lesson
-
బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్ గేట్స్.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్ బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు.."విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు."వారెన్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్‌ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్ గేట్స్ సూచిస్తున్నారు. -
అదానీ చేతిలోనే బీజేపీ స్టీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందంటూ ఆదిలాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయాన్ని అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పకుండా దాచారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అమిత్ షా తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు. బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలవేళ బీజేపీ అబద్ధాలు విని రాష్ట్ర ప్రజలు విసిగి పోయా రని, పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి వాళ్లు మాట్లాడాలన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారన్నారు. ఆదిలాబాద్ సీసీఐని తెరిపిస్తామని ఐదేళ్ల క్రితం అమిత్ షా ఇచ్చిన హామీ ఏమైందని, గిరిజన యూనివర్సిటీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినా ఇప్పటిదాకా వర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కుటుంబ పాలనపై మాట్లాడితే నవ్వుకుంటున్నారు కుటుంబ పాలన అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య లపై దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని, క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన కొడుకు జై షా ఎక్కడ క్రికెట్ ఆడారో, ఎవరికి కోచింగ్ ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో పదేపదే తిరిగి ఎన్నికవుతున్న నాయకుల గురించి, కుటుంబ పాలన పేరుతో ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షా లాంటి వారికి లేదన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేకపోవడంతో కేవలం మత రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. -
పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి!
హాస్టల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుండటం సాధారణమే. ఒకరి వస్తువులను మరొకరు వాడటం, ఒకరి దుస్తులను మరొకరు ధరించడం మొదలైన విషయాల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఒక యువతి తన రూమ్మేట్ తన ఆహారాన్ని రోజూ దొంగిలిస్తున్నదని గ్రహించి,అత్యంత విచిత్ర రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. హాస్టల్, లేదా పీజీలో ఉండేవారు అక్కడ లభ్యమయ్యే ఆహారం కన్నా ఇంటి భోజనమే వెయ్యిరెట్లు ఉత్తమమని భావిస్తుంటారు. అందుకే కొందరు బయటి నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో రూమ్మేట్స్తో షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇటీవల ఒక యువతి తన ఫ్లాట్మేట్ నుంచి తన ఆహారాన్ని జాగ్రత్త చేసుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చ్యపోవాల్సిందే. సారా అనే యువతి టిక్‌టాక్‌లో @saatj32 హ్యాండిల్‌పై ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఆమె మరోదారిలేక తాను తన ఆహారాన్ని పాడు చేసుకోవలసి వస్తున్నదని ఈ వీడియోలో పేర్కొంది. తన ఫ్లాట్ మేట్ తన ఆహారాన్ని చోరీ చేస్తున్నందుకు ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని పేర్కొంది. ఆమె షేర్ చేసిన వీడియోలో ఆమె ఒక ఆర్గానిక్ బ్రిటీష్ సెమీ స్కిమ్డ్ మిల్క్ డబ్బా తెరుస్తూ కనిపిస్తోంది. తరువాత ఆమె దానిలో అత్యధిక మోతాదులో ఉప్పు కలిపింది. తరువాత ఆమె కెమెరావైపు చూస్తూ.. తన ఫ్లాట్మేట్ దొంగచాటుగా పాలను తాగేసి, డబ్బా అక్కడ పెట్టేస్తోంది. ఈ పాలు ఎలా తాగుతుందో ఇప్పుడు చూస్తాను అని పేర్కొంది. ఈ వీడియో క్యాప్షన్‌లో.. ‘ఈ విషయంలో నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని పేర్కొంది. ఈ వీడియోను చూసిన పలువురు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇలా చేసేముందు నువ్వు నీ రూమ్మేట్కు ఒకసారి ఈ విషయం చెప్పి ఉండాల్సింది’ అని రాశారు. చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
మంచి మాట: విజయం ఓటమి తర్వాత వేకువ
ఓటమి ద్వారా వచ్చే విజయం ఉంది! అది ఓటమి నేర్పే పాఠం!! ఓటమి నేర్పే పాఠం ఎంతో ముఖ్యమైంది ఆపై విలువైంది; అది మరేవిధంగానూ రాదు. ఓటమి దెబ్బ బలంగా తగిలినా మనిషి పడిపోకుండా నిలబడి ఆ పాఠాన్ని చదవాలి. ఓటమి నేర్పిన పాఠాన్ని సరిగ్గా చదవగలిగిన మనిషికి భవిష్యత్తులో విజయం అందుతుంది; విజయవంతమైన భవిష్యత్తు అందుతుంది. ఓడిపోయాక శోకిస్తూ ఉండడం సరికాకపోవడమే కాదు హానికరమైంది కూడా. ఓడిపోయాకైనా గెలవాలి అన్న పట్టుదల కలగాలి. ఆ పట్టుదల ఓటమి తరువాతి జీవనంపై పట్టును ఇవ్వాలి. ఓడిపోవడం నేరం కాదు. ఓడిపోయాక తలదించుకోవాల్సిన అగత్యంలేదు. ఓడిపోతే కుంగిపోకూడదు ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు, వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ ఉండిపోకూడదు; ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా ఉండిపోకూడదు. ఓడిపోతే నిస్ప్పహా ప్రభావానికి మ్రాన్పడి చిల్తై పోకూడదు. ఓడిపోయాక, నిస్పృహ ఆవరించాక నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి. ఆపై మెలకువను పొందినట్లుగా సత్స్పృహను పొందాలి. ఓడిపోతే కష్టాలొస్తాయి; ఆ కష్టాలలోనే సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాలు ఎంతో ముఖ్యమైనవి. జీవితం అన్నాక, జీవనం ఉన్నాక ఆశాభంగం తప్పదు. భంగం అయినంత మాత్రాన భాగ్యం భగ్నమైపోదు. ఓడిపోయిన తరువాత నిలదొక్కుకోగలిగిన మనిషి ముందుకు సాగగలడు. కలిగిన ఓటమికి దెబ్బతిన్నాక గెలవడంపై మనిషికి చైతన్యం రావాలి. ఓటమి గురించి చింత, చింతనలను అధిగమించాలంటే మనిషికి గెలవాలి అన్న చైతన్యం కావాలి, రావాలి. ఆ చైతన్యంతో గెలుపును సుసాధ్యం చేసుకోవాలి. ఓటమి కలిగాక దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. కలిగిన ఓటమికి మనం సాక్ష్యం మాత్రమే అవ్వాలి. అంతకుమించి మనం ఓటమిలో కూరుకుపోకూడదు. భవిష్యత్తులో విజయంలో విలీనం అవ్వాలంటే కలిగిన ఓటమి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. విజయం సాధించడం ఎలాంటిదో ఓటమి నుంచి విడివడడం కూడా అలాంటిదే. ప్రపంచంలో విజేతలైనవాళ్లలో ఎక్కువ శాతంమంది ఓటమి నుంచి తమను తాము విడిపించుకున్నవాళ్లే. సూర్యోదయాన్ని పొందుతూ ఉండడం భూమి రోజూ సాధిస్తున్న విజయం. పొంగుతూ, సాగుతూ పారడం నది సాధిస్తున్న విజయం. వీస్తూ ఉండడం గాలికి విజయం. విజయం అనేది ఒక లక్ష్యమా? కాదు. విజయం అనేది లక్షణం. అవును విజయం అనేది మనిషికి లక్ష్యంగా కాదు లక్షణం గా ఉండాలి. ఓటమి చీకటిలా మూగినప్పుడు కాస్తంత ఓపికపడితే విజయం వేకువై వచ్చేస్తుంది. ‘‘వేసవికాలం వెంబడించని చలికాలం లేదు’’ అన్నారు వివేకానంద. ఓటమి అనే చలికి పట్టుబడి గడ్డకట్టుకుపోకుండా ఉండగలగాలి. చలికాలం తరువాత వేసవి వచ్చేస్తుంది. ఓటమి శోకాన్ని కలిగించినా విజయాన్ని సాధించేందుకు కాలం ఉందని, ఉంటుందని తెలుసుకోవాలి. విజయం కోసం ఆశపడితే, ఆకాంక్షిస్తే తప్పకుండా మనిషికి అవకాశాలు ఆసన్నం అవుతాయి. వాటిని సఫలం చేసుకుంటే విజయం వస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా మనిషి జీవితం వసంతం అవుతుంది. – రోచిష్మాన్ -
