న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మానవులకు తగిన గుణపాఠం చెప్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేసిందన్నారు. ప్రధానంగా పర్యావరణ మార్పు, మరుగునపడిపోతున్న మానవ తప్పిదాలను మనకు అవగతమయ్యేలా చేసిందని చెప్పారు.
అంతేకాదు పర్యావరణ మార్పుల కారణంగా పాకిస్తాన్ ఎలా వరదలతో అల్లాడిందో కళ్లారా చూశామన్నారు. ఇలాంటి విపత్తే ఏ దేశానికైనా భవిష్యత్తులో జరగవచ్చు అని చెప్పారు. అంతేగాదు ఆమె ప్రజా ఆరోగ్య విధానం, పరిశోధనల ఆవశక్యత గురించి కూడా నొక్కి చెప్పారు. అలాగే వ్యాక్సిన్‌లు శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా వివరించారు.
బూస్టర్ డోస్ తీసుకున్న చాలామంది కరోనా వ్యాధి భారిన పడ్డారని, ఇలాంటివి ఒకటి లేదా రెండు కేసులు మినహ అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అంతేగాదు వ్యాక్సిన్‌లు అనేవి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. వ్యాక్సిన్‌ల కారణంగా సుమారు 20 బిలియన్ల మంది ప్రాణాలు రక్షింపబడ్డారని అన్నారు. అలాగే భారత్ కూడా ప్రజలందరూ వ్యాక్సిన్‌లు వేయించుకునేలా గట్టి చర్యలు తీసుకుందని ప్రశంసించారు.
(చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం)
Comments
Please login to add a commentAdd a comment