సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాము అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడతానని స్పష్టం చేశారు. మన మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలనేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి.. ప్రజలకు మంచిది కాదని తెలిపారు.
ఈ మేరకు బుధవారం మహబూబ్‌నగర్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అతిథి మన వద్దకు వస్తే గౌరవించాలని.. ప్రధాని సభకు వెళ్లానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సహకారం అందించకపోతే చాకిరేవుపెడతానని అన్నారు. బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి విమర్శించిన సీఎం.. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారని మండిపడ్డారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ మందువేసుకొని ఫామ్ హౌజ్‌లో ఉన్నావని కేసీఆర్‌ను ఉద్ధేశించి మండిపడ్డారు. గద్వాలు నీళ్లు తెస్తామన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చిందా అని నిలదీశారు.?
‘అసూయ నా మీద విషం కక్కుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు.. తొంబై రోజుల మా పాలనకు రెఫరెండం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించబోతున్నాం. కేసీఆర్‌కు ఒంట్లో బాగాలేకపోతే.. అసెంబ్లీకి రాకుండా నల్గొండకు ఎందుకు వెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థదిగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 నెలలు కూడా ఇండనివ్వరా?
40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పార్టీ ఫిరాయింపులు, పార్టీల్ని చీల్చడమే మీ విధానమా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? మా ప్రభుత్వం మీదకు వస్తే తొక్కుకుంటూ.. బొందపెడతాం. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది నా ఆన’ అంటూ రేవంత్ ప్రసంగించారు
Comments
Please login to add a commentAdd a comment