tension atmosphere
-
సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు!
బెంగళూరు: వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్ అహ్మెద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్కల్ జంక్షన్‌కు హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరును మారుస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బ్యానర్‌ను తొలగించారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టీ అభ్యర్థనతో సర్కిల్‌కు సావర్కర్ పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది నగర కార్పొరేషన్. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో సూరత్కల్ సర్కిల్ చాలా సున్నితమైన ప్రాంతమని, సావర్కర్ పేరు పెట్టటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్డీపీఐ స్థానిక కార్యకర్త ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: Vinayak Damodar Savarkar: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు -
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
-
నేడు గణతంత్రం.. ఢిల్లీలో రైతుల రణరంగం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిర్విరామంగా చేస్తున్న రైతుల పోరాటం గణతంత్ర దినోత్సవం రోజు తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల పరేడ్‌కు సుప్రీంకోర్టు సూచనతో పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే మంగళవారం పరేడ్ చేపట్టడానికి రైతులు వెళ్తుండగా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టేందుకు ఢిల్లీ సరిహద్దుకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రైతులను అడ్డగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. టిక్రీ సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో రైతులు వస్తుండడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రోడ్డుకు అడ్డుగా పెట్టిన కంటెయినర్లను రైతులు ట్రాక్టర్లతో నెట్టివేశారు. ఘాజీపూర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించారు. ఇక రైతుల ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు ఉండడంతో పరిస్థితి చేయి దాటి పోతుందనేలా ఉంది. సంజయ్‌గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ వద్ద ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులపై టియర్ గ్యాస్‌ను పోలీసులు ప్రయోగించారు. రైతులను నిలువరించేందుకు వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించి వారిని అడ్డగించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ క్యానన్ల వాహనాలపైకి ఎక్కి రైతులు నినాదాలు చేస్తున్నారు. రైతుల పోరాటం మంగళవారంతో 62 రోజులకు చేరింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్ వార్సి, మిలింద్ సోమన్, రణ్వీర్ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా. మీరూ ఆపండి’అని అర్షద్ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌ను వాడబోనంటూ యాక్టర్, మోడల్ మిలింద్ ఉషా సోమన్ ట్వీట్ చేశారు. నటుడు రణ్వీర్ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్ శాండిల్య కూడా ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ కోరారు. -
మా ప్రతీకారం భీకరం
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది. సులేమానీ అనే ఉగ్రవాదిని హతమార్చినందుకు ఇరాన్ అమెరికాపై దాడులు చేస్తామని బెదిరిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. కొన్ని గంటల తరువాత ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘వారు మాపై దాడి చేశారు. మేం ప్రతీకార దాడులు చేశాం. వారు మళ్లీ దాడి చేస్తే.. మా ప్రతీకారం మరింత తీవ్రంగా ఉంటుంది’ అని ట్రంప్ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. ‘మిలటరీ సంపత్తి కోసం ఇటీవలే 2 ట్రిలియన్(2 లక్షల కోట్ల) డాలర్లను ఖర్చు చేశాం. ప్రపంచంలోనే మాది అతిపెద్ద, అత్యంత సామర్థ్యమున్న ఆర్మీ. మా స్థావరాలపై కానీ, పౌరులపైకానీ దాడి చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతీకార దాడులుంటాయి’ అని స్పష్టం చేశారు. యూఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ఆదివారం ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు. ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు. కెన్యా బేస్‌పై దాడి కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ ఆదివారం దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి. ఇరాన్ విదేశాంగ మంత్రికి ఫోన్ యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు. సులేమానీకి అశ్రు నివాళి టెహ్రాన్: అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందిన తమ హీరో, జనరల్ ఖాసిం సులేమానీకి ఆదివారం ఇరాన్లో అభిమానులు భారీగా తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. నల్లని దుస్తులు ధరించి, కన్నీళ్లు పెట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ బాధను వ్యక్తపరిచారు. ‘అమెరికాకు ఇక చావే’ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాక్ నుంచి సులేమానీ మృతదేహం ఇరాన్‌లోని అహ్వాజ్ పట్టణానికి చేరింది. సులేమానీ, అతనితో పాటు మరణించిన వారి మృతదేహాలను టెహ్రాన్‌కు తరలించనున్నారు. -
అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్‌తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్క్యూ 4ఏ నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్టు అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించలేదు. అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన విషయాన్ని ధ్రువీకరిస్తూనే తాము నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్ భూభాగంలోకి చొరబడలేదని హార్మోజ్గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతోంది. వారం కిందటే అమెరికా డ్రోన్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిందని అమెరికా మిలటరీ ఆరోపించింది. ఇప్పుడు ఈ డ్రోన్‌ను కూల్చివేసి ఇరాన్ అగ్రరాజ్యానికి ఘాటైన హెచ్చరికలే చేసింది. ‘‘ఏ దేశమైనా మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి. ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అమెరికా మా గగనతలంలోకి ప్రవేశిస్తే ఎందుకు ఊరుకుంటాం. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాన్నే తీసుకొని డ్రోన్‌ని కూల్చివేశాం‘‘ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ జనరల్ హొస్సెని సలామి వెల్లడించారు. ఇరాన్‌కి ఎవరితోనూ యుద్ధం చేయాలన్న కోరిక లేదు కానీ, ఏ క్షణంలోనైనా యుద్ధం చెయ్యడానికి తామే సిద్ధమేనని సలామి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోడమే కాక ఇరాన్‌తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు వద్దంటూ అగ్రరాజ్యం ఇతర దేశాలపై ఒత్తిడి పెంచినప్పట్నుంచి ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. డ్రోన్‌ను కూల్చివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఒక డ్రోన్‌ను కూల్చివేసి దానిని అందరికీ ప్రదర్శించడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. మున్ముందు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. పెద్ద తప్పిదమే చేశారు: ట్రంప్ డ్రోన్‌ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ పెద్ద తప్పే చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం అన్నారు. శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి సారా శాండర్స్ మాట్లాడుతూ ఈ ఘటన గురించి బుధవారం రాత్రి, గురువారం ఉదయం ట్రంప్‌కు తాము వివరాలు వెల్లడించామని చెప్పారు. అనంతరం ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘ఇరాన్ చాలా పెద్ద తప్పే చేసింది’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కారణంగా ముడిచమురు ధరలు దాదాపు 6 శాతం వరకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బ్యారెల్ చమురు ధర 6.3 శాతం పెరిగి 57.13 డాలర్లకు చేరగా, లండన్‌లోని బ్రెంట్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ధర 64.69 డాలర్లకు చేరింది. -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
అఖిలేశ్‌కు చేదు అనుభవం
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను మంగళవారం పోలీసులు లక్నో విమానాశ్రయంలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంగతి తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు విమానాశ్రయం బయట, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా నిరసనకు దిగారు. అఖిలేశ్ అలహాబాద్ వర్సిటీకి వెళ్తే శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందనే లక్నో విమానాశ్రయంలో ఆపినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చారు. అఖిలేశ్ అలహాబాద్ రాకుండా అడ్డుకోవాలని వర్సిటీ యాజమాన్యమే కోరిందని, ఆ మేరకే పోలీసులు వ్యవహరించారని తెలిపారు. విమానాశ్రయంలో తనను అడ్డుకోవడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని అఖిలేశ్ ఆరోపించారు. యోగి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. మరోవైపు, అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజా ఘటనను ఖండించారు. తమ నాయకుడిని విమానాశ్రయంలో అడ్డుకున్నారన్న సంగతి తెలియగానే ఎస్పీ కార్యకర్తలు అలహాబాద్, ఝాన్సీ, కనౌజ్, బలరాంపూర్, జలాన్, అజాంగఢ్, గోరఖ్‌పూర్ తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. పలుచోట్ల వాహనాల అద్దాలు పగలగొట్టి, పోలీసులతో ఘర్షణలకు దిగారు. రాజ్యసభలోనూ: రఫేల్ ఒప్పందంపై విచారణకు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయా లన్న డిమాండ్‌పై లోక్‌సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయగా అఖిలేశ్‌ను అలహాబాద్ వెళ్లకుండా యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంపై రాజ్యసభలో ఆందోళనలు మిన్నంటాయి. -
అట్టుడుకుతున్న కన్నూర్
కన్నూర్/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి 2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బాంబు దాడులు సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. -
సన్నిధానంలో శ్రీలంక మహిళ
శబరిమల: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. దేవస్థానం బోర్డు సభ్యుడి ఇంటితో పాటు మరికొన్నిచోట్ల ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామిని శ్రీలంకకు చెందిన శశికళ(47) అనే మహిళ దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి శశికళ గుడిలోకి చేరుకుని పూజలు నిర్వహించినట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. భర్త శరవణ్, కుమారుడు దర్శన్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారని వెల్లడించింది. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారన్న వాదనల్ని శశికళ ఖండించారు. తాను స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆలయానికి రాకముందు తాను 41 రోజుల వ్రతం పాటించానని వెల్లడించారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘పోలీస్ అధికారులు నన్ను ఎందుకు అనుమతించలేదు? మీరంతా(మీడియా) నా చుట్టూ ఎందుకు నిలబడ్డారు? నేను ఎవరికీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కుమారుడితో కలిసి తాను మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని శశికళ భర్త శరవణ్ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా కారణాలతోనే శశికళ అలా చెప్పి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయ్యప్పస్వామి దర్శనానికి శుక్రవారం శబరిమల వచ్చిన కయాల్ అనే ట్రాన్స్‌జెండర్‌ను భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వెనక్కి పంపారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి నిరసనగా కొందరు దుండగులు శుక్రవారం తెల్లవారుజామున మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు కె.శశికుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి పరారయ్యారు. అలాగే పతనంతిట్ట ప్రాంతంలోని ఓ మొబైల్ షాపుపై పెట్రోల్‌బాంబు దాడి జరిగింది. 200 మంది అరెస్ట్! సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా చెలరేగుతున్న కన్నూర్‌లో 200 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో 801 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 1,369 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పాలక్కడ్‌తో పాటు కసర్గోడ్ జిల్లా మంజేశ్వరమ్‌లో నిషేధాజ్ఞలు విధించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్
-
ఉంజుపల్లి అడవుల్లో ఉద్రిక్తత
చర్ల, న్యూస్‌లైన్: ఉంజుపల్లి అడవుల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రోడ్డుపనులను అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులను అడ్డుకోవడానికి వీల్లేదు అని పోలీసులు వారిని హెచ్చరించారు. పనులకు అడ్డుపడిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిని పోలీసులు బలవంతంగా లాగేశారు. మహిళా ఉద్యోగిణులు అనికూడా చూడకుండా నెట్టివేశారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న స్థానిక విలేకరులపై ఎస్సై చిందులుతొక్కారు. పోలీసులను ప్రతిఘటించి వచ్చిన అటవీశాఖ అధికారులు రోడ్డుపనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌తో పాటు ఆ పనులకు మెటల్ తోలుతున్న నాలుగులారీలను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎల్‌డబ్ల్యూఈఏ నిధులతో మండలకేంద్రంలోని శివాలయం ఆర్చ్ నుంచి పూసుగుప్ప వరకు రెండేళ్లక్రితం 18 కిలోమీటర్ల మేర రోడ్డుపనులు ప్రారంభమయ్యాయి. మావోయిస్టుల భయంతో కాంట్రాక్టర్ గతంలో పనులు నిర్వహించకుండా వెళ్లిపోయారు. ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ రంగనాథ్ కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు పునఃప్రారంభించారు. ఈ పనులను నిలిపివేయాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పనులు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అనుమతల విషయమై అటవీశాఖ అధికారులు పలుమార్లు కాంట్రాక్టర్‌ను, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. వారు దాటవేత సమాధానాలు చెబుతూ వస్తున్నారు. భద్రాచలం ఉత్తర మండల డీఎఫ్ఓ రాజశేఖర్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ఇంజినీర్ సుధాకర్‌రావుకు ఈ పనుల విషయమై రెండునెలల క్రితం షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. అయినా ఎటువంటి సమాధానం రాలేదు. దీనిపై డీఎఫ్ఓ స్థానిక అటవీశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా పనులు నిర్వహిస్తే సస్పెండ్ చేస్తానంటూ అటవీశాఖ సిబ్బందికి ఓ లేఖనూ ఇచ్చారు. నాలుగురోజులు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్తున్న అటవీశాఖ అధికారులను పోలీసులు తిప్పిపంపుతున్నారు. ఉంజుపల్లి సమీపంలోని అడవిలో పనులు జరుగుతున్నాయని తెలుసుకొని శనివారం అక్కడికి వెళ్లారు. మళ్లీ పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఎస్సై సంతోష్ తనపై చిందులు తొక్కారని డీఆర్వో కనకమ్మ ఆరోపించారు. ‘ప్రజలకు ఉపయోగకరమైన పనులకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు..రోడ్డుపనులను అడ్డుకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు పెట్టి మీరు వచ్చిన జీపులోనే మిమ్మల్ని తీసుకొని వెళ్తాం’ అని హెచ్చరించారని ఆమె విలేకరులకు తెలిపారు. పనులకు అడ్డుపడిన అటవీశాఖ సిబ్బందిని పోలీసులు బలవంతంగా లాగేశారన్నారు. మహిళా ఉద్యోగిణులు అని కూడా చూడకుండా నెట్టివేశారని కనకమ్మ వాపోయారు. రిజర్వ్‌ఫారెస్ట్‌లో గ్రావెల్ పోయడం ఆపేసిన పోలీసులు వెంటనే ఉంజుపల్లి గ్రామంలోని రోడ్డుకు గ్రావెల్ తోలకం ప్రారంభించారు. సాయంత్రం మెటల్ వేసుకొని నాలుగులారీలు లెనిన్‌కాలనీ, ఉంజుపల్లి మధ్యలోని రిజర్వ్‌ఫారెస్ట్‌లోని రోడ్డుమీదకు వచ్చాయి. కంకర దింపేందుకు డ్రైవర్లు ప్రయత్నించడంతో అటవీశాఖ అధికారులు అడ్డుపడ్డారు. అనుమతులు లేనందున ఇక్కడ దించొద్దని చెప్పారు. ఎస్సై సంతోష్ జోక్యం చేసుకొని అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఎస్పీగారి ఆదేశాల మేరకే రోడ్డు పనులు చేయిస్తున్నాం..అడ్డుతప్పుకోపోతే పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది’ అని హెచ్చరించారు. పోలీస్, అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ ఏఎస్సై, ఎఫ్బీఓ నాగేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపై ఎస్సై చిందులు తొక్కారు. ‘ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ సంగతి చూస్తాను’ అంటూ బెదిరింపు ధోరణికి దిగారు. విలేకరులు స్పందించకపోవడంతో ఎస్సై అక్కడి నుంచి వెళ్లి ఉంజుపల్లి గ్రామస్తులను వెంటవేసుకొని వచ్చారు. ‘మీ రోడ్డు పనులకు అడ్డుతగులుతున్నారని’ ప్రజలను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫారెస్ట్ సిబ్బందిని పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టి రిజర్వ్‌ఫారెస్ట్‌లో వేస్తున్న రోడ్‌పై మెటల్ అన్లోడ్ చేయించారు. చర్లలోనూ ఇలాగే అన్లోడ్ చేస్తున్నారని తెలుసుకొని అటవీశాఖ సిబ్బంది వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు చర్లకు వచ్చేలోగా లారీలను భద్రాచలం తరలించవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో అడ్డువచ్చిన డీఆర్వో కనకమ్మతోపాటు అటవీశాఖ సిబ్బందిని బలవంతంగా లాగిపడేశారు. ఎట్టకేలకు పోలీసులను ప్రతిఘటించి ఫారెస్ట్ సిబ్బంది చర్లకు వచ్చారు. లారీలను నిలిపివేసి నలుగురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. లారీలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌పైనా కేసులు నమోదు చేశారు. -
సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తం
సచివాలయంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఆ సమయంలో రెండు ప్రాంతాల ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ రెండు ర్యాలీలు ఒకే మార్గంలో ఎదురెదురుగా వచ్చాయి. దాంతో ఆ రెండు ప్రాంతాల వారు నినాదాలు మరింత పెంచడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు ప్రాంత ఉద్యోగులను శాంతపరిచారు. ఆ సమయంలో పోలీసులకు, ఉద్యోగులుకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. -
ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు భావోద్వేగాలతో కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసౌధ దగ్గర సైతం ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.