తమ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయాలని కోరుతూ ఏపీ జెన్‌కో కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ధర్నా సోమవారం ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్: తమ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయాలని కోరుతూ ఏపీ జెన్‌కో కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ధర్నా సోమవారం ఉద్రిక్తంగా మారింది. విద్యుత్ సౌధను ముట్టడించేందుకు కార్మికులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగులను కార్యాలయం లోనికి వెళ్లకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ధర్నా చేస్తున్న ఉద్యోగుల్ని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమను రెగ్యూలరైజ్ చేయాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.