singireddy niranjanreddy
-
న్యూజిలాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా ముగిసింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్, ప్రొ. జయశంకర్‌లతో కలిసి పోరాడిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్టు టీఏఎన్జెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాజీ తెలిపారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో నివాసముంటున్న తెలంగాణవారిని అవసరాల్లో ఆదుకోవడం, ఎల్లప్పుడు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేయడం తమ ముఖ్య ఉద్దేశమని టీఏఎన్జెడ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రావు తెలిపారు. తెలంగాణ అసోషియేసన్ ఆఫ్ న్యూజిలాండ్ కమిటీ, ఆక్లాండ్‌లోని తెలంగాణ ప్రాంతం వారు నిరంజన్ రెడ్డిని సన్మానించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో నివసిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం తెలంగాణపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు, ఎన్ఆర్ఐల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ రాచకొండ రామారావు, టీఏఎన్జెడ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు, టీఏఎన్జెడ్ సభ్యులు మురళీధర్ రంగు, పానుగంటి శ్రీనివాస్, వెంకట నర్సింహరావు పుప్పాల, నరేందర్ రెడ్డి, జగన్ రెడ్డి, వినోద్ కుమార్ ఎర్రబెల్లి, ప్రసన్న కుమార్ మేకల, శ్రీహరి, శంకరమ్మ, సుశాంతి, అరుణ్ ప్రకాశ్, డాక్టర్ కవిత, డాక్టర్ ఫసియుద్దిన్ అహ్మద్, జయలు పాల్గొన్నారు. తెలంగాణ భగత్‌సింగ్ స్వర్గీయ అణభేరి ప్రభాకర్ రావు కుమార్తె విప్లవ కుమారితో పాటూ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న అణభేరి సరళా ప్రభాకర్‌రావు సేవాసమితి నుంచి వెంకట్ నర్సింహరావు, పుప్పాల, రమాదేశి సల్వాజి, రామారావు రాచకొండ, ఉమా సల్వాజీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ రెడ్డి వడ్నాల ఆయన సతీమణి సునీతా రెడ్డిలు నిరంజన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. -
14 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తిరూరల్ : రానున్న నాలుగేళ్లలో పాలమూరు జిల్లాలోని 14లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం రాజపేటలో ఆయన మహిళలకు వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గ్రామాల్లోని చెరువులను మరమ్మతు చే సేందుకు ప్రభుత్వం పూనుకుందన్నా రు. వచ్చే ఖరీఫ్ నాటికి ప్రస్తుతం టెండర్లు పూర్తయిన చెరువులకు మరమ్మతులు చేసి 3లక్షల ఎకరాలకు నీరందిం చేందుకు మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రభత్వం ఆదేశాలు జారీ చేసిం దన్నారు. అలాగే మరో సంవత్సర కా లంలో మరిన్ని చెరువులను మరమ్మతు చేసి మరో 4లక్షల ఎకరాలకు నీరిచ్చే వి ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. నాలుగో సంవత్సరంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు నీరందిస్తామని, 2019 ఎన్నికల నాటికి పాలమూరు జిల్లాలో 14లక్షల ఎకరాలకు సాగునీరందించి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బి. లక్ష్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ లోకారెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్, మండల టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, మాణిక్యం, కురుమూర్తి, బీచుపల్లి యాదవ్, తిలక్ పాల్గొన్నారు. -
సీమాంధ్రులకు గుణపాఠం చెప్పాలి
రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఎవరెన్ని అపోహలు సృష్టించినాపట్టభద్రులు నమ్మాల్సిన పనిలేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్‌రావును గెలిపించి సీమాంధ్రులకు గుణపాఠం నేర్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం వనపర్తిలోని భగీరథ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌రావును గెలిపించి తెలంగాణ ప్రజల సంఘటితాన్ని మరోసారి చాటాలన్నారు. సాంకేతిక కారణాల వల్లే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని.. అతి త్వరలో అన్ని ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను పూరిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వారికంటే అడగని వారికే మరింతసాయం చేసే తత్వం గల వ్యక్తన్నారు.నేటికీ తెలంగాణకు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ మద్దతులో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని.. ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే తెలంగాణ ప్రాంతంపై టీడీపీ చేస్తున్న అన్యాయాలను అంగీకరించినట్లే అవుతుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై అనుమానాలు, అపోహాలు పెట్టుకోకుండా పట్టభద్రులు టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పాలన దేశంలోనే ఆదర్శంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు చెన్నరాములు, మహిపాల్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీనివాసరావు, యోసేప్, రామకృష్ణారెడ్డి, బుచ్చన్న, సతీష్‌కుమార్, గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య,పురుషోత్తమరెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, వాకిటి శ్రీధర్, యోగారెడ్డి, మహేష్, బీచుపల్లి యాదవ్ తదితరులు హాజరయ్యారు.