Vidyut Soudha
-
చలో విద్యుత్ సౌద మహాధర్నాకు అనుమతి లేదు: సీపీ కాంతి రానా
-
విద్యుత్‌సౌధ అష్టదిగ్బంధనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌సౌధను ఉద్యోగులు అష్టదిగ్బంధనం చేశారు. వేతన సవరణ, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో విద్యుత్‌సౌధ కార్యక్రమానికి 24 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్(టీఎస్పీఈ జేఏసీ) కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టీజన్ కార్మి కులు ఉదయం పదిగంటలకే పెద్దసంఖ్యలో సోమాజిగూడలోని విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో తరలిరావడంతో విద్యుత్‌సౌధ ప్రాంగణమంతా నిండిపోయింది. మిగిలినవాళ్లంతా ప్రధాన కార్యాలయం ముందున్న రహదారిపైనే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు పంజగుట్ట వరకు రోడ్డంతా విద్యుత్ కార్మి కులతో నిండిపోయింది. ట్రాఫిక్ మళ్లింపు.. ఎక్కడి వాహనాలు అక్కడే.. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో లక్డీకాపూల్, పంజగుట్ట, ఎన్టీఆర్ మార్గ్, సోమాజిగూడ, ఎర్రమంజిల్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రోడ్డుమార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. అసెంబ్లీ మీదుగా వచ్చి న వాహనాలను రాజ్‌భవన్ మీదుగా బేగంపేట వైపు మళ్లించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడం, సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన జేఏసీ నేతలు ధర్నా విజయవంతమైందని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు. ధర్నా కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొండివైఖరిపై మండిపడిన జేఏసీ ఉద్యోగుల వేతనాలను వెంటనే సవరించాలని, 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ నుంచి జీïపీఎస్ సదుపాయాన్ని కల్పించాలని, ఆర్టీజన్ కార్మి కుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, చైర్మన్ సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నావేదికపై నుంచి వీరు కార్మి కులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి కనీసస్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్యారంటీని జీపీఎఫ్ ఉద్యోగులకు రూ.16 లక్షలు, ఈపీఎఫ్ ఉద్యోగులకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
‘విద్యుత్’ పనులన్నీ ఆన్లైన్
సాక్షి, అమరావతి: పవర్ సెక్టార్లో ఆన్లైన్ జోరు పెరిగింది. సమీక్షలు, సంప్రదింపులు, సమావేశాలు, విద్యుత్ కొనుగోళ్లు అన్నీ హైటెక్ పద్ధతుల్లోనే నడుస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను విద్యుత్ సౌధలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆరునెలల నుంచి ఆన్లైన్ ద్వారానే ప్రజాభిప్రాయాలు సేకరిస్తోంది. డిస్కమ్‌లు వచ్చే ఏడాదికి వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్‌ఆర్‌లు) సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి విద్యుత్ సౌధకు, ఏపీఈఆర్సీకి వచ్చే సందర్శకుల సంఖ్య 75 శాతం తగ్గింది. ► విద్యుత్ సంస్థల్లో రోజూ ఉదయం విద్యుత్ సమీక్ష జరుగుతుంది. విద్యుత్ లభ్యత, డిమాండ్, థర్మల్ యూనిట్లలో బొగ్గు నిల్వలు, బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు ఇలా ముఖ్యమైన అంశాలను ఇంధనశాఖ కార్యదర్శి సమీక్షిస్తారు. గతంలో అందుబాటులో ఉన్న అధికారులంతా ఆయన ఆఫీసుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌ల్లోనే సమీక్షిస్తున్నారు. ► ఎస్ఎల్డీసీ ఇచ్చే విద్యుత్ నివేదిక ఆధారంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ఆర్డర్లు కూడా ఈ–ఆఫీసు ద్వారానే సాగుతున్నాయి. ► విజిటర్స్‌ను కలిసే వెసులుబాటు చాలావరకు తగ్గించారు. అనుమతి తీసుకున్న విజిటర్స్‌ను కూడా ఫోన్లోనే సంప్రదిస్తున్నారు. లేదా ఆన్లైన్ ద్వారా సంప్రదిస్తే అవసరమైన సమాచారం ఇస్తున్నారు. ► కోల్ ఇండియా, కేంద్ర ఇంధనశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులకు జూమ్ యాప్, గూగుల్ మీట్ ఉపయోగిస్తున్నారు. ► కాంట్రాక్టు సంస్థలు, బొగ్గు రవాణా సంస్థలతో సమావేశాలకు జూమ్ యాప్, అంతర్గత సమావేశాలకు మైక్రోసాఫ్ట్ టీం యాప్ ఉపయోగిస్తున్నారు. ► ఇంటర్నెట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ (టీఎల్ఎస్) ఎన్క్రిప్షన్ భద్రత ఉండటం వల్ల ఈ యాప్‌లన్నీ సురక్షితమైనవేనని అధికారులు తెలిపారు. అవసరమైన మేర మాత్రమే వ్యక్తులు గ్రూప్‌లోకి వచ్చే వీలుంటుందని, పాస్వర్డ్, యూజర్ ఐడీ అన్నీ అడ్మిన్ వద్దే ఉంటాయని సాంకేతిక నిపుణులు తెలిపారు. ► గోప్యత పాటించాల్సిన కొన్ని కీలకమైన సమావేశాల్లో అత్యంత భద్రత చర్యలు తీసుకున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. -
విద్యుత్ సౌధ ముట్టడిపై పోలీసుల ఉక్కుపాదం
-
సమ్మె సాగుతుంది
సాక్షి, హైదరాబాద్: ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్రావు, కన్వీనర్ గంబో నాగరాజు నేతృత్వంలో ముట్టడికి ప్రయత్నించగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈశ్వర్రావు, నాగరాజు మాట్లాడుతూ.. తాము కొత్తగా ఏమీ డిమాండ్ చేయడం లేదని, సీఎం హామీ మేరకే కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నామని చెప్పారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం నిరసన తెలిపేందుకు వస్తే అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సమ్మె ఆగదని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కమిటీల అభిప్రాయాలు తీసుకుని మధ్యాహ్నానికి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు 16 రకాల డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కొలిక్కి రాని చర్చలు సమ్మె విరమణ కోసం మంగళవారం సాయంత్రం విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, సాయిలుతో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చర్చలు జరిపారు. దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిగినా వివాదం కొలిక్కిరాలేదు. సమాన పనికి సమాన వేతనం, విద్యుత్ సంస్థల్లో విలీనం వేగవంతం, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆన్మాన్ గ్యాంగ్‌గా పని చేస్తున్న 1,600 మందిని ఆర్టిజన్లగా గుర్తించాలని యూనియన్ ప్రతినిధులు అధికారులను కోరారు. వివాదం న్యాయస్థానంలో ఉన్నందున పరిష్కరించలేమని అధికారులు వెల్లడించారు. విలీనం కేసులో కౌంటర్ దాఖలు చేయాలని, ఈ లోగా పే–స్కేలు వర్తింపచేయాలని కార్మిక నేతలు కోరగా.. కౌంటర్ పిటీషన్ దాఖలు చేస్తామని, పే–స్కేలు వర్తింపజేయలేమని స్పష్టం చేశారు. ఆర్టిజన్ల తొలగింపునకు చర్యలు సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులను యాజమా న్యాలు ఆదేశించాయి. నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు షోకాజ్ నోటీసులిచ్చి ఆ తర్వాత నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించాయి. కాగా, కార్మికులను భయపెట్టి సమ్మె విరమింపజేయాలని యాజమాన్యాలు ఈ చర్యలకు దిగాయని కార్మిక నేతలు ఆరోపించారు. -
ఏపీ వాటా తెలంగాణ పరం
సాక్షి, అమరావతి : హైదరాబాద్ విద్యుత్ సౌధాలో వాటాను వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆస్తులు, అప్పులపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకుండానే ఆస్తులన్నీ అప్పగించాలనే నిర్ణయం విద్యుత్ సిబ్బందికి విస్మయం కలిగిస్తోంది. తెలంగాణకు భయపడి విలువైన ఆస్తులు వదులుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు అంతస్తుల్లో విద్యుత్ సౌధా నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సి ఉంది. భౌగోళికంగా తెలంగాణలో ఉండటం వల్ల ఇది ఆ రాష్ట్రానికే చెందే వీలుంది. అయితే, ఏపీ వాటా కింద తెలంగాణ కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల విలువ కట్టకపోవడం వల్ల ఎంతమొత్తం ఇవ్వాలనేది ఇంకా నిర్థారణ కాలేదు. ప్రస్తుతం విద్యుత్ సౌధాలో రెండు రాష్ట్రాల జెన్కో, ట్రాన్స్‌కో కార్యాలయాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పదేళ్ళ పాటు ఏపీ ఇక్కడ తమ ఆఫీసులను నిర్వహించుకునే హక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే నెలాఖరుకు అన్ని శాఖలను గుణదలకు తీసుకెళ్ళేందుకు ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఖాళీ చేసినప్పటికీ ఆస్తుల పంపకం జరిగే వరకూ ఏపీ ఆఫీసులకు తాళాలు వేసి, తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఏపీ విద్యుత్ సంస్థలు భావించాయి. దీనిపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. తాళాలు వేసుకుని పోతే ఆ గదుల్లో ఎలుకలు చనిపోతాయని, దీంతో పక్కన ఉన్న తమ గదుల్లోనూ భరించలేని వాసన వస్తుందని ఏపీకి తెలిపారు. తాళాలు వేసుకుని వెళ్ళే పరిస్థితే వస్తే ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళనీయమని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరిపారు. మొత్తం బిల్డింగ్ తమకు ఇవ్వాలని, ఆస్తుల పంపకం తేలే వరకూ నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లిస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇప్పటికే తెలంగాణ రూ.4,800 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించలేదని, అద్దె మాత్రం చెల్లిస్తుందా? అని ఏపీ విద్యుత్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. అయినా ఆరు అంతస్తుల భవనాన్ని కేవలం రూ.2 లక్షల అద్దెకే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఒక్కో ఫ్లోర్ కనీసం రూ.25 లక్షల అద్దె పలుకుతుందని, ఆరు అంతస్తులకు దాదాపు రూ.1.50 కోట్ల వరకూ అద్దె వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ సౌధలో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యాల చర్చలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘ నాయకులు,. యాజమాన్యాల మధ్య చర్చలకు జెన్కో ఎండీ విజయానంద్, ట్రాన్స్ కో సీఎండీ సురేష్ చందా హాజరయ్యారు. విద్యుత్ సమ్మె సోమవారం కూడా కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. -
తెలంగాణకే విద్యుత్ సౌధ!
ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలకు కొత్త భవనం గచ్చిబౌలిలో ఏర్పాటుకు ప్రయత్నం ఆంధ్ర ఉద్యోగుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సౌధను మొత్తాన్ని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కోల కోసం కొత్త భవనం అద్దెకు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందుకోసం గచ్చిబౌలి ప్రాంతంలో లక్షా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కాంప్లెక్స్ కోసం ట్రాన్స్‌కో వర్గాలు వెదుకుతున్నాయి. ఇందుకోసం త్వరలో పేపర్ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. కాగా, దీనిపై సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌నే రెండు రాష్ట్రాలకు కేటాయించాలని కోరుతున్నారు. మొత్తం బిల్డింగ్‌ను తెలంగాణకే కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న విద్యుత్‌సౌధ బిల్డింగ్‌లోని ఆరు అంతస్తుల్లో, రెండు రాష్ట్రాలకు మూడు అంతస్తుల చొప్పున కేటాయించాలని వారు కోరుతున్నారు. దీనిపై అవసరమైతే గవర్నరును కలిసి విన్నవించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. తెలిసిన బిల్డర్ కోసమేనా? ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కోల కోసం గచ్చిబౌలి ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒక బిల్డర్‌కు చెందిన కాంప్లెక్స్ ఉందని, సదరు బిల్డర్‌కే టెండర్ దక్కేలా చేసేందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనవాయితీగా లక్షా 50 వేల చదరపు అడుగుల కాంప్లెక్స్ గచ్చిబౌలి ప్రాంతంలో కావాలని పత్రికలో నోటిఫికేషన్ ఇచ్చి... సదరు బిల్డర్‌కు టెండర్ దక్కిందనేలా తంతు నడిపించేందుకు ట్రాన్స్‌కో వర్గాలు పావులు కదుపుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. -
విద్యుత్ సౌధలో ఏపీ జెన్కో ధర్నా ఉద్రిక్తం
హైదరాబాద్: తమ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయాలని కోరుతూ ఏపీ జెన్కో కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ధర్నా సోమవారం ఉద్రిక్తంగా మారింది. విద్యుత్ సౌధను ముట్టడించేందుకు కార్మికులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగులను కార్యాలయం లోనికి వెళ్లకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ధర్నా చేస్తున్న ఉద్యోగుల్ని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమను రెగ్యూలరైజ్ చేయాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. -
దద్దరిల్లిన విద్యుత్ సౌధ
-
విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ శాఖ ఇంజినీర్ల ధర్నా
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఇంజినీర్ల నినాదాలతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర విభజన ముంచుకొస్తున్న తరుణంలో సమస్యలు పరిష్కరించకపోతే విద్యుత్ సరఫరాను స్తంభింపచేస్తామని ఇంజినీర్లు యాజమాన్యాన్ని హెచ్చరించారు. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు ఇంజినీర్ల డిమాండ్లన్నింటినీ నెలరోజుల్లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సౌధలో బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఎపి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలలో పనిచేస్తున్న ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చీకటి సమ్మెట
-
చీకటి సమ్మెట
* పలు ప్లాంట్లలో భారీగా తగ్గనున్న విద్యుదుత్పత్తి * పులి మీద పుట్రలా సాంకేతిక సమస్యలు * ఇప్పటికే అంధకారంలోకి చాలా గ్రామాలు * నేటి నుంచి సమస్య మరింత తీవ్రతరం * కనీసం 3,000 మెగావాట్ల ఉత్పత్తికి కోత! * గృహావసరాలకు, పరిశ్రమలకు కరెంటు కట్! * అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు * రేపు అర్ధరాత్రి దాకా కొనసాగనున్న సమ్మె సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో నేటి నుంచి రాష్ట్రంలో చీకట్లు కమ్ముకోనున్నాయి. 11వ తేదీ అర్ధరాత్రి నుంచి వారు ప్రారంభించిన 72 గంటల సమ్మె కారణంగా ఇటు విద్యుదుత్పత్తి, అటు సరఫరా రెండూ ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కరెంటు సరఫరాపై గురువారం పెద్దగా ప్రభావం పడకపోయినా శుక్రవారం నుంచి మాత్రం అది దారుణంగా ఉండనుంది. సమ్మెతో సీమాంధ్ర ప్రాంతంలోని పలు విద్యుత్ ప్లాంట్లల్లో గురువారం రాత్రి నుంచే విద్యుదుత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. సమ్మెకు తోడు ప్లాంట్లలో సాంకేతిక, ఇతరత్రా సమస్యలు పులి మీద పుట్రలా పరిణమించాయి. ఎన్టీటీపీఎస్లో బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడగా శ్రీశైలం కుడిగట్టు ప్రాజెక్టులో మరమ్మతులు చేసేందుకు కార్మికులు కూడా ససేమిరా అంటున్నారు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన ఆర్టీపీపీలో అసలు పనులే నడవడం లేదు. దాంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం భారీగా పెరిగే పరిస్థితి కన్పిస్తోంది. కనీసం 3,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కోత పడవచ్చని అంచనా. సమ్మె 14వ తేదీ అర్ధరాత్రి దాకా కొనసాగనున్నందున సమస్య వెంటనే పరిష్కారమయ్యే పరిస్థితి కూడా లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కోతలు తప్పని పరిస్థితి ఏర్పడింది. రైల్వేలు, ఆస్పత్రులు, తాగునీరు, సాగునీటికి విద్యుత్ సరఫరాలో ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున గృహావసరాలకు, పరిశ్రమలకు కొద్ది రోజుల పాటు భారీ కోతలు తప్పేలా లేవు. పలు జిల్లాలు ఇప్పటికే కరెంటు కోతల బారిన పడి అల్లాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాల్లో 25 ఫీడర్ల పరిధిలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 14 ఫీడర్లలో లోపాలను సవరించినా మరో 11 ఫీడర్ల పరిధిలో సమస్య ఇంకా కొనసాగుతుండటంతో ఏకంగా 85 గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. పైగా శ్రీకాకుళం రిమ్స్‌తో పాటు పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి కూడా గురువారం మధ్యాహ్నం దాకా కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖలోనూ గురువారం జిల్లావ్యాప్తంగా కోతలు కొనసాగాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి! పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా సిబ్బంది సమ్మె కారణంగా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఉద్యోగులు తమ అధికారిక మొబైల్ నంబర్లను వెనక్కివ్వడంతో వినియోగదారులు తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బాయిలర్, టర్బైన్, ఈఎస్పీ వంటి ప్లాంట్ల ప్రధాన విభాగాల షిఫ్టులకు మాత్రమే హాజరవుతామని సమైక్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (సేవ్ జేఏసీ) ప్రకటించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినా మరమ్మతులకు కార్మికులు రావడం లేదు. దీనికి తోడు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో విద్యుత్ పంపిణీలోనూ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సౌధలోని సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమ్మెకు దిగడంతో రోజువారీ కార్యక్రమాలు కూడా జరగని పరిస్థితి ఏర్పడింది. రిజర్వాయర్లలో నీరుండటం వల్ల జల విద్యుదుత్పత్తి సాయంతో గురువారం ఇబ్బంది లేకుండా సరఫరా సాధ్యపడిందని అధికారులంటున్నారు. మరోవైపు విద్యుత్ బిల్లులు చెల్లించొద్దన్న పిలుపుతో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీ ప్లాంట్ల తిప్పలు! శ్రీశైలం కుడిగట్టు ఉత్పత్తి కేంద్రం కర్నూలు జిల్లాలోని 770 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఈ ప్లాంటులో ఆయిల్ సరఫరా సమస్యతో ఇప్పటికే రెండు యూనిట్లలో ఉత్పత్తి ఆగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్మికులెవరూ ముందుకు రావడం లేదు. దాంతో 5 యూనిట్లలో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. పోలీసుల సాయంతో ఎడమ గట్టు నుంచి ఉద్యోగులను తీసుకెళ్లేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించిందన్న వార్తలపై సీమాంధ్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు ఉత్పత్తి కేంద్రం 900 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ ప్లాంటు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్నా ఇందులో సీమాంధ్ర ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు భారీగా ఉండటంతో పోలీసుల సాయంతో విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఆర్టీపీపీ పని అంతే! భారీ వర్షాలతో నీట మునిగిన వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)లో కోల్ హ్యాండ్లింగ్ మొత్తం నీట మునిగింది. పంప్‌హౌస్‌లో కూడా నీరు చేరింది. నీటిని తోడేందుకు కూడా కార్మికులెవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కాంట్రాక్టు కంపెనీ కార్మికులు ప్లాంటుకు చేరుకున్నప్పటికీ లోనికి వెళ్లి పనులు చేసేందుకు ఉద్యోగులు అంగీకరించడం లేదు. దాంతో 1,050 మెగావాట్ల సామర్థ్యమున్న ఆర్టీపీపీకి మరమ్మతులు చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు మరో 10 రోజులైనా పడుతుందని జెన్కో వర్గాలు తెలిపాయి. ఎన్టీటీపీఎస్లో ఫలించిన చర్చలు! విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లతో పాటు 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్ ఉన్నాయి. వీటిలో 1, 2, 3, 4 యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డా, యాజమాన్యంతో ఉద్యోగుల చర్చలు ఫలించి, కోల్ హ్యాండ్లింగ్‌కు వారు అంగీకరించారు. కాబట్టి అక్కడ పరిస్థితి కాస్త మెరుగు పడవచ్చని సమాచారం. అయితే బాయిలర్ ట్యూబులకు రంధ్రాల కారణంగా ఐదో యూనిట్లో మొత్తం 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఇప్పటికే నిలిచిపోయింది. మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ససేమిరా అంటున్నారు. -
విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత
ఇద్దరు సీమాంధ్ర అధికారుల అరెస్ట్.. బెయిల్ తెలంగాణ ఉద్యోగిపై దాడి చేశారంటూ డీఈలపై ఫిర్యాదు అరెస్ట్ చేసిన పోలీసులు.. సీమాంధ్ర ఉద్యోగుల నిరసన కోర్టులో హాజరుపరిచాక బెయిల్‌పై విడుదలైన డీఈలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సచివాలయం, విద్యుత్‌సౌధలు సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు శుక్రవారం కూడా పోటాపోటీగా నిరసనలు కొనసాగించారు. విద్యుత్‌సౌధలో ఇద్దరు సీమాంధ్ర అధికారులను అరెస్ట్ చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. జెన్కో డీఈలు సోమశేఖర్, ప్రభాకర్ తెలంగాణ ఉద్యోగిపై దాడి చేశారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేశారు. జెన్కో ఎండీ విజయానంద్‌తో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఎండీ అనుమతి లేకుండా కార్యాలయంలో ఉన్నప్పుడే అరెస్టు చేయటం ఏమిటని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. వారిద్దరి అరెస్ట్‌ను నిరసిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగటంతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరెస్ట్ చేసిన ఇరువురిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్‌పై విడుదలై తిరిగి విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. తాము నిరసన తెలిపే ప్రదేశానికి తెలంగాణ ఉద్యోగులు వచ్చి రెచ్చగొడుతున్నారని విద్యుత్‌సౌధ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ అనురాధ ఆరోపించారు. వారం కిందట ఇద్దరు వ్యక్తుల మధ్య ఘటన జరిగితే ఇరు ప్రాంతాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని తప్పుపట్టారు. సచివాలయంలో పోటాపోటీ నిరసనలు: సచివాలయంలో శుక్రవారం కూడా సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. సీమాంధ్ర ఉద్యోగులు వరుసగా 30వ రోజూ నిరసన ప్రదర్శన చేపట్టారు. వచ్చే నెల 2 నుంచి సమ్మె తథ్యమని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యోగులు కూడా ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని కోరారు. ఆర్ అండ్ బీ కార్యాలయంలో: ఎర్రమంజిల్ కాలనీలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు 30 మంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై తెలంగాణ నినాదాలతో నిరసన తెలిపారు. పంచాయితీరాజ్ కార్యాలయంలో పంచాయితీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. -
వివాదం రాజేసిన డీఈల అరెస్టు
హైదరాబాద్:తమపై దాడి చేశారంటూ తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు డీఈలను అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం వివాదానికి కారణమైంది. విద్యుత్ సౌధలో డీఈలుగా పనిచేస్తున్న సోమశేఖర్, ప్రభాకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీ. ఉద్యోగులు ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేయడం సబబు కాదని సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు. విద్యుత్ సౌధలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో పోలీసులను భారీగా మోహరించారు. గతంలో తమపై దాడికి పాల్పడారంటూ టీ.ఉద్యోగులు ఫిర్యాదు మేరకు డీఈలను అరెస్టు చేశారు. -
ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం: హరీష్‌రావు
తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ సోమవారం విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు. ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు భావోద్వేగాలతో కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసౌధ దగ్గర సైతం ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
విద్యుత్ సౌధ వద్ద టెన్సన్.. టెన్సన్
-
విద్యుత్‌సౌధలో వద్ద మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్ : విద్యుత్ సౌథ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం పోటా పోటీగా సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒకరి నిరసనను మరొకరు అడ్డుకునే యత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ ఉద్యోగుల నిరసన సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొనగా, సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ వచ్చారు. ఈ సమయంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా, పరకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సమైక్యవాదుల దీక్షలో పాల్గొన్న పరకాల ప్రభాకర్ విభజన కుట్రను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. -
విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత
-
విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత, ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ : ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈరోజు ఉదయం జేఎండీ పి.రమేష్‌కు సమ్మె నోటీసు అందచేశారు. అయితే ఆ నోటీసును ఆయన ఉద్యోగులపై విసిరి వేయటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళితే జేఎండీ తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు దిగారు. జేఎండీ రమేష్ తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తమ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.