకి కూరుకుపోతున్నారని సౌమ్య ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రపంచ ఔషధ ఎగుమతుల్లో మన దేశ వాటా 30 శాతం. కానీ మన ప్రజలకు మాత్రం అవి అందుబాటు ధరల్లో లభించడం లేదు. కాబట్టి సార్వత్రిక ఆరోగ్య కవరేజీ కల్పించే దిశగా ఓ సమగ్ర ప్యాకేజీ రావాల్సిన అవసరముంది’’ అని ఆమె అన్నారు. ‘‘ఆరోగ్య సంరక్షణ కోసం నూతన వైద్య విధానం రావాలి. రాష్ట్రాల్లోని ఆరోగ్య పథకాలతో కేంద్రం అనుసంధానం కావాలి. వైద్య ఖర్చులను ప్రజలు పెట్టుకునే దుస్థితి పోవాలి. దేశంలో 400 వైద్య కళాశాలలుంటే పరిశోధనలు జరుగుతున్న వాటి సంఖ్య 25ను మించడం లేదు. వైద్య కాలేజీల్లో పరిశోధనలు విస్తృతం కావాలి. దేశంలో ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని అధికారికంగా గుర్తించేందుకు ఒక కమిటీ వేయాలి’’ అని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 80 శాతం డాక్టర్లు, 70 శాతం డిస్పెన్సరీలు పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. ఆరోగ్య రంగం 80 శాతం ప్రైవేటు చేతిలోనే ఉంద న్నారు. ‘‘వ్యక్తుల జీవితకాలం కేరళలో 72 ఏళ్లుంటే మధ్యప్రదేశ్‌లో 56 ఏళ్లే. ఒకే దేశంలో ఇంతటి వ్యత్యాసముండటం నిజంగా బాధాకరం’’ అన్నారు.