తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ సోమవారం విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు.
ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.