సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వస్తోందన్న భావన వద్దని, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిదని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటం, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు, టీకాల కార్యక్రమం మందగమనం, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం.. ఈ నాలుగు అంశాలు దీనికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితిపై బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, వ్యాధి ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నా యని ఆమె వివరించారు. ‘‘శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 9,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముందు వరసలో ఉన్నాయి. యూరప్‌లో గత వారం రోజుల్లో 32.2 శాతం, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2 శాతం, ఆఫ్రికాలో 18.2 శాతం కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు.
టీకా ఉత్పత్తి పెంచాలి
ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.
ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముం దు వరసలో ఉన్నాయి. యూరప్‌లో గత వారం రోజుల్లో 32.2%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2%, ఆఫ్రికాలో 18.2% కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు.
టీకా ఉత్పత్తి పెంచాలి
ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment