చీటికి మాటికి కట్
విద్యుత్ కోతలతో అంధకారంలో పట్టణం
అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ములుగు : వర్షాకాలం వస్తోంది. ఇప్పటికే ప లు ప్రాంతాల నుంచి విద్యుత్ సమస్యలపై నాకు వందలాదిగా ఫిర్యాదులు అందుతున్నా యి. ఈదురు గాలులు, గాలివాన బీభత్సాలు సృష్టించకముందే ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలంటూ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మే 20న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను ఆదేశించారు. తనకు మరే ప్రాంతం నుం చైనా ఫిర్యాదులు వస్తే సహించనన్నారు. సమావేశం ముగిసింది. అధికారులు మంత్రి మాట మర్చారు. ఇంకేముంది గతంలో ఉన్న ఇబ్బం దులే ప్రస్తుతం పునరావృతం అవుతున్నారుు. గురువారం మధ్యాహ్నం 3.45 నిమిషాలకు విద్యుత్ సరఫరా నిలిపారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఇచ్చారు.
చినుకుపడితే సరఫరా నిలిపివేత
వారం రోజులగా వాతావరణం ఓ మాదిరిగా మారింది. సాయంత్రం కాగానే గాలివానలు, వర్షాలు మొదలవుతున్నాయి. భారీ వర్షాలు పక్కన పెడితే చిన్నపాటి చినుకులకే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 15 మార్లు కరెంట్ కట్ చేస్తున్నారు. ఇదేంటని అగిడిన ప్రతిసారి అధికారులు, సిబ్బంది ఏదో ఒక సాకు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్తంభాలు వ్యవసాయ పొలాల్లో ఒకవైపుకు ఒరిగిపోయూరుు. తాజాగా మేడివాగు నుంచి ఇంచర్ల వైపు వ్యవసాయ పొలాల్లో వరుసగా 10 స్తంభాలు విరిగిపడడం అధికారులకు ముందుచూపు లేకపోవడానికి ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు.
పట్టణకేంద్రానికి అదే తీరు
గ్రామాలతో పాటు పట్టణ కేంద్రం వాసులు సైతం విద్యుత్ కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇక్కడ ప్రత్యేక ఫీడర్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో జరిగిన అనేక సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా ప్రతీసారి ప్రత్యేక ఫీడర్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామాములుగానే మారింది. రాత్రి వేళ విద్యుత్ నిలిపివేయడంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 10 సార్లు తీసేస్తున్నారు
రోజుకు 10 మార్లు కరెంట్ తీసేస్తున్నారు. ఇదేంటని అడిగితే సరైన సమాధానం ఉండదు. విద్యుత్ లేకపోతే వ్యాపారం ఎలా కొనసాగుతోంది. రోజులో ఎక్కువ శాతం ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. డివిజన్ కేంద్రానికి ఇలా ఉంటే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. - మాట్ల బద్రీ, స్థానికుడు
ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేయాలి
మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లే లైన్‌లకు సంబంధం లేకుండా పట్టణానికి ప్రత్యేక ఫీడర్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ కష్టాలు రాక మానవు. అధికారులు, ఈ విషయంపై చొరవ తీసుకోవాలి. చిన్నగాలికే నిమిషాల పాటు సరఫరా నిలిచిపోతుంది. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. - నక్క రాజు, స్థానికుడు