M S Swaminathan
-
Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు
#BharatRanta M S Swaminathan భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది.మరణానంతరం స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు దక్కనుంది. దీనిపై స్వామినాథన్ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్ , డబ్ల్యూహెచ్‌వో మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. ఆయన జీవితకాలంలో ఈ అవార్డు దక్కి ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉండేవారని అభిప్రాయ పడ్డారు. కానీ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదనీ గుర్తింపుకోసం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. కాలా చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారంటూ తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారు. సమాజంలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారామె. ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్ కాగా దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేసి భారత హరిత విప్లవ పితామహుడుగా పేరు తెచ్చుకున్నారు స్వామినాథన్ ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేసి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులునింపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులందుకున్నారు. అలాగే హెచ్‌కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా అందుకున్నారు. స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. #WATCH | On M S Swaminathan being conferred the Bharat Ratna, Former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, Dr Soumya Swaminathan says, "I am sure that he would have also been happy if the news had come during his lifetime.… pic.twitter.com/gz3r6udKPb — ANI (@ANI) February 9, 2024 -
ఎం.ఎస్.స్వామినాథన్ రాయని డైరీ
కల మొలకెత్తడం తేలిక. కలను కళ్ల నిండుగా పండించుకోవడం కూడా తేలికే! హైబ్రీడ్ల గురించి కాదు ఈ మాట. పొలాన్ని శ్రద్ధగా చేతుల్లోకి ఎత్తుకోవాలంటున్నాను. క్యాబ్‌లో వెళ్లొచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలా సాగుబడి ఉండకూడదు. నిద్ర లేస్తూనే పొలంలోకి వెళ్లాలి. పొలాన్ని నిద్రలేపాలి. పొలానికి స్నానం చేయించాలి. పొలానికి ఇంత తిండి పెట్టాలి. పొలానికి కబుర్లు చెప్పాలి. పొలం చెప్పే కబుర్లు వినాలి. నిద్రొస్తే పొలంలోనే కునుకు తియ్యాలి. ‘అయ్యో! సిక్స్ అయిపోయింది’ అని ఇంటికి పరుగులు తీసే పనిలా ఉండకూడదు పొలం పని. వెళ్లలేక వెళ్లలేక పొలం వదలి ఇంటికి వెళుతున్నట్లు ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఉండబట్టలేక పొలానికి పరుగెత్తినట్లు ఉండాలి. పసికందుకు పడిశెం పడితే తుమ్ము రప్పించి శ్వాస ఆడిస్తుంది తల్లి. పొలానికి అలా శ్వాస ఆడించాలి. పసికందుకు బలం కోసం సెరెలాక్ పట్టిస్తుంది తల్లి. పొలానికి అలా ఎరువుల్ని పట్టించాలి. వయసొస్తున్న పిల్లలకు కాపు కాస్తుంది తల్లి. పొలానికి అలా దిష్టిబొమ్మగా ఉండాలి. పోతపాలా? తల్లిపాలా అని కాదు. ఆలన లాలన ముఖ్యం.. పొలానికీ పచ్చదనానికీ. సైన్స్ కాంగ్రెస్‌లో కొంతమంది రైతులొచ్చి నన్ను కలిశారు. నన్ను కలవడమే పనిగా వచ్చి కలిశారు. వాళ్లంతా కళ్ల నిండా కలల కంకులు పండించుకొచ్చిన రైతులు! యువరైతులు! వాళ్ల కలలకు నాగలికి ఉన్నంత బలం ఉంది, కోతలకు ఉన్నంత పదును ఉంది, నూర్పిళ్లకు ఉన్నంత ఒడుపు ఉంది. వాళ్లలో ప్రతి ఒక్కరు ఒక హరిత విప్లవకారుడు. ఆ యువరైతులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్ని బస్తాలైనా మోసేలా ఉన్నారు. ఎన్ని ఎకరాలైనా దున్నేసేలా ఉన్నారు. పంటను బాగా పండించడానికి ఇంకా ఏవైనా సలహాలు ఉంటే ఇవ్వండి అని అడిగేందుకు వచ్చారు! ఏం చెప్పను? బాగా పండించడానికి నా దగ్గర సలహాలేవీ మిగిలి లేవు. ‘ఇంకా బాగా’ పండించడమెలాగో చెప్పమంటే చెప్పగలను. పొలం పచ్చగా అవడం పచ్చని భూమి వల్ల కాదు. పొలం పోటెత్తడం పచ్చని జలం వల్ల కాదు. పొలం పంటెత్తడం పచ్చని పరిశోధన వల్ల కాదు. పొలాలకు, పంచభూతాలకు పచ్చదనాన్ని ఇచ్చే ఆ చేతులు వేరు. పొత్తిళ్ల వంటి చేతులు అవి. మన అమ్మలవి, మన అక్కచెల్లెళ్లవి ఆ చేతులు. చేనుకు అందుతున్న చేవ అంతా ఆ పచ్చని చేతుల్లోంచి వచ్చి చేరుతున్నదే. పొలాలన్నీ ఆడపడుచుల చేతుల్లోకి వచ్చేయాలి. ఆడపిల్లలకు కట్నంగా తండ్రి ఆ పిల్ల పేరిటే పొలం రాసివ్వాలి. నాలుగు రాళ్ల కోసం ఇంటాయన్ని పట్నం పోనివ్వకుండా ఆపినందుకు ప్రభుత్వం ఆ ఇంటి ఇల్లాలికి పొలాన్ని పట్టాగా ఇవ్వాలి. అప్పుడు ప్రతి మహిళా ‘మదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్’ అవుతుంది. అప్పుడు ప్రతి ఊరూ పచ్చటి పంటపొలం అవుతుంది. -మాధవ్ శింగరాజు