మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని సంబరపడాలో.. లేక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆత్మగౌరవయాత్ర చేపడుతున్న పార్టీ అధినేత చంద్రబాబు గీసిన గీత దాటలో తెలియక టీడీపీ నేతలు మదనపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, సీపీ ఐతో ఇతర పార్టీల శ్రేణులు తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో వారివైపు బిక్కమోహం వేసుకుని చూస్తున్నారు.
టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని చెప్పే చిన్న ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చిన తర్వాత టీడీపీ మినహా దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ సంఘాలు జిల్లాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలుపుదల చేసి సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మరో ఆలోచన చేయకుండా ప్రస్తుత పార్లమెంట్ స మావేశాల్లోనే బిల్లుపెట్టాలని ఎవరికి నచ్చిన వి ధంగా వారు శాంతిర్యాలీలు, శాంతిదీక్షలు చేపడుతున్నారు. ప్రకటన వచ్చిన రోజు కాంగ్రెస్‌తో పాటు వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ తది తర పార్టీలకు చెందిన నాయకులు ఆయా పా ర్టీల కార్యాలయాల్లోనే సమావేశమై స్వీట్లు పం చుకుని ఒకరికొరు సంతోషాన్ని పంచుకున్నా రు. అయితే టీడీపీ నేతలు గాని, ఆ పార్టీ కార్యకర్తలు గాని ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు విషయంలో సంతోషాన్ని పంచుకునే ప్రయత్నమే చేయలే దు.
ఆ తరువాతనైనా తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేయకపోవడం వెనక మతలబు ఏమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ అంటూ ఒకమారు, సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసే సభ పేరుతో మరోమారు పెద్దఎత్తున సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వనపర్తి, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని గాని, ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని గాని ఎక్కడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై ఆంతర్యమేమిటని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏం చేద్దామబ్బా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తూ ప్రకటనలు చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ జిల్లా నేతలు ఉన్నారు. రెండు కళ్ల సిద్ధాంత ధోరణితో పార్టీ అధ్యక్షుడు ముందుకు వెళ్తుండటంతో క్షేత్రస్థాయిలో నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇదిలాఉండగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్డేడియంలో నిర్వహించతలపెట్టిన సభకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులతో పా టు మిగిలిన పార్టీ నాయకులు ప్రకటనలు చే స్తున్నా ఇప్పటివరకు జిల్లా టీడీపీ నేతలు ప ల్లెత్తు మాటకూడా మాట్లాడలేకపోయారు. దీ న్ని బట్టి చూస్తే అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకే వారు నోరు విప్పడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
పాపం..‘తమ్ముళ్లు’!
Published Fri, Sep 6 2013 4:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement