గిరిజన సంక్షేమ శాఖా మంత్రి చందూలాల్
టీఆర్‌ఎస్‌లో చేరిన కొత్తగూడ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ
హన్మకొండ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన చూసి ఇతర రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధు లు, రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర గిరిజన, పర్యాటకాభివృ ద్ధి శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని టీ ఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో కొత్తగూడ జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణ శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ వీడి అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారితోపాటు ఏటూరునాగారం మం డలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి చందూలాల్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు.
ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచేందుకు, బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రానికి రూ.59కోట్లు, ములుగు నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.52కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్‌ఎస్ జి ల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విపక్ష పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని అన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ, కాంగ్రెస్‌కు రాజీనా మా చేసి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, కోల జనార్థన్, కమరున్నీసా బేగం, చిర్ర రాజు, దేశిడి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం పాలనకు ఆకర్శితులై చేరిక
Published Wed, Dec 23 2015 1:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement