Telangana celebrations
-
రాష్ట్రవ్యాప్తంగా ‘దశాబ్ది దగా’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా పేరుతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వం విఫలమైన 10 అంశాలతో కూడిన తలలను కూర్చి రావణాసుర దిష్టిబొమ్మలను దహనం చేసింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, గిరిజనులు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక ఆర్డీవోలు, ఎమ్మార్వోలతోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు పత్రాలను కాంగ్రెస్ నేతలు అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ ముఖ్యనేత షబ్బీర్‌అలీని హౌస్అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ నుంచి ఆందోళన చేపట్టేందుకు బయలుదేరిన టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులను పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఖమ్మంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, చొప్పదండిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర క్యాంపు వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అరెస్టులను ఖండించిన రేవంత్, కోమటిరెడ్డి దశాబ్ది దగా కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకొనేందుకు పోలీసులు తమ పార్టీకి చెందిన పలువురు నేతలను అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భునవగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. వారి అరెస్టులు అప్రజాస్వామికమని, ఇది కచ్చి తంగా దశాబ్ది దగానేనని, ప్రతిపక్ష పార్టీగా ప్రజాసమస్యలపై పోరాడే హక్కు తమ పార్టీకి ఉందని గురువారం ఒక ప్రకటనలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాలరాసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ప్రకటనలో హెచ్చరించారు. కాంగ్రెస్ దశాబ్ది దగా కార్యక్రమానికి పిలుపునిచ్చి నందునే అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కేసీఆర్ పిలిపించుకొని ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అడ్డుకోవడం ద్వారా ప్రజాసమస్యలపై ఉద్యమాలను నిలువరించలేరని స్పష్టం చేశారు. -
'ఇండియా డే వేడుకల్లో' టాక్ తెలంగాణ
తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర అతిథులకు తెలియజేయాలనే భావనతో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ అధ్వర్యంలో లండన్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. హరితహారం, చేనేతకు చేయూత, కాకతీయ కళాతోరణం వంటి కళాకృతుల ప్రత్యేకతతో తెలంగాణ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. లండన్‌లోని భారత హైకమిషన్, దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన 'ఇండియా డే వేడుకలకు' టాక్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత, చరిత్ర, బాషా-సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్లో ప్రదర్శించి హాజరైన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, సాధించిన విజయాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ స్టాల్‌ని ఏర్పాటు చేశామని సంస్థ కార్యదర్శి మల్లారెడ్డి తెలిపారు. చేనేతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయత్వంలో చేనేత వస్త్రాలపై తీసుకొస్తున్న అవగాహనను, టాక్ సంస్థ తన ప్రదర్శనలో ఉంచి వేర్ హ్యాండ్లూమ్, వీ సపోర్ట్ వీవర్స్ వంటి హ్యాష్‌టాగ్‌లను ప్రతిజ్ఞ మాదిరిగా ఫ్రేమ్‌లో ఉంచి వారి మద్దతును కోరారు. అలాగే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్త కార్యక్రమాన్ని కూడా తెలంగాణ స్టాల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక ప్రతిజ్ఞతో కూడిన సెల్ఫీ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించామని టాక్ కార్యదర్శి నవీన్ రెడ్డి తెలిపారు. స్టాల్‌ను సందర్శించిన భారత హై కమిషనర్ రుచి ఘనశ్యామ్, భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు, నాయకులు ఎంపీ సంతోష్ కృషిని అభినందించి సెల్ఫీ దిగి తమ మద్దతును తెలియజేశారు. స్టాల్లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకులు, తెలంగాణ ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులర్పించారు. కాకతీయ కళాతోరణం ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ గొప్పతనం విదేశీగడ్డపై ఉట్టిపడేలా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా నిర్మించిన టాక్ ముఖ్య నాయకులు మల్లారెడ్డిని హై కమిషనర్ రుచి ఘనశ్యామ్, కార్యదర్శి నారంగ్ ప్రత్యకంగా ప్రశంసించారు. టాక్ సభ్యులు భారత హై కమిషనర్ రుచి ఘనశ్యామ్ని తెలంగాణ చేనేత శాలువతో సన్మానించారు. టాక్ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ స్టాల్‌ని సందర్శించిన అతిథులందరికి మన హైదరాబాద్ బిర్యానీ రుచిచూపించామని నాయకులు రాకేష్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, జాయింట్ సెక్రటరీ నవీన్ రెడ్డి, ఈవెంట్స్, కల్చరల్ ఇన్‌ఛార్జి అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, సత్య చిలుముల, స్పోర్ట్స్ సెక్రటరీలు మల్లారెడ్డి, రాకేష్ పటేల్, మహిళా విభాగం సభ్యులు శుషుమ్న రెడ్డి, సుప్రజ పులుసు, శ్వేతా రెడ్డి, శ్రీలక్ష్మి, శ్రీవిద్య ఇతర టాక్ సభ్యులు రవిప్రదీప్ పులుసు, మధుసూదన్ రెడ్డి, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, వంశీ రేక్నార్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా అవతరణ వేడుకలు
► వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ.సింగ్ సాక్షి, కరీంనగర్: తెలంగాణ అవతరణ వేడుకలను పం డుగలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించా లని సూచించారు. జిల్లాస్థాయిలో వివిధరంగాలలో విశేష కృషి చేసిన 11 మందిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా, డివిజన్‌స్థాయిలో ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలని తెలిపారు. జూన్ 3వ తేదీన కేసీఆర్ కిట్టు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వాస్పత్రులలో, ఏరియా ఆస్పత్రులలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనాలన్నారు. జూన్ 4న ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వమించాలని పేర్కొన్నారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంచేసి రెండు రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. 2018, డిసెంబర్ నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందు కు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛ గృహిశ్, స్వచ్ఛ రుతలను నియమించుకోవాలని సూచించారు. ఉపాధిహమీ పథ కం క్రింద శానిటేషన్ వర్కర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, కృష్ణభాస్కర్, డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, డీఎంహెచ్‌వో శ్రీధర్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో తెలంగాణ సంబురాలు
జూన్ 2న పని ప్రదేశంలోనే కూలీలకు మిఠాయిలు ఒక్కో కూలీకి రూ.10 చొప్పున రూ.1.60 కోట్లు విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు ఇది ‘తీపి’ కబురు. తెలంగాణ సంబురాల్లో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా జూన్ 2వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశంలోనే కూలీలకు మిఠాయిలు పంచాలని అధికారులకు సూచించింది. మిఠాయి కొనుగోలు నిమిత్తం ఒక్కో కూలీకి రూ.10 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం పనులకు వస్తున్న 16 లక్షల మంది కూలీల కోసం రూ.1.60 కోట్లను గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. సంబరాల ఏర్పాట్ల కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) ఖాతాలకు నిధులను జమ చేసినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ ఎంపీడీవోలకు గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితారామచంద్రన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సంబురాలకు మార్గదర్శకాలివీ... గ్రామం వారీగా ఉపాధి కూలీల జాబితాను రూపొందించాలి సంబరాల నిర్వహణ నిమిత్తం ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి గ్రామాల వారీగా నియమితులైన ప్రత్యేక అధికారులకు ప్రోగ్రాం అధికారులు మిఠాయిలను అందజేయాలి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల సహకారంతో సంబరాల ఏర్పాట్లు చేసుకోవాలి నాణ్యమైన మిఠాయిని మండల కొనుగోలు కమిటీ ద్వారానే కొనుగోలు చేయాలి జూన్ 2న పని ప్రదేశంలోనే ఉపాధి కూలీలందరికీ మిఠాయిలు పంచిపెట్టాలి ఉపాధి హామీ ప్రయోజనాలపై కూలీలకు అవగాహన కల్పించాలి ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద చేసిన పని వివరాలను తెలియజేయాలి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి జిల్లా స్థాయిలో డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్ సమీక్షించాలి. ఆపై నివేదికను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు పంపాలి -
కెనడాలో తెలంగాణ సాంస్కృతిక సమ్మేళనం
-
దా‘రుణం’!
సాక్షి సంగారెడ్డి,సంగారెడ్డి: అరవై ఏళ్ల కల సాకారమైనా.. రైతన్న మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. ‘మన రాజ్యం.. మన పాలన’కోసం ఆశగా కొట్లాడిన అన్నదాతలు.. ఇప్పుడెందుకో కలవరపడుతున్నారు. తెలంగాణ ‘సంబురాలు’ కూడా ఒడిసిపోక ముందే మెతుకుసీమ రైతింట్లో ‘సావు’ దరువేస్తోంది. కొత్త సర్కారు అస్పష్ట మాటలు.. మీడియా లీకులు.. రుణాల మాఫీపై ఆంక్షలు.. అన్నీ కలిసి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘అప్పులు తీరుతాయో లేదోనని.. ఎట్టా బతికేదని’ దిగులు చెందుతూ మృత్యువాత పడుతున్నారు. మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో యువరైతు ముత్యాల సంగయ్య గుండెపోటుతో చనిపోగా.. తాజాగా శుక్రవారం జహీరాబాద్ మండలం కాశీంపూర్‌లో బోయిని దత్తాత్రి గుండె ఆగి చనిపోయారు. దత్తాత్రికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. కాలం కలిసిరాక, పంటలు పండక అప్పులు కావడం...దానికి తోడు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడంతో దాదాపు 6 ఎకరాల భూమి అమ్మేశాడు. ఆరు నెలల కిందట మరో ఆడపిల్ల పెళ్లి చేశాడు. దాదాపు రూ.2 లక్షలు అప్పు అయింది. గత ఏడాది గ్రామీణ వికాస బ్యాంకు జహీరాబాద్ శాఖ నుంచి రూ. 65 వేల పంట లోను తీసుకున్నాడు. ఇప్పుడది వడ్డీతో కలుపుకొని రూ.72 వేల వరకు అయింది. ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ప్రకటించడంతో దత్తాత్రి నెత్తి మీద ఉన్న భారం దిగినట్లు అయింది. అయితే బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ప్రచారం జరగడంతో అప్పు తీరేది ఎట్టా అని మదనపడ్డ దత్తాత్రికి గుండెపోటు వచ్చి చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జోగిపేట మండలం పోల్కంపల్లిలో గురువారం మరణించిన యువ రైతు సంగయ్య గుండెపోటుకు గల కారణాలను శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. వివరాల ప్రకారం 2011 నుంచి 2013 మధ్యకాలంలో సంగయ్య కుటుంబం దాదాపు రూ 2.12 లక్షల పంట రుణం తీసుకుంది. ఎస్బీహెచ్ బ్యాంకు మునిపల్లి శాఖ నుంచి వీరు రుణాలు పొందారు. సంగయ్య పేరు మీద రూ. 50 వేలు, ఆయన తండ్రి ఆశయ్య పేరు మీద రూ. 90 వేలు, తల్లి బాలమ్మ పేరు మీద రూ. 72 వేల రుణం ఉంది. ఒక్కొక్కరి పేరు మీద రూ. లక్ష లోపే రుణాలు ఉన్నాయి. అన్ని రుణాలు మాఫీ అవుతాయని సంగయ్య ఆశపడ్డారు. కానీ రుణాలు మాఫీ అయ్యే అవకాశం లేకపోవడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని అధికారులు వాంగ్మూలం సేకరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల్లో 3,65,787 మంది రైతులు రూ. 2,404 కోట్ల పంట రుణాలు తీసున్నారు. 1,90,406 మంది సన్నకారు రైతులు రూ.1,130 కోట్లు, 86,272 మంది చిన్నకారు రైతులు రూ. 633 కోట్ల రుణాలు తీసుకున్నారు. గడిచిన మూడేళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు తొమ్మిది లక్షలకు పైగా మంది రైతులు ఉన్నారు. రూ. 4.500 కోట్ల పంట రుణాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కేవలం సన్నకారు రైతుల రుణాలు రూ.1,130 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకు అధికారుల గణాంకాలను చూస్తే దాదాపు ఐదు లక్షల మంది రైతులకు రుణ మాఫీ అయ్యే అవకాశం లేదు. దీంతో రుణమాఫీ మీద కోటి ఆశలు పెట్టుకున్న రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. -
జై తెలంగాణ.. జైజై తెలంగాణ
ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్ : నగరంలోని జలసౌధాలో సోమవారం ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బాణ సంచాలు కాల్చుతూ కేరింతలతో జాతీయ జెండా ఎగురవేశారు. జెతైలంగాణ అంటూ నినాధాలుతో విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఎన్నెస్పీ ఇరిగేషన్, ఉపాధికల్పన కార్యాలయ ఉద్యోగులు ఈవేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో ఈఈ అంకవీడు ప్రసాద్ చే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో డీఈ అర్జన్, తెలంగాణ ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్, ఏఈలు చంద్రమోహన్, గోపాల్, చంద్రశేఖర్, సీహెచ్ బాబు పాల్గొన్నారు. ఇందిరానగర్‌లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో...పర్ణశాల రామాలయంలోని సంఘం కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. సీనియర్ రిటైర్డ్ ఉద్యోగి రంగారావు జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కిలారి జగన్మోహన్రావు, వాసిరెడ్డి వెంకటరావు, గంట్ల సీతారామరెడ్డి, ఎల్.