‘మునుగోడు’ పాఠం నేర్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: నిత్యం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కొత్త పాఠాలు నేర్చుకున్నారా? పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యవేక్షణలో ఉప ఎన్నిక వ్యూహం అమలు, ప్రచారంలో ఎదురైన అనుభవాలు తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయా? ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలను, వివిధ వర్గాలు తమపట్ల స్పందిస్తున్న తీరును బేరీజు వేసుకునేందుకు ఉప ఎన్నిక ఒక పాఠంలా పనిచేసిందా?.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కొత్త ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేయడంపై ఇప్పట్నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక నొక్కి చెప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వచ్చే పది నెలల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి, ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితిని గుర్తు చేసిందనే భావన కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’సంస్థ వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇస్తున్న సమాచారాన్ని సీఎం కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వంద మందికో ఇన్చార్జిని నియమించాలని కేసీఆర్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోణంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కేడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. మోహరింపుతో స్వయం విశ్లేషణ మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని పార్టీ కీలక నేతలందరినీ మోహరించారు. సుమారు 20రోజుల పాటు మునుగోడులో మకాం వేసిన నేతలు పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అక్కడ 2,500 నుంచి 3వేల మంది ఓటర్లను ఒక యూనిట్‌గా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో మకాం వేసిన నేతలకు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల పట్ల ఓటర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని మదింపు చేసుకునే అవకాశం దక్కింది. ఏయే వర్గాలు పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి, వారు ఉప ఎన్నికలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఏయే అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కింది. యువత, ఉద్యోగులు, కొత్త ఓటర్లు, మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారనే దానిపైనా స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యేలు ఈ అనుభవాలను తమ నియోజకవర్గ పరిస్థితులతో పోల్చి చూసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఫలితంపై అంచనాలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఏం కోరుకుంటున్నారు, ఏ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు, అంతర్గత విభేదాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాలపైనా ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చినట్టు పేర్కొంటున్నాయి. ఓటర్లకు చేరువ అయ్యేలా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ అవకాశంపై ఎమ్మెల్యేలు అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్‌తో ఉన్న గ్యాప్‌ను సరిదిద్దుకోవడం, వారికి దగ్గరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో భేటీలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాల ద్వారా వారికి చేరువగా ఉన్నామనే అభిప్రాయం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్ల జాబితాలను తెలంగాణ భవన్‌కు పంపాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఇన్చార్జులు ప్రతీ ఓటరును చేరుకుని వారి పూర్తి వివరాలను సేకరించి ప్రొఫైల్స్‌ను రూపొందిస్తారు. ఓటరు కుటుంబం, వారిలో ఎందరికి ఓటు హక్కు ఉంది, ఎక్కడ నివాసం ఉంటున్నారు, నియోజకవర్గం బయట ఉండే వారి చిరునామా, ఫోన్ నంబర్ వివరాలన్నీ సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి, పట్టు పెంచుకునేందుకు ఈ కసరత్తు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదీ చదవండి: Hijab: నిరసనకారులకు గుణపాఠమా?! -
కరోనా మహమ్మారి...తగిన గుణపాఠం చెప్పింది: డబ్యూహెచ్ఓ చీఫ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మానవులకు తగిన గుణపాఠం చెప్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేసిందన్నారు. ప్రధానంగా పర్యావరణ మార్పు, మరుగునపడిపోతున్న మానవ తప్పిదాలను మనకు అవగతమయ్యేలా చేసిందని చెప్పారు. అంతేకాదు పర్యావరణ మార్పుల కారణంగా పాకిస్తాన్ ఎలా వరదలతో అల్లాడిందో కళ్లారా చూశామన్నారు. ఇలాంటి విపత్తే ఏ దేశానికైనా భవిష్యత్తులో జరగవచ్చు అని చెప్పారు. అంతేగాదు ఆమె ప్రజా ఆరోగ్య విధానం, పరిశోధనల ఆవశక్యత గురించి కూడా నొక్కి చెప్పారు. అలాగే వ్యాక్సిన్లు శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా వివరించారు. బూస్టర్ డోస్ తీసుకున్న చాలామంది కరోనా వ్యాధి భారిన పడ్డారని, ఇలాంటివి ఒకటి లేదా రెండు కేసులు మినహ అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అంతేగాదు వ్యాక్సిన్లు అనేవి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. వ్యాక్సిన్ల కారణంగా సుమారు 20 బిలియన్ల మంది ప్రాణాలు రక్షింపబడ్డారని అన్నారు. అలాగే భారత్ కూడా ప్రజలందరూ వ్యాక్సిన్లు వేయించుకునేలా గట్టి చర్యలు తీసుకుందని ప్రశంసించారు. (చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం) -
11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది..
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్‌కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్‌లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్‌లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.! చదవండి👉: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా? క్రైం నంబరు 173/2011 సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్ శ్రీనివాస్(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్‌కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్ 2011 జూన్ 20న హైదరాబాద్ ఉప్పల్‌లోని ఏఆర్కే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్మెంట్లో హత్యచేశారు. ఫ్రిజ్‌లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు. పక్కావ్యూహంతో.. వలపు వల ♦ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్ ఉరఫ్ శేఖర్(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్‌కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్ సిరిసిల్లు మకాం మర్చాడు. ♦సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు. ♦తమ ఇంటి యజమాని శ్రీనివాస్ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ అపార్ట్మెంట్లో రెండునెలల కోసం ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్ సుజాతతో శ్రీనివాస్‌కు ఫోన్ చేయించి ట్రాప్ చేశారు. ♦2011 జూన్ 20న శ్రీనివాస్‌ను హైదరాబాద్ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్ వెళ్లి అపార్ట్మెంట్లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్ శ్రీనివాస్‌ను బంధించాడు. శ్రీనివాస్ తండ్రి గడ్దాస్ నర్సప్పకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్‌లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు. ♦బంధీగా ఉన్న శ్రీనివాస్ జూన్ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్‌కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు. చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్.. 2017 సెప్టెంబరు 12న శిక్ష శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్‌ఫోన్ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్‌లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలకు చార్జ్‌షీట్ అప్పుడు నేను సిరిసిల్ల టౌన్ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్‌షీట్ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్‌లకు ఇటీవల పాఠంగా బోధించారు. – సర్వర్, ఎస్బీ, సీఐ, సిరిసిల్ల -
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు. ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ నందన్, డాక్టర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. -
సత్సంకల్పంతోనే సాఫల్యం
కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కితిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరికోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్తసంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తు కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్తసంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకోవాలి. నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే చర్యలకు దూరంగా ఉండాలి.కాలం చెప్పే చారిత్రక వాస్తవాలనుండి గుణపాఠం గ్రహించకుండా లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్తసంవత్సర ప్రారంభాన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసి ఉంటే భవిష్యత్ కాలంలో వాటిని మరింతగా విస్తరిస్తామని, తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటిని ఈ క్షణం నుండే విసర్జిస్తామని సంకల్పం చెప్పుకోవాలి.ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్నిగురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ గడచినకాలం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యకాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని,సమస్తమానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తంకావాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ హెచ్చరించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో జరిగిన సంఘటనను సాకుగా చూపి ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించాలనే నిర్ణయం అనాగరికమన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మూర్ఖత్వమని విమర్శించారు. ప్రతిపక్షాలను చులకన చేయడం, ధర్నాచౌక్‌లు ఎత్తివేయడం నియంత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నక్సల్స్ ఎజెండా అంటూనే రక్తపుటేరులు పారిస్తున్నారని.. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. చెర్ల పద్మ, దిండిగాల మధు, బాశెట్టి కిషన్, మాదాసు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వీరారెడ్డి, సాయికృష్ణ, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. నిరంకుశ చర్య: మాజీ ఎంపీ పొన్నం బడ్జెట్ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించడం ప్రభుత్వ నిరంకుశ చర్యకు నిదర్శనమని టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హెడ్‌ఫోన్ విసిరిన సంఘటనను సాకుగా చూపి ఇద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేయడం, 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పెప్పర్‌స్ప్రే దాడి జరిగినా..స్పీకర్ సమావేశాన్ని కొనసాగించిన తీరును గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలు రాజ్యాంగ విలువలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. తక్షణమే ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనపై పోరాటం చేస్తామని పొన్నం హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం : గజ్జెల కాంతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్జెల కాంతం అన్నారు. నియంతల వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుయాత్రలో కాంగ్రెస్కువచ్చిన ప్రజాస్పందనను చూసీ కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, నాయకులు బాశెట్టి కిషన్, చొప్పదండి మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి జనార్దన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎం.తిరుపతిరావు, సముద్రాల అజయ్ పాల్గొన్నారు. జమ్మికుంటలో.. బడ్జెట్ సమావేశాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంటలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆబాది రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న ఎస్సైలు శ్రీనివాస్, రియాజ్ అక్కడికి చేరుకోగానే.. కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరిగింది. పర్లపల్లి రమేశ్, దిడ్డి రామ్, సాయిని రవి, ఎండి సలీం, తిరుపతి, భాస్కర్, ఎగ్గని శ్రీనివాస్, బోగం వెంకటేశ్, గౌస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
లోకానికి ఇవ్వగలిగే పాఠం
తండ్రీ కొడుకూ తినడం పూర్తయ్యింది. నెమ్మదిగా తండ్రి చేతిని కడిగించాడు కొడుకు. మూతి తుడిచాడు. మీద పడిన మెతుకులను తీసేశాడు. ఒక యువకుడు వాళ్ల నాన్నను ఒక రెస్టారెంటుకు తీసుకెళ్లాడు. నాన్న బాగా వృద్ధుడయ్యాడు. బలహీనంగా ఉన్నాడు. భోంచేస్తుంటే చేతులు వణుకుతున్నాయి. అందుకే తింటున్నప్పుడు మెతుకులు తన చొక్కా మీదా, టేబుల్ మీదా వేసుకున్నాడు. వడ్డించుకుంటుండగా పులుసు కింద పడింది. అది చూస్తున్న పక్కనున్నవాళ్లు ఇబ్బందిగా ఫీలయ్యారు. ఇలాంటివాడిని బయటికి తీసుకురాలేకపోతేనేమని కూడా కొందరు మనసులో అనుకున్నారు. తండ్రీ కొడుకూ తినడం పూర్తయ్యింది. నెమ్మదిగా తండ్రి చేతిని కడిగించాడు కొడుకు. మూతి తుడిచాడు. మీద పడిన మెతుకులను తీసేశాడు. నెమ్మదిగా లేవదీసి, భుజం మీద చేయి వేయించుకుని నడిపించుకుంటూ వెళ్లి, ముందున్న సోఫాలో కూర్చోబెట్టాడు. కౌంటర్లో బిల్లు చెల్లించి, మళ్లీ వాళ్ల నాన్నను సమీపిస్తున్నప్పుడు, ఆ రెస్టారెంటులో కూర్చుని భోజనం చేస్తున్నవారిలో ఒక పెద్దాయన పిలిచాడు. ‘నాయనా, నువ్వు మీ టేబుల్ దగ్గర ఏమైనా వదిలిపెట్టావా?’ ఆ యువకుడు తన జేబుల్ని తడుముకొని, ‘ఏమీ లేదే’ అని జవాబిచ్చాడు. ‘కాదు, నువ్వు అక్కడ మాకో పాఠాన్ని విడిచావు’ అన్నాడు పెద్దాయన. యువకుడు చిరునవ్వుతో తండ్రి సహా బయటికి వెళ్లిపోయాడు. పాఠం చెప్పడానికి ప్రత్యేకంగా మనం ఏమీ చేయనక్కర్లేదు. మనం చూపించే చిన్న చిన్న ప్రేమల్లో, ఆప్యాయతల్లో కూడా ఇంకొకరికి పాఠం కాగలిగేది ఏదో ఉంటుంది. -
చిట్టిబుర్రలకు ట్రాఫిక్ చిట్కాలు
బెంగళూరు ట్రాఫిక్ అంటే అదొక పద్మవ్యూహమే. లక్షలాది వాహనాలు, మనుషులతో కిక్కిరిసిన రోడ్లు అమ్మో అనిపిస్తాయి. దీనికి వాహనదారుల్లో అవగాహన లేకపోవడమూ ఒక కారణమనాలి. చిన్నప్పటి నుంచే బాలల్లో ట్రాఫిక్ పై చైతన్యం కల్పించడం ఉత్తమమని భావించిన రవాణా, విద్యాశాఖలు ఆ దిశగా కదిలాయి. జయనగర: సిలికాన్ సిటీలో ట్రాఫిక్ ని ర్వహణ అనే అంశాన్ని పాఠ్యాం శంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో వాహన సంచారం– ట్రాఫి క్ సమస్య నిర్వహణ అనే విషయాన్ని పాఠ్యాంశంలో చేర్చడం పరిశీలించాలని రవాణాశాఖ ఇటీవల ప్రాథమికోన్నత విద్యాశాఖకు ప్రతిపాదన అందించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ దీనిపై లోతుగా ఆలోచిస్తోంది. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాగా, నూతన విద్యాసంవత్సరం ప్రారంభదశలో ఉంది. అంతేగాక 2018–19 పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించగా, ఈ దశలో నూతన విషయాన్ని పాఠ్యాంశంలో చేర్చడం సాధ్యం కాదు. దీంతో 2019–20 విద్యాసంవత్సరం నుంచి బెంగళూరు ట్రాఫిక్ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వం తీర్మానించింది. ఉద్యానగరం విస్తారంగా అభివృద్ధి చెందడంతో నగరంలో ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు భద్రత గురించి విద్యార్థులను ఏవిధంగా జాగృతం చేయాలి అనే దాని పట్ల రవాణాశాఖ సలహాలు అందజేసింది. వాటికి అనుగుణంగా ఈ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నారు. 2019–20 నుంచి అందుబాట్లోకి వస్తుందని బుధవారం రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్‌సేఠ్Š‡ తెలిపారు. పాఠ్యాంశంలో చేర్చే విషయాలు.... ♦ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్, నియమాలు ♦ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, జరిమానా గురించి సమాచారం ♦ వేగ నియంత్రణ, ఓవర్టేక్, పాదచారుల సురక్షత గురించి సమాచారం ♦ రోడ్డు ప్రమాదం సంభవించే సమయంలో అత్యవసరంగా సంప్రదించే సంస్థల వివరాలు ఉంటాయి. ♦ ఈ పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులను ఎంపికచేసి ఢిల్లీలో ఉన్నతస్థాయి శిక్షణ తరగతులకు పంపుతారు. అక్కడ మాస్టర్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చి ఇతర ఉపాధ్యాయులకు రోడ్డు భద్రత గురించి శిక్షణనందిస్తారు. -
అతిపెద్ద బిజినెస్ లెసన్స్‌తో గిన్నీస్ రికార్డు
-
దంబోద్భవుడికి గుణపాఠం
పురానీతి ఒకానొక కాలంలో దంబోద్భవుడనే రాజు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే గర్విష్టి. పైగా భుజబల పరాక్రమ సంపన్నుడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. రోజూ అతడు సభకు వచ్చి, సింహాసనంపై కూర్చోగానే వందిమాగధులు, భట్రాజులు అతడిని కీర్తిస్తూ స్తోత్రాలు పఠించేవారు. బల సంపదలో అతడికి సాటివచ్చే వారు ముల్లోకాలలోనూ లేరని పొగిడేవారు. దంబోద్భవుడు చిరునవ్వులు చిందిస్తూ, మీసం మెలితిప్పుతూ ఆ పొగడ్తలను వీనుల విందుగా ఆలకించేవాడు. రోజూ పొగడ్తలను విని విని లోకంలో తనను మించిన వారే లేరనే భ్రమలో బతకసాగాడు. ‘ఈ భూలోకంలో నన్ను మించిన వీరుడెవరైనా ఉన్నాడా? ధనుర్విద్యలోనే కాదు, ఖడ్గ గదా యుద్ధాలలో నన్ను జయించగల వాడెవడైనా ఉన్నాడా? కనీసం మల్లయుద్ధంలో నన్ను మట్టికరిపించే ధైర్యం ఎవరికి ఉంది?’ అంటూ సభాసదులను ప్రశ్నించేవాడు. ‘భూలోకంలోనే కాదు ప్రభూ! ముల్లోకాలలోనూ మిమ్మల్ని జయించగల వీరులెవ్వరూ లేరు’ అని వందిమాగధులు ముక్తకంఠంతో బదులిచ్చేవారు. మిగిలిన వారు మౌనంగానే తలలు పంకించేవారు. వందిమాగధుల పలుకులు వింటూ భుజాలు ఎగరేస్తూ పకపకా వికటాట్టహాసం చేసేవాడు దంబోద్భవుడు. అతడి సభలో ఇదంతా అనుదినం జరిగే తతంగమే. రోజూ పొగడ్తలు మాత్రమే వింటూ ఉండటంతో దంబోద్భవుడు మితిమీరిన గర్వంతో విర్రవీగసాగాడు. ఇలా ఉండగా, ఒకనాడు పొరుగు రాజ్యానికి చెందిన విప్రులు యాత్రలకు వెళుతూ దంబోద్భవుని సభకు వచ్చారు. దంబోద్భవుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు. ‘విప్రులారా! మీరు దూర ప్రాంతం నుంచి వచ్చారు. యాత్రలు చేస్తూ ఉన్నారు. నన్ను మించిన వీరుడు ఎవరైనా మీకు తారసపడ్డాడా?’అని ప్రశ్నించాడు. ‘రాజా! నీవు మహావీరుడివే! సందేహం లేదు. రాజులలో నిన్ను మించిన వారు లేనేలేరు. అయితే, గంధమాధన పర్వతం మీద నర నారాయణులనే ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలో ఎవరూ లేరని విన్నాం’ అని చెప్పారు ఆ విప్రులు. ఆ మాట వినడంతోనే తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టాడు దంబోద్భవుడు. ‘నన్ను మించిన వీరులా..? వారిని జయించగలవారు ముల్లోకాలలోనే లేరా..? ఆ సంగతి ఇప్పుడే తేల్చుకుంటాను’ అంటూ సేనలను యుద్ధానికి సిద్ధం చేసి గంధమాధన పర్వతం వైపు బయలుదేరాడు. గంధమాధన పర్వతం మీద ప్రశాంత వాతావరణంతో ఉన్న వనంలో ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటున్న నర నారాయణులు కనిపించారు. యుద్ధానికి రమ్మంటూ దంబోద్భవుడు వారిని తొడగొట్టి మరీ ఆహ్వానించాడు. ఆశ్రమానికి వచ్చిన దంబోద్భవునికి నర నారాయణులు అతిథి మర్యాదలు చేయబోగా, అతడు వాటన్నింటినీ తిరస్కరించాడు. ‘ఈ మర్యాదలన్నీ అనవసరం. నాకు యుద్ధం కావాలి... నేను మీతో యుద్ధం కోసమే వచ్చాను’ అంటూ వికటాట్టహాసం చేశాడు. ‘లౌకిక కార్యకలాపాలకు దూరంగా తపస్సు చేసుకునే మునులం మేము. మాతో యుద్ధం చేయాలనే కోరిక నీకు ఎలా కలిగింది రాజా! యుద్ధం ఆలోచనను విరమించుకుని, చక్కగా నీ రాజ్యానికి పోయి ప్రజల ఆలనా పాలనా చూసుకో’ అని నచ్చచెప్పారు నర నారాయణులు. వారి మాటలు రుచించని దంబోద్భవుడు దాడి చేయమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. తానూ కత్తి ఝుళిపించాడు. నర నారాయణుల్లో నరుడు ఇక లాభం లేదనుకుని ఒక దర్భపుల్లను తీసుకుని, దానిని మంత్రించి సైన్యం మీదకు సంధించాడు. దర్భపుల్ల ధాటికి సైన్యం చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తుత్తినియలయ్యాయి. వాళ్ల అవయవాలు తెగాయి. భయభ్రాంతులైన సైనికులు పలాయనం చిత్తగించసాగారు. ఈ దృశ్యం చూడటంతో దంబోద్భవుడికి ధైర్యం దిగజారింది. తన తప్పు తెలిసివచ్చింది. తనను మన్నించాలంటూ నర నారాయణుల కాళ్ల మీద పడ్డాడు. ‘రాజా! బల పరాక్రమాలను దుర్జన శిక్షణకు, సజ్జన రక్షణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప వాటి కారణంగా గర్వం తలకెక్కించుకుని ఇతరులను పీడించరాదు’ అంటూ హితబోధ చేసి దంబోద్భవుడిని సాగనంపారు నర నారాయణులు. -
మేడే నేర్పుతున్న పాఠం..!
అది దశాబ్దాలుగా కార్మికులు కట్టుబానిసలుగా జీవితం గడిపిన కాలం. 19వ శతాబ్దం చివర్లో శ్రామిక ప్రజానీకం తమ యాజమాన్యాల ఉక్కుపాదాల కింద నలుగుతున్న రోజులవి. పారిశ్రామిక విప్లవంతో మనుషులే యంత్రాలుగా మారిన దుస్థితి. చట్టాల్లేవు, హక్కులు లేవు. అత్యంత అభద్రతా స్థితిలో రోజుకు 14 నుంచి 16 గంటల పాటు చట్ట బద్ధంగానే పనిచేయవలసి వచ్చిన ఆ రోజుల్లో పనిస్థలాల్లో గాయాలు, మరణాలు సర్వ సాధారణంగా ఉండేవి. అమెరికాలో ఆప్టన్ సింక్లెయిర్ రాసిన ‘ది జంగిల్’, జాక్లండన్ రచన ‘ది ఐరన్ హీల్’ నాటి కార్మికుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రించాయి. వేతనంలో కోతలేకుండానే తక్కువ పనిగంటల కోసం 1860ల మొదట్లోనే కార్మికులు ఆందోళనలు చేశారు కానీ, 1880ల చివరికి సంఘటిత కార్మికవర్గం 8 గంటల పనిదినాన్ని డిమాండ్ చేయగలిగిన శక్తిని సాధించుకుంది. అదే సమయంలో సోషలిజం ఒక నూతన, ఆకర్షణీయ భావనగా కార్మికులను ఆకట్టు కుంది. వస్తూత్పత్తిపై, సకల వస్తుసేవల పంపిణీపై కార్మికవర్గం యాజమాన్యం అనే భావన శ్రామికులను ఆకర్షించింది. వేలాది మంది స్త్రీ పురుషులు, బాలబాలికలు ప్రతి సంవత్సరం పనిస్థలాల్లోనే కన్నుమూస్తున్న భయానక పరిస్తితుల్లో సోషలిజం వారిలో ఆశలు రేపుతూ పలుకరించింది. ఆ సమయంలోనే అమెరికా, ఐరోపా దేశాల్లో హక్కులు ఊపిరి పోసుకున్నాయి. 1885 మే 1వ తేదీన చికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతంలో 8 గంటల పనిదినం కోసం లక్షలాది కార్మికులు ఆందోళనకు దిగారు. మే 3వ తేదీన చికాగోలోని మెకార్మిక్ వర్క్స్‌లో ఆందోళన చేస్తున్న 3 లక్షల మంది కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది నేలకొరిగారు. కార్మిక హక్కుల పోరులో మైలు రాయిగా నిలిచిన ఆ ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నేడు వందకు పైగా దేశాల్లో అధికా రికంగా జరుపుకుంటున్నారు. ఎనిమిది గంటల పనిదినాన్ని కల్పించాలని ఇంకా ఇతర డిమాం డ్లతో శ్రామిక ప్రజలు తమ రక్తం చిందించి సాధించుకున్న డిమాం డ్లకు 21వ శతాబ్దంలో కాల దోషం పడుతోందా? అనే అనుమానం ప్రబలుతోంది. 127 ఏళ్ల తర్వాత కూడా కార్మికుల జీవితాలకు భద్రత దినదిన గండంలా మారింది. భారత్ వంటి దేశాల్లోని కోట్లాది అసంఘటిత రంగ కార్మి కులు.. హక్కులు అనే భావనకూ దూరమైపోయారు. 1990ల వరకు బలంగా ఉన్న ట్రేడ్ యూనియన్ల కారణంగా సంఘటిత రంగంలో కార్మికులకు ఉన్న కాసింత భద్రత కూడా నేడు లోపిస్తోంది. ఇక అసంఘటిత రంగంలో నేటికీ కార్మికులు బానిసల్లా గానే బతుకుతు న్నారు. దుస్తుల ఫ్యాక్టరీ వంటి చోట్ల రోజువారీ లక్ష్యం కాస్త తగ్గినా యాజమాన్యం విరుచు కుపడుతూ అదనపు పని గంటల్లో పనిచేయించడం నేడు సైతం నిత్య కృత్యంగా మారింది. పనిస్థలంలో నీళ్లుండవు. ఉద్యోగ భద్రత లేదు. ఇక దేశ మంతా విస్తరించిన పారిశ్రామిక సెజ్‌లలో యజమానులు ఏది చెబితే అదే నిబంధనలా మారిపోయింది. ప్రైవేట్ రంగం తొలినుంచి పీడక స్వభావంతో ఉందనేది కాదనలేని సత్యమే కానీ.. ప్రభుత్వాలు సైతం కార్మికుల కనీస హక్కులను కూడా కాలరాస్తుండటం దారుణం. కార్మికులకు పదవీ విరమణానంతరం కాసింత భద్రతనిస్తున్న భవిష్యనిధినే మార్కెట్ పరం చేసే ధోరణులు పొడసూపుతున్నాయి. పీఎఫ్‌పై వడ్డీని తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎన్ని పిల్లిగంతులు వేసిందో చూశాం. భవిష్యత్తులో ప్రభుత్వో ద్యోగాలు ఉండవని ఏలికలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. భవిష్యనిధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కు తీసుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై బెంగళూరు నగరంలో కార్మికులు, ఉద్యోగులు హింసాత్మక ప్రదర్శనలు చేస్తే ఆగని ఆ ఆంక్షలు రద్దు కాలేదు. సుపరిపాలన, పారదర్శక విధానాలు, ప్రజానుకూల ప్రభుత్వం వంటి కొత్త భావనలన్నీ పైపై చక్కెర పూతలేనని పీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు వంటి చర్యలు నిరూపిస్తున్నాయి. చట్టాలున్నపుడే కనీస వేతనాల చట్టం అమలు చేయడం లేదు. పని భద్రత అమలు కావడంలేదు. అసంఘటిత కార్మికులకు మేలు జరగడంలేదు. ఇప్పుడు వాటి సవరణలు చేసి కార్మికులను మరింత కష్టాల్లోకి నెట్టారు. పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఎన్నో ఏళ్ళుగా సాధించుకున్న కార్మిక హక్కులు, ప్రయోజనాలు హరించుకుపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుతున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలనుంచి, కార్మిక వ్యతిరేకమైన ఈ చట్టాల నుంచి వారికి రక్షణ కల్పించడమే నేటి కార్మిక సంఘాల కర్తవ్యం. ఇలాంటి ప్రమాద ఘంటికలను కార్మిక సోదరులు ఐకమత్యంతో అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. లేదంటే రాబోయే రోజుల్లో కార్మిక సంక్షేమం, అవసరాలు, కనీస సదుపా యాల కల్పన వంటివి ఎండమావులుగా మారే ప్రమాదం ఉంది. రక్త ప్లావిత ఆచరణతో మేడే నేర్పిన, నేర్పుతున్న గుణపాఠం ఇదే. (నేడు మేడే సందర్భంగా) కె. రాజశేఖరరాజు -
ఓరుగల్లు నుంచే టీఆర్ఎస్ కు గుణపాఠం
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచే టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పడం ప్రారంభం కావాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింద న్నారు. -
అనుభవం అయ్యేనా పాఠం?
బైలైన్ పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల పాత్రలు ఆసక్తికరంగా తారుమారు కావడమే గత ఏడాదిలో చాలా కాలాన్ని మింగేసింది. ఆగ్రహంతో ఒళ్లు మరచి ఊగిపోయే పరిస్థితులు ఏర్పడటమంటే పార్లమెంటరీ వ్యవస్థ ఆరోగ్యానికి కీడు జరుగుతున్నదని సంకేతం. స్వల్పకాలిక సమావేశాలను నిర్వహించడంలో ప్రభుత్వానికేమైనా స్వార్థ ప్రయోజనాలు ఉండవచ్చునని ఊహించడం తర్కబద్ధమైనదే. పెద్దగా చర్చలేకుండానే చట్టాలు చేసేయడం దానికి ఆదర్శప్రాయం కావచ్చు. ప్రభుత్వాలంటే సువ్యవస్థితమైన పాలనా యంత్రాంగాలు కాబట్టి, అవి కనీస పరిశీలనకు గురవుతూ, గరిష్ట వెసులుబాటును కోరుకుంటాయి. అందుకు బదులుగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమనే ఒత్తిడిని తెచ్చే వేదికగా పార్లమెంటు అందించే పలు అవకాశాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే స్వయంగా కాలరాచివేయాలనే కృత నిశ్చయంతో ప్రవర్తించింది. హేళనగా కూతలు పెట్టడం, గావుకేకలు వేసి అడ్డగించడం ద్వారా కాంగ్రెస్ పదే పదే ప్రశ్నోత్తరాల సమయాన్ని హతం చేసింది. బోర్డింగ్ స్కూల్లో ఇలాంటి ప్రవర్తనకు టర్మ్ ముగిసేసరికి తీవ్రమైన మందలింపులు తప్పవు. కొన్ని బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహకరించిన మాట నిజమే. అయితే అవి కూడా చాలా వరకు ప్రతికూల ప్రజాభి ప్రాయమంటే భయంతో పెద్దగా చర్చ లేకుండా ఆమోదించినవే. అయితే కాంగ్రెస్ ఏకాకి కావడం గమనించదగ్గ వాస్తవం. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ అలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉన్నాయి. ఇదేమైనా కాంగ్రె స్ ప్రవర్తనలో ముందు ముందు పెద్దగా తేడాను కలుగజేస్తుందా? నిర్హేతు కమైన వ్యూహం ఏ మలుపు తీసుకుంటుందో ముందుగా చెప్పడం కష్టం. ఈ ఏడాది మాటగా చెప్పుకోవాల్సిన సూక్తి ఒక పెద్ద విషయంగానే విస్తరింపజేయగలిగినది. అయితే మొన్ననే సెలవు పలికి నిష్ర్కమించిన ఏడాది అనుభవంపై ఆధారపడి ఆ సూక్తి ఉత్పన్నార్థాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్ దేవుని పట్ల పెద్దగా విధేయత గలవాడుగా సుప్రసిద్ధుడు కాడు. అయినా ఆయన ఆకాశం వైపు తలెత్తి చూసినప్పుడల్లా భగవంతుడా! అంటూ అత్యంత అర్థస్ఫోరకమైన ఓ మంచి మాట చెప్పేవాడు. ఓసారి ఆయన ‘‘ఓ ప్రభువా, నా శత్రువులను పరిహాసాస్పదులను చేయుము’’ అన్నాడు. ఉత్సాహంగా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే ప్రజా జీవితంలో ఎవరైనాగానీ అంతకంటే ఎక్కువగా కోరగలిగేది ఏముంది? కాలక్రమానుగుణంగా పుట్టుకొచ్చే ఆందోళనలు కూడా కొన్ని ఇతర చర్చల్లాగే తయారు చేయాల్సినవి. అయితే అవి భోజనానికి అనుబంధంగా ఉండాల్సిన రుచికరమైన పదార్థాలేగానీ, ఆవశ్యకం కానివి. కానీ పసందైన భోజనానికి అవి అనుబంధంగా ఉండాల్సిందే. లిటరరీ క్రిస్మస్ క్రాకర్ (క్రిస్మస్ సందర్భంగా పత్రికలు ఒకప్పుడు ప్రచురిస్తుండే సాహిత్య అనుబంధంలోని చమత్కారాల శీర్షిక) ఏమైపోయింది? లిటరరీ అనే ముందు మాటను బట్టే ఇదేదో టపాకాయలా ఇలా పేలి, అలా చచ్చిపోయేది కాదని తెలుస్తోంది. చమత్కారపూరితమైన ప్రశ్న, అనూహ్యమైన సమాధానం రూపంలో దాగిన మేధోపరమైన సృజనాత్మక పదప్రయోగ చమత్కారం అది. ఆ సమాధానం అర్థం స్ఫురింపజేసేదానికంటే ఒకింత ఎక్కువ అర్థాన్నే అది కలిగి ఉంటుందనేది స్పష్టమే. విసుగుదనం లేదా అంతకంటే అధ్వానమైనదైన నైతికత నుంచి సమాచారాన్ని కాపాడి, బోధించడమేగాక ఉల్లాసపరుస్తుంది. కళలు, పుస్తకాలకు వార్తా పత్రికలు ఎక్కువ స్థలాన్ని కేటాయించి, వాటిని సంకలనపరిస్తే అవే తదుపరి ఏడాదికి పాఠకులకు నూతన సంవత్సర కానుకలవుతాయి. బ్రిటన్ వార్తా పత్రికలు ఇంకా ఆ అద్భుత వినోదానికి శ్రద్ధను, సమయాన్ని కేటాయిస్తున్నాయి. మన దేశం నుంచి అది నిష్ర్కమించడం చింతించాల్సిన విషయం. సీమట పాకాయ పెరిగి పెద్దదై క్విజ్గా మారిందని, అన్ని కాలాలూ అందుబాటులో ఉంటోందని ఆశావాదులు వాదించొచ్చు. అయినా గతంలో ఉండే మంచి ఉండనే ఉంది. అందుకు నేనో ఉదాహరణ చెబుతాను. లీనింగ్ టవర్ ఆఫ్ పీసాను (ఇటలీలోని ఒరిగి ఉండే సుప్రసిద్ధ కట్టడం) నిటారుగా నిలపాలని ఎవరు అనుకుంటారు? ముస్సోలినీ. మరింత విడమర్చి చెప్పాలంటే... ప్రజాస్వామ్యంలేని అధికారం వెర్రి. క్రిస్మస్ ఒక జననానికి సంబంధించినది. అది పరిరక్షకుని పుట్టుకకు సంబంధించిన పండుగ. మనకంటే దురదృష్టవంతులైనవారిపట్ల దయ, దాతృత్వం చూపడమే క్రైస్తవ మత లక్ష్యం. ప్రిసిల్లా చాన్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్లే 2015 క్రైస్తవులు. వారు తమ తొలి సంతానం పుట్టుక సందర్భాన తమ అపార సంపదలో 99 శాతాన్ని చాన్ జుకెర్‌బర్గ్ ఇనిషియేటివ్‌కు ఇచ్చేస్తామని వాగ్దానం చేశారు. అది నమ్మశక్యం కానంతటి మొత్తం. దాదాపు 45 బిలియన్ల (4,500 కోట్లు) డాలర్లు. ఉన్నదున్నట్టుగా చెబుతున్నా, నాకైతే బిలియన్ డాలర్లంటే ఎంతో తెలీదు. 45 బిలియన్లంటే ఓ చిన్న దేశం వార్షిక రాబడంత కావచ్చు. ప్రిసిల్లా, మార్క్‌లు జీవితంలో వచ్చే జన్మ కోసం బీమా పాలసీలను తీసుకోవాలని ఆరాటపడాల్సిన దశలో లేరు. ఇంకా యవ్వనంలోనే ఉన్నారు. అమెరికాలోని కొత్తా, పాతా బిలియనీర్లలో వారు ఒంటరివారు కారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా 44 బిలియన్ డాలర్ల ట్రస్టు ఆర్థిక సహాయంతో నడిచే గేట్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇతర దేశాలతోపాటూ మన దేశంలో కూడా అద్భుతమైన కృషి చేస్తోంది. భారతదేశంలో అలాంటి బిలియనీర్లు కనబడేదెన్నడు? ఈ ఏడాది అత్యుత్తమ కొటేషన్ ఖ్యాతి మాత్రం మరుపున పడిపోయిన హాలీవుడ్ స్టార్ బర్డ్ రేనాల్డ్స్ ఆత్మకథకే దక్కుతుంది. ఇటీవలే ప్రచురితమైన అందులో ఆయన, అలనాటి గ్లామరస్ నటి జోన్ క్రాఫోడ్ మరణాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఒక పార్టీకి, క్రాఫోడ్ బద్ధ శత్రువైన మరో నటి బెట్టీ డెవిస్ కూడా హాజరైంది. విలేకర్లతో మాట్లాడుతూ ఆమె ఇలా అంది... ‘‘చనిపోయిన వారి గురించి మంచే తప్ప, చెడు మాట్లాడకూడదు, జోన్ క్రాఫోడ్ చనిపోయింది. మంచిది! ’’ - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త బీజేపీ అధికార ప్రతినిధి -
నియంతలకు గుణపాఠం
దేశదేశాల నియంతలనూ భయపెట్టే పరిణామాలు ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తాయి. ఉద్యమ పుత్రికగా, మయన్మార్ స్వేచ్ఛా ప్రతీకగా అందరి మన్ననలూ అందుకుంటున్న ఆంగ్‌సాన్ సూచీ ఆ దేశ పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఘన విజయం అలాంటి అరుదైన సందర్భమే. ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయిదురోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో 440 స్థానాలున్న దిగువ సభలో శుక్రవారంనాటికి ఆమె పార్టీ 238 స్థానాలను గెల్చుకుందని...224 సభ్యులుండే ఎగువసభలో ఇంతవరకూ ఆ పార్టీకి 110 లభించాయని యూనియన్ ఎన్నికల కమిషన్(యూఈసీ) ప్రకటించింది. మొత్తంగా అక్కడి పార్లమెంటులో ఎన్ఎల్డీకి ఇంతవరకూ 348 స్థానాలు వచ్చాయి. అంతేకాదు...అక్కడున్న ఏడు రాష్ట్రాల్లోనూ, ఏడు ప్రాంతీయ సభల్లోనూ, ఆరు స్వయంపాలిత జోన్లలోనూ, ఒక స్వయంపాలిత డివిజన్‌లోనూ ఆ పార్టీదే ఆధిక్యం. వీటిలో ఇంతవరకూ 522 స్థానాల ఫలితాలు ప్రకటించగా 401 స్థానాలు ఎన్ఎల్డీ గెల్చుకుంది. సైన్యం ప్రాపకంతో ఏర్పడిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ) ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసినవారే సభ్యులవుతారు. ఆ స్థానాలకు ఎన్నికలుండవు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఇంచుమించు మనతోపాటే స్వాతంత్య్రాన్ని సాధించుకున్న మయన్మార్(అప్పటి పేరు బర్మా) దురదృష్టవశాత్తూ స్వల్పకాలంలోనే సైనిక శాసనంలోకి వెళ్లిపోయింది. అక్రమ నిర్బంధాలు, దారుణ చిత్రహింసలు నిత్యకృత్యమైనా... అడుగడుగునా నిఘాతో ఇబ్బందులపాలు చేసినా మయన్మార్ ప్రజల్లోని స్వేచ్ఛా పిపాసను సైనిక నియంతలు చల్లార్చలేకపోయారు. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్‌లో స్థిరపడిన సూచీ... అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు సామాన్య పౌరుల్లో పెల్లుబుకుతున్న ఈ ఆగ్రహజ్వాలలను పసిగట్టారు. వారికి నాయకత్వంవహించి తీరాలని సంకల్పించారు. ఆమె నేతృత్వంలో సాగిన మహోద్యమానికి తలొగ్గి రెండేళ్ల తర్వాత...అంటే 1990లో సైనిక పాలకులు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్ఎల్డీ అపూర్వమైన విజయం సాధించింది. ఊహించని ఈ ఫలితాలతో ఖంగుతిన్న సైనిక పాలకులు ఎన్నికలను రద్దు చేసి సూచీని బంధించారు. అయిదేళ్ల జైలు జీవితం, పదిహేనేళ్ల గృహ నిర్బంధం ఆమెలోని పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి. అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం, నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఇతర దేశాల సహకారం తప్పనిసరికావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సైనిక నియంతలు అయిదేళ్లక్రితం ఆమెను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహిస్తామని కూడా వాగ్దానం చేశారు. అయితే దీన్నెవరూ నమ్మలేదు. 2010లో ఒకసారి ‘పోటీ’లేని ఎన్నికలు జరిపించి 80 శాతం ఓట్లు తెచ్చుకున్నామని ప్రకటించిన చరిత్రగల సైన్యంపై ఎవరికీ నమ్మకం కుదరలేదు. సైనిక పాలకులు తెలివితక్కువగా ఏమీ లేరు. సూచీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా...తమకున్న అధికారాలు చెక్కుచెదరకుండా రాజ్యాంగంలో అన్ని ఏర్పాట్లూ చేసుకునే ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ అందులో నిబంధన పెట్టారు. అలాగే అన్ని చట్టసభల్లోనూ 25 శాతం సీట్లు దఖలుపరుచుకున్నారు. రాజ్యాంగ సవరణకు పూనుకుంటే వీటో చేసే అధికారాన్ని కూడా అట్టేబెట్టుకున్నారు. మయన్మార్‌లో నాలుగు నెలల తర్వాతగానీ కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఈలోగా సైనిక పాలకులు మరెన్ని కుట్రలు రచిస్తారో తెలియదుగానీ...ఇప్పటికైతే ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే మార్చిలో తప్ప ఎన్ఎల్డీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం లేదు. అధ్యక్ష పీఠానికి సూచీ ఎవరి పేరును ప్రతిపాదిస్తారో, కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఎజెండాను నిర్దేశిస్తారో అప్పటికిగానీ తేలదు. అయితే ఆమె పార్టీ ప్రభుత్వం చాలా సమస్యలనే ఎదుర్కొనవలసి ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింల సమస్యకు సూచీ ఏం పరిష్కారం వెదుకుతారో, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఎలాంటి కార్యక్రమాన్ని ప్రకటిస్తారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. రోహింగ్యాల్లో అత్యధికులు ముస్లింలు. గుర్తింపు పొందిన జాతుల్లో లేరన్న నెపంతో రోహింగ్యాలకు ఓటు హక్కును రద్దు చేయడంతోపాటు ఇతర ముస్లింలను సైతం అనేకవిధాల వేధించారు. వీటిపై సూచీ మాట్లాడలేదు సరిగదా...తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదు. అలా చేస్తే బౌద్ధ తీవ్రవాదుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని, పర్యవసానంగా తమకు అధికారం చేజారవచ్చునని ఆమె భావించారు. ఈ ఎన్నికల ద్వారా మయన్మార్ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. జనాభిప్రాయాన్ని గౌరవించి ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సీన్, ఆర్మీ చీఫ్ ఆంగ్ హ్లెయింగ్ ఎటూ ఆమె పార్టీకి అధికారాన్ని బదలాయిస్తారు. అయితే సూచీ అధ్యక్ష పీఠం ఎక్కకుండా నిరోధిస్తున్న రాజ్యాంగ నిబంధనను సవరించడానికి వారు ముందుకు రావాలి. కొత్త ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించే కుట్ర బుద్ధులను వదులుకోవాలి. సూచీ సైతం మైనారిటీ జాతులు గౌరవప్రదంగా, నిర్భయంగా జీవించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మయన్మార్ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా వర్థిల్లుతుంది! -
మళ్లీ మళ్లీ మల్లీశ్యరి
రాయలవారి ముందు... ‘నా ప్రాణం తీసుకోండి... బావని వదిలేయండి’ ‘లేదూ నా ప్రాణం తీసుకోండి, మల్లిని వదిలేయండి’ అని ప్రాధేయపడుతుంటే మన గుండె తరుక్కుపోతుంది. ‘నా ప్రాణం తీసుకోండి’ అని ఇద్దరూ అంటున్నారంటే... నిజానికి ఒకరి ప్రాణం ఒకరిలో ఉందని. ఈ ప్రమాదం జరుగుతుందని ప్రేక్షకుడిగా మనకి ముందే అనిపిస్తుంది. అప్పుడే అనుకుంటాం... ‘అయ్యో తప్పు చేస్తున్నావు... నీ మల్లికి కావాల్సింది రాణివాసం కాదు... నీ హృదయ సామ్రాజ్యానికి రాణి అవడం’ అని అరిచి చెప్పాలని! ఈ సినిమా మనకి చెప్పే గొప్ప గుణపాఠమే అది. గమ్మత్తు కోసమైనా... పరాచికాలాడకూడదని. భానుమతికి పల్లకి పంపించమని ఎన్టీఆర్ పరాచికం ఆడితేనే... ఈ అరాచకం జరిగింది. అంత అందంగా ప్రేమించుకునే చిలకాగోరింకలు ఒంటరులై, ఎవరికి వారై, తెలిసీతెలియక కోరితెచ్చుకున్న ఎడబాటుతో కుమిలిపోయారు. గుండెను పిండే అందమైన ప్రేమకథ. ఎన్టీవోడు, భానుమతి ఇంకా అందంగా ఉంటారు. పాటలు మీగడతరకల్లా... మాటలు తేనెల ఊటల్లా... సన్నివేశాలు కవ్వించి, నవ్వించి, ఏడిపించేలా... మళ్లీ... మళ్లీ... మల్లీశ్వరిలా.... మళ్లీ చూడండి ‘‘ఏక చక్రీ మహాభోగీ! మహారాణివౌతావు. మహాభోగం పొందుతావు తల్లీ. బ్రహ్మ మాటకైనా తిరుగుంది కానీ ఈ బసవయ్య మాటకు తిరుగులేదు తల్లీ! జై శంకర మహాదేవ్’’ భానుమతి చెయ్యి చూసి ఫ్యూచర్ చెప్పాడు తిరణాల జోస్యుడు. టీన్స్‌లో ఉన్న ప్రతి పిల్లా క్వీనే కానీ... జోతిష్యుడు చెప్పాడని మహారాణి అయి కూర్చుంటుందా? ‘‘వెళ్దాం పద’’ అన్నాడు ఆ పిల్ల బావ ఎన్టీఆర్. ‘‘బావా! నీ చెయ్యి కూడా చూపించు’’ అంది భానుమతి. ‘‘ఆ.. నా చెయ్యి ఎందుకూ - నువ్వు మహారాణివైతే, నేను మహారాజునైనట్టే’’. భానుమతి బిడియంతో ముడుచుకుంది. చిరునవ్వు నవ్వింది. బావంటే భానుమతికి ప్రాణం. ఎన్టీఆర్‌కీ అంతే. కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యడు. శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. ఒక్కరోజైనా ఇద్దరూ చూసుకోకుండా, మాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా ఉండలేదు. ఆ రోజూ అంతే. బావామరదళ్లిద్దరూ కలిసి ఎడ్లబండిలో తిరణాలకని వీరాపురం నుండి వచ్చారు. వీరాపురం... వెరీ నియర్ టు విజయనగరం. తిరిగి వెళ్లే సమయానికి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి! ఈ పడుచు జంటపై పన్నీటి జల్లులు కురవబోతున్నాయా? వారి ప్రేమను కన్నీటి జడులు ముంచెత్తబోతున్నాయా? ఆ మేఘాలు దేనికి సంకేతం? పైన ఉరుముతోంది. పాడుబడిన సత్రంలోకి పరుగెత్తారు ఎన్టీఆర్, భానుమతి. వాన మొదలైంది. అది ఆగేవరకు వీళ్లూ ఆగాలి. వేరే దారి లేదు. వాతావరణం చల్లగా ఉంది. భానుమతి మనసు పులకించింది. ఆడింది. ‘పిలిచిన బిగువటరా ఔరౌరా...’ అని పాడింది. రాజా అంటే నాగరాజు. మన ఎన్టీఆర్. వీళ్లిక్కడికి ఎలాగైతే వర్షానికి తలదాచుకోవాలని వచ్చారో... అలాగే మరో ఇద్దరు అక్కడి చేరుకున్నారు. భానుమతి నాట్యాన్ని, పాటనీ... చూసీ, వినీ ఆ ఇద్దరూ పులకించి పోయారు. వాళ్లల్లో ఒకరు మారువేషంలో ఉన్న విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకొకరు ఆయన ఆస్థాన పండితుడు. హోరు ఎంతకూ తగ్గడం లేదు. వాళ్లూ వీళ్లూ మాటలు కలుపుకున్నారు. ఊర్లూ పేర్లూ చెప్పుకున్నారు. ‘‘ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు... మల్లీశ్వరి’’ అని చెప్పాడు ఎన్టీఆర్. మల్లీశ్వరి అంటే మన భానుమతే. రాయలవారు వాత్సల్యంగా చూశారు. ‘‘అమ్మాయీ... ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో! మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం’ అని మెడలోంచి హారం తీసి ఇవ్వబోయాడు. ‘‘వద్దండీ’’ అంది భానుమతి వినయంగా. ‘‘అలా అనకూడదమ్మా. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. ఈ హారం మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలతో గౌరవింపదగింది. నువ్వు చెప్పు నాయనా’’ అన్నాడు పండితుడు ఎన్టీఆర్ వైపు చూస్తూ. తీసుకోమన్నాడు బావ. ఆభరణాన్ని అందుకుంది మరదలు. వాన హోరు తగ్గింది. భానుమతి మాటల జోరు మాత్రం తగ్గడంలేదు. తన ముందున్నది రాయలవారని తెలియక, తన ధోరణిలో తను ఏదో మాట్లాడుతూనే ఉంది. రాయల వారు నవ్వుతూ వింటున్నారు. మరదల్ని ఆటపట్టిద్దామని ఎన్టీఆర్ అన్నాడు - ‘‘ఈమె ఆటాపాట మెచ్చుకున్నారు కదా. ఒక ఉపకారం చేస్తారా?’’ అని. అడగమన్నాడు పండితుడు. ‘‘మరేం లేదులెండి, ఇందాక ఏదో సెలవిచ్చారే... మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలని! అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో, ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి... ఆ కాదులెండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకీ పంపేట్టు మాత్రం చూడండేం’’ అన్నాడు భానుమతిని ఏడిపించడానికి. రాయల వారు ముచ్చటగా నవ్వారు. అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ‘‘పో బావా నీతో మాట్లాడను. ఎందుకు చెప్పు... వాళ్లతో పల్లకి పంపమని చెప్పడం’’ అంది భానుమతి ఎన్టీఆర్ వైపు చిరుకోపంతో చూస్తూ. ఎన్టీఆర్ నవ్వాడు. ‘‘ఓస్ పిచ్చిపిల్లా! వీళ్లేనా పల్లకీలు, పట్టపుటేనుగులూ పంపేది! వీళ్లకసలు రాయలవారి దర్శనమే కాదు’’అని తేల్చేశాడు. కానీ తను చేసిందే పిచ్చి పని అని అప్పుడు అతడికి తెలీదు. ఎన్టీఆర్, భానుమతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ జంటను చూసి చెట్టూపుట్టా కూడా మురిసిపోతున్నాయి. కానీ భానుమతి తల్లే. ఆమెకు మాత్రం ఎన్టీఆర్‌ని చూస్తే చిర్రెత్తుకొచ్చేస్తోంది. శిల్పాలు చెక్కడం తప్ప వేరే పని చేతకాని అప్రయోజకుడికి పిల్లనిచ్చి చెయ్యడం ఆమెకు ఇష్టం లేదు. మేనల్లుడు ఉండగా వేరెవరికో ఇచ్చి చెయ్యడం భానుమతి తండ్రికి ఇష్టం లేదు. ఓ రోజు భానుమతి తల్లి ఎన్టీఆర్ తల్లిని పట్టుకుని కడిగేసింది. ‘‘నీ కొడుకు అప్రయోజకుడు. వాణ్ణి నా కూతురితో కలవన్వికు’ అని తిట్టేసింది. అది తెలిసి నాగరాజు పంతం పట్టాడు. నాగమ్మ (భానుమతి తల్లి) కోరినంత ధనం తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు పడేసి, తనూ ధనవంతుడినే అనిపించుకుని భానుమతిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తన చేతిలో శిల్పకళ ఉంది. కష్టపడి పనిచేస్తే ఏ ఆస్థానంలోనైనా ఉద్యోగం రాకపోదని అతడి నమ్మకం. భానుమతి అడ్డుచెప్పినా వినకుండా, ‘నేను వచ్చేంత వరకు మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటావుగా’ అని మాట తీసుకుని మరీ వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. బావ కోసం ఎదురు చూస్తోంది భానుమతి. ఎంతకూ రాడు. ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు / దేశదేశాలన్ని తిరిగి చూసేవు / ఏడ తానున్నాడో బావ / జాడ తెలిసిన పోయి రావ ’ అని తన బాధను మేఘాలతో మొరపెట్టుకుంది. బావ రాలేదు. బంగారు పల్లకీ వచ్చింది! రాణీవాసం రమ్మంది. భానుమతికి తల తిరిగిపోయింది. భానుమతి తల్లి గాల్లో తేలిపోయింది. భానుమతి తండ్రి విచారంలో మునిగిపోయాడు. తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా, బావకు ఒక్కమాటైనా చెప్పే అవకాశం లేకుండా... పెద్దల ప్రోద్బలంతో రాణివాసానికి వెళ్లిపోయింది భానుమతి. డబ్బు సంపాదించుకొచ్చాడు ఎన్టీఆర్. మరదలు కనిపించలేదు! ‘‘మల్లమ్మని మర్చిపో తండ్రీ’’అని తల్లి నిట్టూర్చింది. విషయం చెప్పింది. మరదలు రాణివాసం వెళ్లిపోయిందని తెలిసి పిచ్చివాడయ్యాడు ఎన్టీఆర్. మళ్లీ ఊరొదిలి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో భానుమతిదీ ఇదే పరిస్థితి. అంతఃపురం వదిలి బయటికి రాలేదు. బావనే తలచుకుంటూ బంగారు పంజరంలో కృశించిపోతోంది. ఓరోజు - రాయలవారి ఆస్థాన శిల్పులు, రాళ్ల కోసం ఓ గుహలోకి వచ్చి, అక్కడ పిచ్చివాడిలా ఉన్న ఎన్టీఆర్‌నీ, అతడు చెక్కిన శిల్పాలను చూసి ఆశ్చర్యపోయారు. రాచనగరులో నిర్మిస్తున్న నర్తనశాలకు అవసరం అని చెప్పి, ఒప్పించి మరీ తీసుకెళ్లారు. అలా నర్తనశాల పనిలో పడ్డాడు ఎన్టీఆర్. కానీ బాధ నుండి బయటపడలేదు. ఒకనాడు అంతఃపుర స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడ్డానికి వచ్చారు. వారితో పాటు భానుమతీ వచ్చింది. ఆ శిల్పం ఈ శిల్పం చూస్తూ, అక్కడి శిల్పిగా పనిచేస్తున్న బావను చూసి ఆశ్చర్యపోయింది. అతడిని రహస్యంగా కలుసుకుని ‘బావా... బావా’ అని పరవశించిపోయింది. మరదల్ని చూడగానే ఎన్టీఆర్ కళ్లలోకి ఆనందం, అతడి కళకు ఒక పరిపూర్ణత వచ్చాయి. రెండోసారీ కలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతీ రాజభటులకు దొరికి పోయింది. తర్వాతేమిటి? ఇంకేముంటుంది ఉరి! అపరాధానికి శిక్ష ఉరి. కానీ ఎవరు అపరాధి? బావా? మరదలా? లేక ఇద్దరూనా? ఆనాడు తను వేళాకోళంగా అన్న మాట వల్లనే తన మరదలికి రాణివాసం సంప్రాప్తించిందని రాయలవారి మాటల్లో గ్రహించాడు ఎన్టీఆర్. ‘‘అపరాధమంతా నాదే ప్రభూ... నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి’’ అని వేడుకున్నాడు. ‘‘ప్రభూ అపరాధమంతా నాదే’’ అంటూ ఏకధాటిగా రోదించింది భానుమతి. ‘‘కాదు, అపరాధమంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం’’ అన్నాడు రాయలవారు. ‘‘కాదు ప్రభూ. అపరాధమంతా నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరి తీయించి, నా బావను రక్షించండి’’ అంది భానుమతి తప్పును తన మీద వేసుకుని. ‘‘సార్వభౌముల వారికి గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మసూక్ష్మం ఎలా విడదీస్తారో’’ అన్నాడు పండితుడు. రాయలవారు చిరునవ్వుతో చూశారు. ‘‘ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించిన నాగరాజునీ ఇద్దర్నీ క్షమించేస్తున్నాం అని తీర్పు ఇచ్చారు కరుణాసముద్రుడైన శ్రీకృష్ణ దేవరాయలు. అందరి ముఖాలూ వికసించాయి. బావా మరదళ్ల గురించి చెప్పాలా? కథ... సుఖాంతం. హిట్ సాంగ్స్ - కోతీబావకు పెళ్లంట కోవెల తోట విడిదంట - పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి - పిలిచిన బిగువటరా ఔరౌర - ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు - ఔనా నిజమేనా మమతలన్ని కలలేనా? - మనసున మల్లెల మాలలూగెనె వివరాలు-విశేషాలు - వాహినీ స్టూడియోస్ బ్యానర్ 1951 డిసెంబర్ 20న విడుదలైంది. దర్శకత్వం, నిర్మాణం బి.ఎన్.రెడ్డి. - కథాకాలం 13వ శతాబ్దం. పాటలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం : సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు. నేపథ్యగానం : ఘంటసాల, భానుమతి, మాధవపెద్ది సత్యం, శకుంతల. సంభాషణలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు. - మల్లీశ్వరి తీయాలని బి.ఎన్.రెడ్డి 1939లో అనుకుంటే, పదేళ్లకు గానీ ఆయన ఆలోచన రూపుదాల్చలేదు! - మొదట మల్లీశ్వరి పాత్రకు ఒక కొత్త అమ్మాయిని అనుకున్నారు. కానీ మల్లీశ్వరి వంటి విలక్షణమైన పాత్రకు అనుభవం ఉన్న వారైతే బాగుంటుందని భానుమతిని తీసుకున్నారు. - కళా దర్శకుడు ఎ.కె.శేఖర్ పెన్సిల్ స్కెచ్ వేస్తే వాటిని చూసి సెట్స్ తయారు చేశారు. అలా మల్లీశ్వరికి కావలసిన సెట్లన్నిటికీ ఆయన స్కెచ్‌లు గీసిచ్చారు. -
సీమాంధ్రులకు గుణపాఠం చెప్పాలి
రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఎవరెన్ని అపోహలు సృష్టించినాపట్టభద్రులు నమ్మాల్సిన పనిలేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్‌రావును గెలిపించి సీమాంధ్రులకు గుణపాఠం నేర్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం వనపర్తిలోని భగీరథ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌రావును గెలిపించి తెలంగాణ ప్రజల సంఘటితాన్ని మరోసారి చాటాలన్నారు. సాంకేతిక కారణాల వల్లే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని.. అతి త్వరలో అన్ని ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను పూరిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వారికంటే అడగని వారికే మరింతసాయం చేసే తత్వం గల వ్యక్తన్నారు.నేటికీ తెలంగాణకు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ మద్దతులో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని.. ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే తెలంగాణ ప్రాంతంపై టీడీపీ చేస్తున్న అన్యాయాలను అంగీకరించినట్లే అవుతుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై అనుమానాలు, అపోహాలు పెట్టుకోకుండా పట్టభద్రులు టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పాలన దేశంలోనే ఆదర్శంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు చెన్నరాములు, మహిపాల్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీనివాసరావు, యోసేప్, రామకృష్ణారెడ్డి, బుచ్చన్న, సతీష్‌కుమార్, గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య,పురుషోత్తమరెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, వాకిటి శ్రీధర్, యోగారెడ్డి, మహేష్, బీచుపల్లి యాదవ్ తదితరులు హాజరయ్యారు. -
ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం: హరీష్‌రావు
తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ సోమవారం విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు. ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.