సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తం | Tension atmosphere at secretariat in hyderabad | Sakshi
Sakshi News home page

సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తం

Published Sat, Aug 31 2013 2:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Tension atmosphere at secretariat in hyderabad

సచివాలయంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఆ సమయంలో రెండు ప్రాంతాల ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ రెండు ర్యాలీలు ఒకే మార్గంలో ఎదురెదురుగా వచ్చాయి.

 

దాంతో ఆ రెండు ప్రాంతాల వారు నినాదాలు మరింత పెంచడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు ప్రాంత ఉద్యోగులను శాంతపరిచారు. ఆ సమయంలో పోలీసులకు, ఉద్యోగులుకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement