Jalasoudha
-
హైదరాబాద్ జలసౌధలో కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల సోదాలు
-
గోదావరి నీటి వాటాలపై జలసౌధలో సమావేశం
-
కీలకాంశాలపై వాడీవేడిగా
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న కడెం–గూడెం ఎత్తిపోతల పథకం, మొడికుంటవాగు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతుల జారీ/అబ్జర్వేషన్ల నమోదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్ర కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాడీవేడి చర్చకు అవకాశం! కడెం–గూడెం ప్రాజెక్టుపై ఏపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిన అవసరం లేదని గత ఏడాది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం గోదావరి బో ర్డుకు లేఖ రాసింది. అయితే కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో 3 టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినందున ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టినట్టు ఇటీవల తెలంగాణ అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు పెద్దవాగు ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకో వడం వల్ల అత్యవసర మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. రూ.7,826 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు తెలంగాణ 2019లో ప్రతిపాదనలు సమర్పించింది. ఆయకట్టు శాతం ఆధారంగా ఏపీ 85.75 శాతం, తెలంగాణ 14.75 శాతం వ్యయం భరించాలని తెలంగాణ కోరగా, ఏపీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇదే దామాషా లెక్కన రూ.92 కోట్లతో అత్యవసర మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకరించింది. ఆధునీకరణతో పాటు అత్యవసర మరమ్మతులపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నీటి లభ్యత ఎంత ? గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఇప్పటివరకు నిర్ణయించక పోవడంతో రెండు రాష్ట్రా ల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల జారీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదావరి నీటి పంప కాలపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. 1980లో వచ్చిన గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోకూడా నీటి లభ్యతపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 3,216 టీఎంసీల జలాల లభ్య త ఉండగా, అందులో ఉమ్మడి రాష్ట్రానికి కేవలం 1,360 టీఎంసీల లభ్యత ఉందని వ్యాప్కోస్ అధ్య యనంలో తేలిందని ఏపీ వాదిస్తోంది. తెలంగాణకు 1,480 టీఎంసీలు, ఏపీకి 1,486.155 టీఎంసీల లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంటోంది. ఈ నేప థ్యంలో గోదావరిలో వాస్తవ నీటి లభ్యతపై జాతీయ స్థాయి సంస్థతో అధ్యయనం చేయించాలని గోదా వరి బోర్డు ప్రతిపాదించింది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం: శ్యామలరావు
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో సోమవారం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా.. తెలంగాణ అధికారులు మరోసారి గైర్హాజరయ్యారు. జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ.. ‘‘నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. కేఆర్ఎమ్బీ, జీఆర్ఎమ్బీ బోర్డు సమావేశంలో అధికారుల నియామకం.. సదుపాయాల కల్పనపై చర్చించాం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గెజిట్‌లో మార్పులు కోరుతున్నాం. షెడ్యూల్ 1,2,3లో మార్పులు చేయాలని కోరుతున్నాం..అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం’’ అన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏఐబీపీ, డ్రిప్, భూగర్భజలాలు, ట్రిపుల్ఆర్ పథకాలపై మంత్రి హరీశ్‌రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్ఆర్ పనుల నిమిత్తం కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు యుటిలైజేషన్ పత్రాలు కేంద్రానికి సమర్పించి రావాల్సిన నిధులు పొందాలని సూచించారు. ఇక డామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టే పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి 33 ప్రాజెక్టు డామ్‌ల ఆధునీకరణ, మరమ్మతులకు రూ.665 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపామని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు ఎంత పెరిగాయన్న వివరాలను హరీశ్ భూగర్భ జలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వచ్చే రూ.70 కోట్ల నిధులతో గ్రౌండ్ డేటా సిస్టంను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భూగర్భ జలాల సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించడం, భూగర్భ జలశాఖ కార్యకలాపాలు, ప్రణాళికను మరింత ఆధునీకరించడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ఈ ఏడాది రూ.16 కోట్లతో కొన్ని పనులు చేపడుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కేంద్రం నుంచి మరిన్ని నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని హరీశ్ సూచించారు. భూగర్భ జలాల సమాచార సేకరణకు 800 కొత్త పీజో మీటర్లు, 900 వాటర్ లెవల్ రికార్డర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ ప్రకాశ్, ఈఎన్సీ మురళీధర్, కాడా కమిషనర్ మల్సూర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకూ నీరందాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రబీలో సాగు నీటి ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణను పకడ్బందీగా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని సూచించారు. బుధవారం భారీ ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణ, సాధించిన ఆయకట్టు, మిషన్ భగీరథ అవసరాలపై సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో మంత్రి జలసౌధలో సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీలో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలకు, ఎల్ఎండీ దిగువన 1.