యాదగిరి, పర్ణశాల రామాలయ చైర్మన్ ఎం. కృష్ణమూర్తి , వెంకటేశ్వర శాస్త్రి, శేషగిరిరావు, జి.నారాయణ, రామ్‌లాల్, మోహన్‌రావు పాల్గొన్నారు. రఘునాధపాలెం మండల పరిషత్‌లో... తెలంగాణ సంబురాల్లో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఇందుమతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగఫలంగా సాధించుకున్న బంగారు తెలంగాణలో పేదలందరికీ న్యాయం జరగాలని అకాక్షించారు. కార్యక్రమంలో మండల ఏఈ తెనాలి సుబ్బారావు, ఉపాధి పీఓ అమ్మాజాన్, ఈఓ ఆర్డీ ప్రభాకర్, కార్యాలయ సూపరింటెండెంట్ వేణుమాధవ్, నిర్మలపాల్గొన్నారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో.. తహశీల్దార్ సీహెచ్. రాజమహేంద్రరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామకృష్ణ, వాహిద్, డీటీ చారి, వీఆర్ఓలు పాల్గొన్నారు. అర్బన్ పోలీసు స్టేషన్లో.. సీఐ మధుసూధన్ జాతీయ జెండా ఎగుర వేసి తెలంగాణ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం లో ఎస్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మంచుకొండ సొసైటీ కార్యాలయంలో... మంచుకొండ సొసైటీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నేరవేరిందని చైర్మన్ తుమ్మల పల్లి మోహన్‌రావు అన్నారు. కార్యక్రమంలో సీఈఓ వెంకటేశ్వర్లు, సొసైటీ డెరైక్టర్లు పాల్గొన్నారు. మంచుకొండ పాఠశాలలో... హెచ్ఎం వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ సీతారాములు, ఉపాధ్యాయులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. చింతగుర్తి పంచాయతీ కార్యాలయంలో... చింతగుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు గ్రామసర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో బాణసంచా కాల్చుతూ గ్రామంలో ప్రదర్శన చేశారు. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాలోత్ రాంబాబు, మాజీ సర్పంచ్‌లు సీతారాములు, తాత వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు భూక్యా వెంకన్న, ఆలస్యంశ్రీను,మద్దినేని వీరయ్య పాల్గొన్నారు. తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పుష్పాభిషేకం చేశారు. బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచారు. టీఆర్ఎస్ జిల్లా ధ్యక్షుడు దిండిగల రాజేందర్ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండాను నియోజకవర్గ నాయకుడు అబ్దుల్నబీ ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకుడు శెట్టి రంగారావు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు మందడపు శంకర్రావు, నాయకులు గోపగాని శంకర్, బత్తుల సోమయ్య, జి.విద్యాసాగర్, నరేంద్రర్, డోకుపర్తి సుబ్బారావు, రాజ్‌కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిమ్మపుడిలో అన్నదానం చిమ్మపుడిలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మారం రాంరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామంలో బాణసంచా కాల్చారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. రాంరెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకుడు మారం కరుణాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ లచ్చయ్య, ఎంపీటీసీ గంగమ్మతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కొత్తూరులో.. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు అమర్లపుడి బాలశౌరి ఆధ్వర్యంలో తెలంగాణ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగర వేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గుండెపోగు భాస్కర్, అమర్లపుడి ప్రకాష్, వికాష్, తేజ, బాబురావు, తదితరులు పాల్గొన్నారు. మహాజన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో... ఇందిరానగర్‌లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నకెరికంటి సంజీవరావు, అధ్యక్షతన జరిగిన ఈ సంబురాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపాక నాగభూషణం జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు వీరస్వామి, ప్రసాద్, రాములు, శిల్ప, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో... ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్, అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేష్, గౌరవ అధ్యక్షుడు పీతాంబరం, నాగిరెడ్డి, సాయిబాబా, బాబు పాల్గొన్నారు. బొమ్మా పాఠశాలలో...బొమ్మా బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో కేక్ కట్ చేసి బాణ సంచా కాల్చారు. బొమ్మా విద్యాసంస్థల చైర్మన్ బొమ్మా రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ సత్యప్రసాద్, డెరైక్టర్ మాధవి, శ్రీధర్, ఏఓ రామకృష్ణ, తదితరులుతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
అధికారికంగా టీ సంబురాలు
-
అధికారికంగా టీ సంబురాలు
* జూన్ 2న తెలంగాణ వ్యాప్తంగా రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలు * అదే రోజు ఉదయం 6.30కి టీ-గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణం * 8.15 గంటలకు సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం * 10.45కి పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు * అటు నుంచి సచివాలయానికి కేసీఆర్.. రెడ్‌కార్పెట్ స్వాగతం * 12.57 గంటలకు బాధ్యతల స్వీకరణ.. ఉద్యోగులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాష్ట్రానికి అపాయింటెడ్ డే అయిన జూన్ 2న(సోమవారం) ఉదయం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. 10.45 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త సీఎం కేసీఆర్ సాయుధ బలగాల వందనం స్వీకరిస్తారు. పరేడ్ అనంతరం ఆయన ప్రసంగిస్తారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖులనూ కలుస్తారు. కాగా, తెలంగాణలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు ట్యాంక్‌బండ్, సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్‌లను వారం పాటు విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని భావించినప్పటి కీ ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు వెనక్కితగ్గారు. ఈ భేటీ జరుగుతుండగానే గవర్నర్ నుంచి పిలుపు రావడంతో సీఎస్ మహంతి మధ్యలోనే వెళ్లిపోయారు. సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి శివశంకర్, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ అధిపతి మహేందర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కె జోషి, హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్‌కుమార్, పలుశాఖల ముఖ్యకార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా గవర్నర్.. తర్వాత సీఎం ప్రమాణం తెలంగాణ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమితులైన ఈఎస్ఎల్ నరసింహన్ కూడా జూన్ రెండునే ఉదయం ఆరున్నర గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ర్టపతి ఉత్తర్వుల మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ఎల్పీ నాయకునిగా ఎన్నికైన కేసీఆర్ కూడా అదే రోజు ఉదయం 8.15 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు 600 మందికి ఆహ్వానాలు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు గురువారం శుభాకాంక్షలు తెలిపిన నరసింహన్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికారు. అదే రోజు బాధ్యతల స్వీకరణ.. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత నేరుగా మింట్ కంపౌండ్ వైపున కొత్తగా ఏర్పాటు చేసిన ద్వారం నుంచి ఆయన తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నల్లపోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రెడ్‌కార్పెట్‌పై నడుచుకుంటూ ‘సీ’ బ్లాక్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.57 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్నట్లు తెలిసింది. భద్రతా ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి గురువారం సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమం జరిగే జూన్ 2న రాజ్‌భవన్, నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఎస్ ఈ సందర్భంగా సూచించారు. అవసరమైతే అదనపు బలగాలను వినియోగించాలని కూడా పోలీస్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీని బెటాలియన్‌తో భద్రత కల్పిస్తామని అనురాగ్ శర్మ వివరించారు. కాగా, జూన్ 1 అర్ధరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలకు రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు చేస్తున్నందున జిల్లాల్లోనూ భద్రతను పటిష్టం చేయాలని మహంతి సూచించారు. ఈ విషయమై గవర్నర్ నరసింహన్ నుంచి కూడా పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇక కీలక ప్రాంతాల్లో శనివారం నుంచే పికెట్లను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను డీజీపీ ప్రసాదరావు ఆదేశించినట్లు తెలిసింది. అధికారిక చిహ్నం రెడీ! తెలంగాణ ప్రభుత్వ కొత్త అధికారిక చిహ్నానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు సచివాలయానికి చేరింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజున ఈ చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. వృత్తాకారంలో ఉండే ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ రంగులో, దానికి అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి. ఈ వలయంలోనే పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో.. దాని కింద ఎడమవైపు తెలంగాణ ప్రభుత్వము అని తెలుగులో, కుడివైపు తెలంగాణ సర్కార్ అని ఉర్దూలో ఉంటుంది. దీనికి అంతర వృత్తంలో కాకతీయ ద్వారం గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం, కాకతీయ ద్వారం మధ్యలో చార్మినార్ గుర్తు ఉంటాయి. బాహ్య వ లయం దిగువ భాగంలో హిందీలో ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. ఎంఐఎం అభ్యర్థన మేరకు ఈ చిహ్నంలో చార్మినార్ గుర్తును చేర్చారు. -
కల సాకారమవుతున్న వేళ..
* తెలంగాణ ఆవిర్భావం.. ఆనందపరవశం * జూన్ 2న శుభకార్యాలకు ముహూర్తాలు * జూన్ ఒకటి అర్ధరాత్రి విందులు, వినోదాలు సాక్షి, హైదరాబాద్: జనవరి 1.. ఆగస్టు 15.. అక్టోబర్ 2.. నవంబర్ 14.. ఈ తేదీలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలంగాణ ప్రజలకు జూన్2 కూడా అంతటి ముఖ్యమైన రోజు కాబోతుంది. వందలాది మంది అమరుల త్యాగం, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం చేస్తున్న జూన్ 2 చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఈ కీలకమైన రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజున జీవితంలో గుర్తుండిపోయే పని చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆరే ముందున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా తన జీవితంలో కీలకమైన ఘట్టంగా ఆవిర్భావ దినోత్సవాన్ని మలచుకుంటున్నారు. ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జూన్ 2 గుర్తుండిపోయే రోజే. తెలంగాణ అంతటా ఆసక్తి... ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలు ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు కార్యం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు అదేరోజు తమ వివాహ ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. జూన్‌లోనే పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఈ విద్యాసంవత్సరంలో బడులకు పంపాలనుకునే తల్లిదండ్రులు 2వ తేదీన అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు గృహప్రవేశాలకు ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంకొందరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా తమ జీవితాన్ని మలచుకోవాలని చూస్తున్నారు. సంబురాలకు సిద్ధం..: జూన్1 నుంచే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులైతే ఉద్యమవీరులను స్మరించుకునేందుకు ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌లో జూన్ ఒకటి అర్థరాత్రి గన్‌పార్కు వద్ద ఉద్యమవీరులకు నివాళి అర్పించాలని నిర్ణయించారు. తెలంగాణ అంతటా అర్థరాత్రి 12 గంటల సమయంలో బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీలు తీయనున్నారు. రక్తదాన శిబిరాలు, మరణానంతరం అవయవదానాలు చేసేందుకు వీలుగా పత్రాలు సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గర్భిణీలు ఈ ప్రత్యేకమైన రోజున తమ బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా వైద్యులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన పలువురు వివిధ రాష్ట్రాల్లో, సీమాంధ్రలో ఉన్న వారు ఆవిర్భావ దినోత్సవం రోజు స్థానికంగా ఉండేట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే నూతన సంవత్సర వేడుకల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి ఫస్ట్ నాటి వేడుకల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శుభకార్యాలకు దివ్యమైన రోజు.. జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అది జేష్ఠ శుద్ధ పంచమి సోమవారం. ఈ జేష్ఠ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. పైగా జూన్ 2 సోమవారం నాడు పంచమి పూర్తి రోజు ఉంటుంది. అది అన్ని ముహూర్తాలకు అత్యంత దివ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. నా