
విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ శాఖ ఇంజినీర్ల ధర్నా
విద్యుత్ శాఖ ఇంజినీర్ల నినాదాలతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఇంజినీర్ల నినాదాలతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర విభజన ముంచుకొస్తున్న తరుణంలో సమస్యలు పరిష్కరించకపోతే విద్యుత్ సరఫరాను స్తంభింపచేస్తామని ఇంజినీర్లు యాజమాన్యాన్ని హెచ్చరించారు.
గతంలో జరిగిన ఒప్పందాల మేరకు ఇంజినీర్ల డిమాండ్లన్నింటినీ నెలరోజుల్లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సౌధలో బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఎపి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలలో పనిచేస్తున్న ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.