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్ భగీరథ అవసరాలకు జలాశయాల్లో నీటిని కాపాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వలపై రాత్రి వేళల్లో కూడా గస్తీ నిర్వహించాలన్నారు. అక్రమంగా తూములు, కాల్వలు పగులగొట్టకుండా, గేట్లను ఎత్తివేయకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. 19 లక్షల ఎకరాలకు నీరు.. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 10 టీఎంసీల నీరు ఉందని చీఫ్ ఇంజనీర్ మంత్రికి తెలిపారు. మరో నాలుగు తడులకు 4 టీఎంసీల నీరు అవసరమని.. మిగతా 6 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ అవసరాలను వినియోగిద్దామని చీఫ్ ఇంజనీర్ అన్నారు. ఏప్రిల్ 16న ఎస్సారెస్పీ కాల్వ మూసివేయాలని, మార్చి 20న ఎల్ఎండీ కాలువ మూసివేయాలని హరీశ్ ఆదేశించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 32 టీఎంసీలు, సాగర్‌లో 30 టీఎంసీలు మొత్తం కలిపి 62 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. ఇప్పటికే 7 తడులకు నీటిని విడుదల చేశామని, మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసముందన్నారు. ఏప్రిల్ 5న సాగర్ ఎడమ కాలువ తూము మూసివేయాలని హరీశ్ సూచించారు. ఈ రబీలో శ్రీరాంసాగర్ కింద 6 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద 5 లక్షల ఎకరాలు, నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సీతారామ ఎత్తిపోతలపైనా మంత్రి హరీశ్ సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. సీతారామ లిఫ్ట్ పథకం ఫేజ్ –1లో 3 పంప్‌హౌస్‌ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్, తుమ్మల అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సీఎస్ జోషికి సన్మానం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జలసౌధకు వచ్చిన ఎస్కే జోషిని మంత్రి హరీశ్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా, ఇరిగేషన్ వ్యవహారాలను పర్యవేక్షించిన జోషి అత్యంత బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. తన 34 ఏళ్ల సర్వీస్‌లో ఎందరో మంత్రులను చూశానని, కానీ హరీశ్ వంటి మంత్రిని చూడలేదని జోషి అన్నారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి మంత్రి పడుతున్న శ్రమను ఆయన కొనియాడారు. -
మూడు జిల్లాల్లో ‘కృషి సించయ్ యోజన’
మంత్రి హరీశ్‌రావు సూచన సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘కృషి సించయ్ యోజన’ను రాష్ర్టం లో అమలు చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులతో శనివారం జలసౌధలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగం అభివృద్ధికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో కేంద్ర నీటి పారుదల శాఖ అమలు చేస్తున్న ఏఐబీపీ తదితర పథకాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కృషి సించయ్ యోజన ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది తెలంగాణలో నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎంపిక చేసిన జిల్లాల నుంచి అందే ప్రతిపాదనలను ముఖ్య కార్యదర్శి ద్వారా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ఏఐబీపీ పథకం కింద గతంలో ప్రతిపాదించిన పథకాల్లో ఆమోదం పొంది పూర్తయిన ప్రాజెక్టుల నివేదికలను కూడా పంపాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 2014-15లో రూ.59.5 కోట్లు, 2015-16లో రూ.112.2 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఢిల్లీ వెళ్లి ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ నీటి పారుదల విభాగం సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కే.జోషి, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలు
-
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్ : నగరంలోని జలసౌధాలో సోమవారం ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బాణ సంచాలు కాల్చుతూ కేరింతలతో జాతీయ జెండా ఎగురవేశారు. జెతైలంగాణ అంటూ నినాధాలుతో విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఎన్నెస్పీ ఇరిగేషన్, ఉపాధికల్పన కార్యాలయ ఉద్యోగులు ఈవేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో ఈఈ అంకవీడు ప్రసాద్ చే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో డీఈ అర్జన్, తెలంగాణ ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్, ఏఈలు చంద్రమోహన్, గోపాల్, చంద్రశేఖర్, సీహెచ్ బాబు పాల్గొన్నారు. ఇందిరానగర్‌లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో...పర్ణశాల రామాలయంలోని సంఘం కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. సీనియర్ రిటైర్డ్ ఉద్యోగి రంగారావు జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కిలారి జగన్మోహన్రావు, వాసిరెడ్డి వెంకటరావు, గంట్ల సీతారామరెడ్డి, ఎల్.యాదగిరి, పర్ణశాల రామాలయ చైర్మన్ ఎం. కృష్ణమూర్తి , వెంకటేశ్వర శాస్త్రి, శేషగిరిరావు, జి.నారాయణ, రామ్‌లాల్, మోహన్‌రావు పాల్గొన్నారు. రఘునాధపాలెం మండల పరిషత్‌లో... తెలంగాణ సంబురాల్లో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఇందుమతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగఫలంగా సాధించుకున్న బంగారు తెలంగాణలో పేదలందరికీ న్యాయం జరగాలని అకాక్షించారు. కార్యక్రమంలో మండల ఏఈ తెనాలి సుబ్బారావు, ఉపాధి పీఓ అమ్మాజాన్, ఈఓ ఆర్డీ ప్రభాకర్, కార్యాలయ సూపరింటెండెంట్ వేణుమాధవ్, నిర్మలపాల్గొన్నారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో.. తహశీల్దార్ సీహెచ్. రాజమహేంద్రరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామకృష్ణ, వాహిద్, డీటీ చారి, వీఆర్ఓలు పాల్గొన్నారు. అర్బన్ పోలీసు స్టేషన్లో.. సీఐ మధుసూధన్ జాతీయ జెండా ఎగుర వేసి తెలంగాణ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం లో ఎస్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మంచుకొండ సొసైటీ కార్యాలయంలో... మంచుకొండ సొసైటీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నేరవేరిందని చైర్మన్ తుమ్మల పల్లి మోహన్‌రావు అన్నారు. కార్యక్రమంలో సీఈఓ వెంకటేశ్వర్లు, సొసైటీ డెరైక్టర్లు పాల్గొన్నారు. మంచుకొండ పాఠశాలలో... హెచ్ఎం వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ సీతారాములు, ఉపాధ్యాయులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. చింతగుర్తి పంచాయతీ కార్యాలయంలో... చింతగుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు గ్రామసర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో బాణసంచా కాల్చుతూ గ్రామంలో ప్రదర్శన చేశారు. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాలోత్ రాంబాబు, మాజీ సర్పంచ్‌లు సీతారాములు, తాత వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు భూక్యా వెంకన్న, ఆలస్యంశ్రీను,మద్దినేని వీరయ్య పాల్గొన్నారు. తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పుష్పాభిషేకం చేశారు. బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచారు. టీఆర్ఎస్ జిల్లా ధ్యక్షుడు దిండిగల రాజేందర్ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండాను నియోజకవర్గ నాయకుడు అబ్దుల్నబీ ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకుడు శెట్టి రంగారావు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు మందడపు శంకర్రావు, నాయకులు గోపగాని శంకర్, బత్తుల సోమయ్య, జి.విద్యాసాగర్, నరేంద్రర్, డోకుపర్తి సుబ్బారావు, రాజ్‌కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిమ్మపుడిలో అన్నదానం చిమ్మపుడిలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మారం రాంరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామంలో బాణసంచా కాల్చారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. రాంరెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకుడు మారం కరుణాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ లచ్చయ్య, ఎంపీటీసీ గంగమ్మతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కొత్తూరులో.. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు అమర్లపుడి బాలశౌరి ఆధ్వర్యంలో తెలంగాణ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగర వేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గుండెపోగు భాస్కర్, అమర్లపుడి ప్రకాష్, వికాష్, తేజ, బాబురావు, తదితరులు పాల్గొన్నారు. మహాజన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో... ఇందిరానగర్‌లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నకెరికంటి సంజీవరావు, అధ్యక్షతన జరిగిన ఈ సంబురాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపాక నాగభూషణం జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు వీరస్వామి, ప్రసాద్, రాములు, శిల్ప, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో... ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్, అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేష్, గౌరవ అధ్యక్షుడు పీతాంబరం, నాగిరెడ్డి, సాయిబాబా, బాబు పాల్గొన్నారు. బొమ్మా పాఠశాలలో...బొమ్మా బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో కేక్ కట్ చేసి బాణ సంచా కాల్చారు. బొమ్మా విద్యాసంస్థల చైర్మన్ బొమ్మా రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ సత్యప్రసాద్, డెరైక్టర్ మాధవి, శ్రీధర్, ఏఓ రామకృష్ణ, తదితరులుతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు భావోద్వేగాలతో కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసౌధ దగ్గర సైతం ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
జలసౌధ వద్ద ఉద్రిక్తం
-
పోటాపోటీ నినాదాలు, జలసౌధ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : హైదరాబాద్ జలసౌథ వద్ద శుక్రవారం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోటాపోటీ నినాదాలు, తోపులాటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత సీమాంధ్ర ఉద్యోగులు వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక నినాదంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. దీంతో జలసౌధ వద్ద ఉద్రిక్తమైంది. ఇరు ప్రాంతాల ఉద్యోగులు తొపులాటకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు శాంతిపచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్రిక్త వాతారణం కొనసాగుతుండటంతో ఇరుప్రాంతాలకు చెందిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు సచివాలయం వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