ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత | Tension atmosphere at government offices in hyderabad city | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

Aug 26 2013 3:13 PM | Updated on Aug 20 2018 9:16 PM

నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు భావోద్వేగాలతో కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

జలసౌధ దగ్గర సైతం ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, విద్యాసాగర్‌ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement