Minister ajmira Chandulal
-
చీటికి మాటికి కట్
విద్యుత్ కోతలతో అంధకారంలో పట్టణం అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు ములుగు : వర్షాకాలం వస్తోంది. ఇప్పటికే ప లు ప్రాంతాల నుంచి విద్యుత్ సమస్యలపై నాకు వందలాదిగా ఫిర్యాదులు అందుతున్నా యి. ఈదురు గాలులు, గాలివాన బీభత్సాలు సృష్టించకముందే ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలంటూ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మే 20న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను ఆదేశించారు. తనకు మరే ప్రాంతం నుం చైనా ఫిర్యాదులు వస్తే సహించనన్నారు. సమావేశం ముగిసింది. అధికారులు మంత్రి మాట మర్చారు. ఇంకేముంది గతంలో ఉన్న ఇబ్బం దులే ప్రస్తుతం పునరావృతం అవుతున్నారుు. గురువారం మధ్యాహ్నం 3.45 నిమిషాలకు విద్యుత్ సరఫరా నిలిపారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఇచ్చారు. చినుకుపడితే సరఫరా నిలిపివేత వారం రోజులగా వాతావరణం ఓ మాదిరిగా మారింది. సాయంత్రం కాగానే గాలివానలు, వర్షాలు మొదలవుతున్నాయి. భారీ వర్షాలు పక్కన పెడితే చిన్నపాటి చినుకులకే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 15 మార్లు కరెంట్ కట్ చేస్తున్నారు. ఇదేంటని అగిడిన ప్రతిసారి అధికారులు, సిబ్బంది ఏదో ఒక సాకు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్తంభాలు వ్యవసాయ పొలాల్లో ఒకవైపుకు ఒరిగిపోయూరుు. తాజాగా మేడివాగు నుంచి ఇంచర్ల వైపు వ్యవసాయ పొలాల్లో వరుసగా 10 స్తంభాలు విరిగిపడడం అధికారులకు ముందుచూపు లేకపోవడానికి ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు. పట్టణకేంద్రానికి అదే తీరు గ్రామాలతో పాటు పట్టణ కేంద్రం వాసులు సైతం విద్యుత్ కష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇక్కడ ప్రత్యేక ఫీడర్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో జరిగిన అనేక సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా ప్రతీసారి ప్రత్యేక ఫీడర్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామాములుగానే మారింది. రాత్రి వేళ విద్యుత్ నిలిపివేయడంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10 సార్లు తీసేస్తున్నారు రోజుకు 10 మార్లు కరెంట్ తీసేస్తున్నారు. ఇదేంటని అడిగితే సరైన సమాధానం ఉండదు. విద్యుత్ లేకపోతే వ్యాపారం ఎలా కొనసాగుతోంది. రోజులో ఎక్కువ శాతం ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. డివిజన్ కేంద్రానికి ఇలా ఉంటే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. - మాట్ల బద్రీ, స్థానికుడు ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేయాలి మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లే లైన్లకు సంబంధం లేకుండా పట్టణానికి ప్రత్యేక ఫీడర్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ కష్టాలు రాక మానవు. అధికారులు, ఈ విషయంపై చొరవ తీసుకోవాలి. చిన్నగాలికే నిమిషాల పాటు సరఫరా నిలిచిపోతుంది. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. - నక్క రాజు, స్థానికుడు -
సీఎం పాలనకు ఆకర్శితులై చేరిక
గిరిజన సంక్షేమ శాఖా మంత్రి చందూలాల్ టీఆర్ఎస్లో చేరిన కొత్తగూడ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ హన్మకొండ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన చూసి ఇతర రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధు లు, రాజకీయ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర గిరిజన, పర్యాటకాభివృ ద్ధి శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని టీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కొత్తగూడ జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణ శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ వీడి అనుచరులతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారితోపాటు ఏటూరునాగారం మం డలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి చందూలాల్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచేందుకు, బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రానికి రూ.59కోట్లు, ములుగు నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.52కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విపక్ష పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని అన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ, కాంగ్రెస్‌కు రాజీనా మా చేసి టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, కోల జనార్థన్, కమరున్నీసా బేగం, చిర్ర రాజు, దేశిడి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాదాసీదాగా జెడ్పీ ‘స్థాయి’ సమావేశాలు
కోరం లేక ‘ఒకటి’ వాయిదా కనీస గుర్తింపు లభించడం లేదని సభ్యుల ఆవేదన హన్మకొండ : జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు బుధవారం హన్మకొండలోని జిల్లా ప్రజా పరిషత్ కా ర్యాలయంలో జరిగాయి. ఏడు స్థాయి సంఘాలకుగాను ఆరుస్థాయి సంఘాలు యథావిధిగా కొన సాగారుు. కాగా చివరిగా జరుగాల్సిన ఒకటో స్థారుు సంఘం సమావేశం కో రం లేకపోవడంతో ఒకటవ స్థాయి సంఘం సమావేశం వా యిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ గద్దలపద్మ ప్రకటించా రు. ఈ స్థాయి సంఘంలో కోరంకు అయిదుగురు జెడ్పీటీసీ సభ్యులు అవసరం కాగా నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న తో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు కార్యాలయం అవరణలో ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు. ఒకటో స్థారుు సంఘంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దలపద్మ, రాష్ట్ర గిరిజన సంక్షే మశాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్, ఎంపీ ప్రొఫెసర్ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు స్వామి నాయక్, పా లకుర్తి సారంగపాణి, జాటోత్ కమలాకర్, వేముల స్వప్న, మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవ రెడ్డి, బానోత్ విజయబాయి, బాకి లలిత సభ్యులుగా ఉన్నారు. ఇందులో జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులు కమలాకర్,విజయబా యి, లలిత మాత్రం రిజిస్టర్లో సంతకా లు చేశారు. కోరంకు మరో సభ్యుడు అవసరం కాగా ఫోన్లో సభ్యులను సంప్రదించారు. వాయిదా వేసిన అనంతరం పాలకుర్తి సారంగపా ణి చేరుకున్నారు. మిగతా సభ్యులు సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మూల గుండ్ల వెంకన్న జెడ్పీ అవరణలో విలేకరులతో మాట్లాడుతూ జెడ్పీటీసీ సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, నిధుల సమాచారం చెప్ప డంలేదని, ప్రతిపాదనలు తీసుకురావాలని చెప్పుతూ పను లు కేటాయించడం లేదని ఆరోపించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేసిన తీర్మాణాలు పట్టించుకోవడం లేదని వాపోయూరు. ఏ విషయం చైర్పర్సన్ , అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మంత్రి చెపితేనే చేస్తామని చెపుతున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగానే తాము ఒక టోస్థారుు సంఘ సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పా రు. ఈ ఆరోపణలను జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ కొట్టి పా రేశారు.కాగాఅంతకు ముందు 2,3,4,5,6,7వ స్థాయి సం ఘాల సమావేశాలు సాదాసీదాగా నడిచాయి. సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేయూలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూన్ 15, 16, 17వ తేదీల్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ చెప్పారు. హన్మకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిలిం పెస్టివల్ వివరాలను వెల్లడించారు. గతంలో రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మాత్ర మే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వరంగల్‌లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, గుర్తింపు పొందడంతోపాటు పర్యాటకపరంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో 20 దేశాల నుంచి వంద షార్ట్ఫిలిమ్స్ ఎం ట్రీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఫెస్టివల్ ఫౌండర్ జి.భద్రప్ప, ఫెస్టివల్ ైచె ర్మన్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.