
న్యూజిలాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టీఏఎన్‌జెడ్) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా ముగిసింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్, ప్రొ. జయశంకర్‌లతో కలిసి పోరాడిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్టు టీఏఎన్‌జెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాజీ తెలిపారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
న్యూజిలాండ్‌లో నివాసముంటున్న తెలంగాణవారిని అవసరాల్లో ఆదుకోవడం, ఎల్లప్పుడు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేయడం తమ ముఖ్య ఉద్దేశమని టీఏఎన్‌జెడ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రావు తెలిపారు. తెలంగాణ అసోషియేసన్ ఆఫ్ న్యూజిలాండ్ కమిటీ, ఆక్లాండ్‌లోని తెలంగాణ ప్రాంతం వారు నిరంజన్ రెడ్డిని సన్మానించారు.
నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో నివసిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం తెలంగాణపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు, ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ రాచకొండ రామారావు, టీఏఎన్‌జెడ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు, టీఏఎన్‌జెడ్ సభ్యులు మురళీధర్ రంగు, పానుగంటి శ్రీనివాస్, వెంకట నర్సింహరావు పుప్పాల, నరేందర్ రెడ్డి, జగన్ రెడ్డి, వినోద్ కుమార్ ఎర్రబెల్లి, ప్రసన్న కుమార్ మేకల, శ్రీహరి, శంకరమ్మ, సుశాంతి, అరుణ్ ప్రకాశ్, డాక్టర్ కవిత, డాక్టర్ ఫసియుద్దిన్ అహ్మద్, జయలు పాల్గొన్నారు.
తెలంగాణ భగత్‌సింగ్ స్వర్గీయ అణభేరి ప్రభాకర్ రావు కుమార్తె విప్లవ కుమారితో పాటూ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న అణభేరి సరళా ప్రభాకర్‌రావు సేవాసమితి నుంచి వెంకట్ నర్సింహరావు, పుప్పాల, రమాదేశి సల్వాజి, రామారావు రాచకొండ, ఉమా సల్వాజీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జగన్ రెడ్డి వడ్నాల ఆయన సతీమణి సునీతా రెడ్డిలు నిరంజన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.