చినుకు పడితే..చీకట్లే!
నగరంలో అస్తవ్యస్థంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ
ఈదురుగాలులకు నేలకూలుతున్న విద్యుత్ స్తంభాలు..
తెగిపడుతున్న వైర్లు {sిప్పవుతున్న ఫీడర్లు
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
సిటీబ్యూరో: చిన్నపాటి వర్షం..ఈదురు గాలులకే మహానగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యవస్థమవుతోంది. విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వైర్లు తెగడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, ఫీడర్లు ట్రిప్పవడం వంటి ఘటనలతో నగరవాసులు గంటలకొద్దీ చీకటిలో మగ్గాల్సి వస్తోంది. ఇందుకు ఆదివారం నాటి ఘటనలే నిదర్శనం. సాయంత్రం వీచిన ఈదురు గాలికి నగరంలో తొంభై రెండు 11 కేవీ, పదిహేడు 33 కేవీ ఫీడర్లు ట్రిప్పయ్యాయి. సగం సిటీలో అంధకారం నెలకొంది. కొన్ని చోట్ల అర్థరాత్రికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తే..చాలా చోట్ల సోమవారం తెల్లవారే వరకు చీకట్లోనే గడపాల్సి వచ్చింది.
గ్రేటర్‌లోని హెదరాబాద్, రంగారెడ్డి జోన్స్ పరిధిలో ఆరు సర్కిళ్లు ఉన్నాయి. 13 వేల కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు ఉన్నాయి. 5200 పైగా 11కేవీ, 600పైగా 33 కేవీ ఫీడర్లు ఉన్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల నరికివేత, ఆయిల్ లీక్ అవుతున్న ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, శిథిలావస్థకు చేరిన కండెన్సర్ల స్థానంలో కొత్తవి అమర్చడం, లూజ్ కాంటాక్ట్‌లను సరి చేయడం వంటి పనులను సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగం చూస్తుంది. ఇందు కోసం 2013-14లో రూ.110 కోట్లు కేటాయించగా, 2015-16లో రూ.120 కోట్లు కేటాయించింది. ఇందులో కేవలం ట్రీ కటింగ్ పనులకే రూ.40 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. ఒకసారి చెట్లకొమ్మలు నరికిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం చాలా తక్కువ. కానీ అవే కొమ్మలను మళ్లీ మళ్లీ తొలగించినట్లు చెప్పి బిల్లులు డ్రా చేస్తున్నా.. నిజానికి చాలా చోట్ల అసలు పునరుద్ధరణ పనులు చేయడం లేదు. నిజానికి ఏటా వర్షాకాలానికి ముందే ప్రీమాన్‌సూన్ పనులు చే పడుతారు. కానీ ఈసారి వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలనే ఆలోచనతో ఫిబ్రవరి మాసంలోనే ఈ పనులు చేశారు. ఫీడర్ల వారిగా ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేసి పని చేసినా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మాత్రం మెరుగుపడలేదు. బ్రేక్‌డౌన్‌కు కారణాలను గుర్తించే పరిజ్ఞానం డిస్కం వద్ద ఇప్పటి వరకు లేదు. ఈదురుగాలి, వర్షానికి ఎక్కడైనా లైన్లు తెగిపడినా..చెట్ల కొమ్మలు విరిగిపడినా..కండెన్సర్లు దెబ్బతిన్నా స్థానిక సిబ్బంది లైన్ టూ లైన్ తిరిగి సమస్యను గుర్తించాల్సి వస్తోంది. ఆర్-ఏపీడీఆర్‌పీ పథకం కింద ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)’ను ఏర్పాటు చేయాలని భావించి, ఆ మేరకు నాలుగేళ్ల క్రితం గ్రీన్ లాండ్ డివిజన్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు.
సగం సిటీ అంధాకారంలోనే
ఆదివారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షానికి హబ్సిగూడ డివిజన్ ఇంద్రానగర్‌లో ఓ విద్యుత్ స్తంభం నేలకూలింది. స మీప బస్తీలన్నీ ఆ రాత్రంతా అంధకారంలోనే మగ్గాల్సి వచ్చింది. చెట్ల కొమ్మలు విరగడంతో పాటు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు గాలికి ఎగి రి లైన్లపై పడ్డాయి. దీంతో ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, తదితర ప్రాంతాల్లోని బస్తీలు రాత్రంతా అంధకారంలోనే ఉన్నాయి. చంపాపేట్ డివిజన్ రాజీవ్‌శెట్టి న గర్‌లో విద్యుత్ వైరు తెగిపడింది. అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఖైరతాబాద్ ఆదర్శ్‌నగర్, వెంకటరమణ కాలనీలో అర్థరాత్రి వరకు సరఫరా నిలిచింది. ఫెక్సీలు విద్యుత్ వైర్లపై పడటంతో బోడుప్పల్, నాగోల్, మలక్‌పేట్, చైతన్యపురి, సరూర్‌నగర్, చంపాపేట్, ఆస్మాన్‌ఘడ్ తదితర పాంత్రాల్లో అర్థరాత్రి వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర సమయంలో అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడం లేదు. 1912 కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 2000 ఫిర్యాదులు వస్తుండగా, ఆదివారం ఒక్క రోజే ఐదు వేలకుపైగా కాల్స్ వచ్చినట్లు సమాచారం.