రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఎవరెన్ని అపోహలు సృష్టించినాపట్టభద్రులు నమ్మాల్సిన పనిలేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్‌రావును గెలిపించి సీమాంధ్రులకు గుణపాఠం నేర్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం వనపర్తిలోని భగీరథ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత అయిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌రావును గెలిపించి తెలంగాణ ప్రజల సంఘటితాన్ని మరోసారి చాటాలన్నారు.
సాంకేతిక కారణాల వల్లే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని.. అతి త్వరలో అన్ని ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను పూరిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వారికంటే అడగని వారికే మరింతసాయం చేసే తత్వం గల వ్యక్తన్నారు.నేటికీ తెలంగాణకు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ మద్దతులో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని.. ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే తెలంగాణ ప్రాంతంపై టీడీపీ చేస్తున్న అన్యాయాలను అంగీకరించినట్లే అవుతుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై అనుమానాలు, అపోహాలు పెట్టుకోకుండా పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ పాలన దేశంలోనే ఆదర్శంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు చెన్నరాములు, మహిపాల్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీనివాసరావు, యోసేప్, రామకృష్ణారెడ్డి, బుచ్చన్న, సతీష్‌కుమార్, గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య,పురుషోత్తమరెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, వాకిటి శ్రీధర్, యోగారెడ్డి, మహేష్, బీచుపల్లి యాదవ్ తదితరులు హాజరయ్యారు.
సీమాంధ్రులకు గుణపాఠం చెప్పాలి
Published Sat, Mar 21 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM
Advertisement
Advertisement