వద్దకు భక్తుల్లో చాలామంది జూన్ రెండున ఏదో ఒక శుభకార్యం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను పూర్తిస్థాయిలో ఆచరించేందుకు ఆరోజు నుంచి శ్రీకారం చుట్టాలని పలువురు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్లు, గహప్రవేశాలు, అక్షరాభ్యాసం, స్థిరాస్తుల కొనుగోలు వంటివి చేయడం ద్వారా జూన్ రెండును తమ జీవితంలోనూ కీలక ఘట్టంగా మార్చుకోవాలని పలువురు యోచిస్తున్నారు. - ద్రోణ వెంకటరమణ శర్మ, పురోహితులు సంబరాలు చేసుకోవాలని టీఆర్ఎస్ సందేశం జూన్ 2న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తెలంగాణలోని అన్ని గ్రామాల్లో సంబురాలను నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినాయకత్వం సందేశాన్ని పంపింది. ప్రమాణస్వీకారం పూర్తికాగానే టపాకాయలను కాల్చాలని, పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించుకోవాలని సూచించింది. ర్యాలీలు.. జెండావిష్కరణలు తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ రెండున పెద్ద ఎత్తున ర్యాలీలు, తెలంగాణ జెండావిష్కరణలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తాం. సాంసృ్కతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులు కృషి చేయాలని, పని సంస్కృతిని అలవర్చుకోవాలని విన్నవించాం. జూన్ రెండు నుంచి తెలంగాణలో ఉద్యోగుల బాధ్యత మరింత పెరగనుంది. - దేవీప్రసాద్, టీఎన్జీవోల అధ్యక్షుడు -
తెలంగాణ సంబరాల్లో అపశ్రుతి
టేకులపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ సంబురాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిందనే ఆనందంలో విజయోత్సవం చేసుకుంటూ కుప్పకూలిన ఓవ్యక్తి చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.... ఈ నెల 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ వెంకట్యాతండాలో ఆరోజు రాత్రి గ్రామస్తులు ఆట పాటలతో సంబురాలు జరుపుకున్నారు. అదే గ్రామానికి చెందిన కార్పెంటర్ తుమ్మలపల్లి యాకూబ్ పాషా(36) కూడా సంబురాల్లో పాల్గొన్నాడు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన సహచరులు వెంటనే కొత్తగూడెం తరలించారు. అక్కడ కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమించడంతో ఖమ్మం, అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య సరిత, కుమార్తెలు శ్రావణి(8), హాసిని(4), శాలిని(2) ఉన్నారు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో టేకులపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దహనసంస్కారాల కోసం మూడు వేలు వితరణ అందించారు. ఎల్లప్పుడూ చురుకుగా అందరితో కలివిడిగా ఉండే యాకూబ్ పాషా అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్ నుంచి మృతదేహం స్వగ్రామానికి తీసుకురాగానే గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. -
ఆనంద తాండవం
అంబరాన్నంటిన సంబరాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తెలంగాణ సంబరాలు అంబరాన్నంటాయి. అడుగడుగునా ‘జయహో తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. బిల్లుపై మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చిన తెలంగాణవాదులు బైక్‌ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు టపాసులు కాల్చి, మిఠాయీలు పంచుకున్నారు. గన్‌పార్కు తెలంగాణ ఉద్యమకారులతో పోటెత్తింది. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గన్‌పార్కు అమరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అంబర్పేట్, సికింద్రాబాద్, క్లాక్‌టవర్ అమరుల స్తూపం, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో విజయోత్సవ ప్రదర్శనలు నిర్వహించారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ, ఉప్పల్, కుషాయిగూడ, బాలానగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, టోలీచౌకీ తదితర శివారు ప్రాంతాల్లోనూ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని స్వాగతిస్తూ ప్రదర్శనలు చేశారు. నాంపల్లి టీఎన్జీవోస్ కార్యాలయం, టీజీవో భవన్, గగన్‌విహార్, ఏపీ హౌసింగ్‌బోర్డు తదితర కార్యాలయాల్లోను ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్టీయూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ, నిజాం కాలేజ్ తదితర విద్యాసంస్థల ప్రాంగణాల్లో తెలంగాణ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.... నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, ఆర్టీసీ, ఆర్టీఏ, రైల్వే, కలెక్టరేట్ తదితర కార్యాలయాల్లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు తెలంగాణ సంబురాలు జరుపుకున్నారు. మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించిన ఉద్యోగులు తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన అనంతరం కార్యాలయూల ప్రాంగణాల్లోకి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. టీడబ్ల్యూజేయూ హర్షం అంబర్‌పేట, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీడబ్ల్యూజేయూ) హర్షం వ్యక్తం చేసింది. బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు, జర్నలిస్టులకు అభినందనలు తెలియజేసింది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, రాష్ట్రం పునర్నిర్మాణంలో జర్నలిస్టులు కూడా భాగస్వాములవుతారని యూనియన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు. ఉద్యవుకారులకు టీ లోక్‌సత్తా అభినందన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదంతో తెలంగాణ ప్రజల ఉద్యమానికి ఫలితం దక్కిందని టీ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మున్నారం నాగరాజు పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న లోక్‌సత్తా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. -
పాపం..‘తమ్ముళ్లు’!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని సంబరపడాలో.. లేక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆత్మగౌరవయాత్ర చేపడుతున్న పార్టీ అధినేత చంద్రబాబు గీసిన గీత దాటలో తెలియక టీడీపీ నేతలు మదనపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, సీపీ ఐతో ఇతర పార్టీల శ్రేణులు తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో వారివైపు బిక్కమోహం వేసుకుని చూస్తున్నారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని చెప్పే చిన్న ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చిన తర్వాత టీడీపీ మినహా దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ సంఘాలు జిల్లాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలుపుదల చేసి సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆలోచన చేయకుండా ప్రస్తుత పార్లమెంట్ స మావేశాల్లోనే బిల్లుపెట్టాలని ఎవరికి నచ్చిన వి ధంగా వారు శాంతిర్యాలీలు, శాంతిదీక్షలు చేపడుతున్నారు. ప్రకటన వచ్చిన రోజు కాంగ్రెస్‌తో పాటు వైఎస్ఆర్ సీపీ, బీజేపీ, టీఆర్ఎస్ తది తర పార్టీలకు చెందిన నాయకులు ఆయా పా ర్టీల కార్యాలయాల్లోనే సమావేశమై స్వీట్లు పం చుకుని ఒకరికొరు సంతోషాన్ని పంచుకున్నా రు. అయితే టీడీపీ నేతలు గాని, ఆ పార్టీ కార్యకర్తలు గాని ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు విషయంలో సంతోషాన్ని పంచుకునే ప్రయత్నమే చేయలే దు. ఆ తరువాతనైనా తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేయకపోవడం వెనక మతలబు ఏమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ అంటూ ఒకమారు, సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసే సభ పేరుతో మరోమారు పెద్దఎత్తున సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వనపర్తి, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని గాని, ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని గాని ఎక్కడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై ఆంతర్యమేమిటని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏం చేద్దామబ్బా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తూ ప్రకటనలు చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ జిల్లా నేతలు ఉన్నారు. రెండు కళ్ల సిద్ధాంత ధోరణితో పార్టీ అధ్యక్షుడు ముందుకు వెళ్తుండటంతో క్షేత్రస్థాయిలో నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలాఉండగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్డేడియంలో నిర్వహించతలపెట్టిన సభకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులతో పా టు మిగిలిన పార్టీ నాయకులు ప్రకటనలు చే స్తున్నా ఇప్పటివరకు జిల్లా టీడీపీ నేతలు ప ల్లెత్తు మాటకూడా మాట్లాడలేకపోయారు. దీ న్ని బట్టి చూస్తే అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకే వారు నోరు విప్పడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.