Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు | Bharat Ratna for M S Swaminathan Soumya Swaminathan reaction | Sakshi
Sakshi News home page

ఆయన బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు: సౌమ్య నాథన్‌

Published Fri, Feb 9 2024 2:41 PM | Last Updated on Fri, Feb 9 2024 5:17 PM

Bharat Ratna for M S Swaminathan Soumya Swaminathan reaction - Sakshi

#BharatRanta M S Swaminathan భార‌త హ‌రిత విప్లవ పితామ‌హుడు, ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వ్య‌వ‌సాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథ‌న్‌కు దేశ అత్యున్నత‌ పౌరపురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది.మరణానంతరం స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు దక్కనుంది. దీనిపై స్వామినాథన్‌ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్ , డబ్ల్యూహెచ్‌వో మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్  స్పందించారు.

ఆయన జీవితకాలంలో ఈ అవార్డు దక్కి ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉండేవారని అభిప్రాయ పడ్డారు. కానీ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ  ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదనీ గుర్తింపుకోసం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. కాలా  చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారంటూ తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు.  దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారు. సమాజంలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారామె. 

 ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన లవ్‌బర్డ్స్‌

కాగా దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేసి భార‌త హ‌రిత విప్లవ పితామ‌హుడుగా పేరు తెచ్చుకున్నారు స్వామినాథ‌న్ ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేసి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులునింపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను  దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులందుకున్నారు. అలాగే హెచ్‌కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా  అందుకున్నారు. స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement