ప్రపంచ దేశాలను నిలువెల్లా వణికిస్తున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు ఈ అంశాలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు. సోమవారం నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు పాటుపడుతున్న భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. (కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు!)
వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యం కాకపోతే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తగితన్ని టీకాలు అందుబాటులో ఉండకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే వ్యాక్సిన్ డెవలప్ చేసి, పరీక్షిస్తే సరిపోదని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా అత్యంత అవసరమన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా రెండున్నర లక్షల పైచిలుకు మరణించారు. భారత్‌లో 67,700 మంది కరోనా బారిన పడగా 2215 మంది మరణించారు. (ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం ఎక్కడ!?)
చదవండి: (చైనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..)
Comments
Please login to add a commentAdd a comment