ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్ : నగరంలోని జలసౌధాలో సోమవారం ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బాణ సంచాలు కాల్చుతూ కేరింతలతో జాతీయ జెండా ఎగురవేశారు. జెతైలంగాణ అంటూ నినాధాలుతో విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఎన్నెస్పీ ఇరిగేషన్, ఉపాధికల్పన కార్యాలయ ఉద్యోగులు ఈవేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో ఈఈ అంకవీడు ప్రసాద్ చే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో డీఈ అర్జన్, తెలంగాణ ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్, ఏఈలు చంద్రమోహన్, గోపాల్, చంద్రశేఖర్, సీహెచ్ బాబు పాల్గొన్నారు.
ఇందిరానగర్‌లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో...పర్ణశాల రామాలయంలోని సంఘం కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. సీనియర్ రిటైర్డ్ ఉద్యోగి రంగారావు జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కిలారి జగన్‌మోహన్‌రావు, వాసిరెడ్డి వెంకటరావు, గంట్ల సీతారామరెడ్డి, ఎల్.యాదగిరి, పర్ణశాల రామాలయ చైర్మన్ ఎం. కృష్ణమూర్తి , వెంకటేశ్వర శాస్త్రి, శేషగిరిరావు, జి.నారాయణ, రామ్‌లాల్, మోహన్‌రావు పాల్గొన్నారు.
రఘునాధపాలెం మండల పరిషత్‌లో...
తెలంగాణ సంబురాల్లో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఇందుమతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగఫలంగా సాధించుకున్న బంగారు తెలంగాణలో పేదలందరికీ న్యాయం జరగాలని అకాక్షించారు. కార్యక్రమంలో మండల ఏఈ తెనాలి సుబ్బారావు, ఉపాధి పీఓ అమ్మాజాన్, ఈఓ ఆర్‌డీ ప్రభాకర్, కార్యాలయ సూపరింటెండెంట్ వేణుమాధవ్, నిర్మలపాల్గొన్నారు.
అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో..
తహశీల్దార్ సీహెచ్. రాజమహేంద్రరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రామకృష్ణ, వాహిద్, డీటీ చారి, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
అర్బన్ పోలీసు స్టేషన్‌లో.. సీఐ మధుసూధన్ జాతీయ జెండా ఎగుర వేసి తెలంగాణ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం లో ఎస్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచుకొండ సొసైటీ కార్యాలయంలో...
మంచుకొండ సొసైటీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నేరవేరిందని చైర్మన్ తుమ్మల పల్లి మోహన్‌రావు అన్నారు. కార్యక్రమంలో సీఈఓ వెంకటేశ్వర్లు, సొసైటీ డెరైక్టర్లు పాల్గొన్నారు.
మంచుకొండ పాఠశాలలో... హెచ్‌ఎం వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ సీతారాములు, ఉపాధ్యాయులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
చింతగుర్తి పంచాయతీ కార్యాలయంలో...
చింతగుర్తిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు గ్రామసర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో బాణసంచా కాల్చుతూ గ్రామంలో ప్రదర్శన చేశారు. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాలోత్ రాంబాబు, మాజీ సర్పంచ్‌లు సీతారాములు, తాత వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు భూక్యా వెంకన్న, ఆలస్యంశ్రీను,మద్దినేని వీరయ్య పాల్గొన్నారు.
తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం
నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్‌ఎస్ నాయకులు పుష్పాభిషేకం చేశారు. బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచారు. టీఆర్‌ఎస్ జిల్లా ధ్యక్షుడు దిండిగల రాజేందర్ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండాను నియోజకవర్గ నాయకుడు అబ్దుల్‌నబీ ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు శెట్టి రంగారావు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు మందడపు శంకర్‌రావు, నాయకులు గోపగాని శంకర్, బత్తుల సోమయ్య, జి.విద్యాసాగర్, నరేంద్రర్, డోకుపర్తి సుబ్బారావు, రాజ్‌కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చిమ్మపుడిలో అన్నదానం
చిమ్మపుడిలో టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మారం రాంరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామంలో బాణసంచా కాల్చారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. రాంరెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నాయకుడు మారం కరుణాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ లచ్చయ్య, ఎంపీటీసీ గంగమ్మతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరులో.. టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు అమర్లపుడి బాలశౌరి ఆధ్వర్యంలో తెలంగాణ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగర వేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గుండెపోగు భాస్కర్, అమర్లపుడి ప్రకాష్, వికాష్, తేజ, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
మహాజన భవన నిర్మాణ కార్మిక సంఘం
ఆధ్వర్యంలో... ఇందిరానగర్‌లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నకెరికంటి సంజీవరావు, అధ్యక్షతన జరిగిన ఈ సంబురాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపాక నాగభూషణం జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు వీరస్వామి, ప్రసాద్, రాములు, శిల్ప, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఉపాధ్యాయ సంఘం
ఆధ్వర్యంలో... ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్, అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేష్, గౌరవ అధ్యక్షుడు పీతాంబరం, నాగిరెడ్డి, సాయిబాబా, బాబు పాల్గొన్నారు.
బొమ్మా పాఠశాలలో...బొమ్మా బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో కేక్ కట్ చేసి బాణ సంచా కాల్చారు. బొమ్మా విద్యాసంస్థల చైర్మన్ బొమ్మా రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ సత్యప్రసాద్, డెరైక్టర్ మాధవి, శ్రీధర్, ఏఓ రామకృష్ణ, తదితరులుతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
Published Tue, Jun 3 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement